32.1 C
Hyderabad
Wednesday, October 2, 2024

నవంబర్‌ 3 నుంచి ఇంజినీరింగ్‌ క్లాసులు … జేఎన్‌టీయూ అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల!

హైదరాబాద్: జేఎన్‌టీయూ – హైదరాబాద్‌ పరిధిలో ఇంజినీరింగ్‌ ఫస్టియర్‌ క్లాసులు న‌వంబ‌రు 3 నుంచి ప్రారంభం కానున్నాయి. విశ్వవిద్యాలయం జారీ చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం న‌వంబ‌రు 3 నుంచి డిసెంబరు 28 వరకు మొదటి సెమిస్టర్‌ తొలి విడత తరగతులుంటాయి. డిసెంబరు 29 నుంచి జనవరి 4 వరకు మొదటి మిడ్‌టర్మ్‌ పరీక్షలుంటాయి. జనవరి 5 నుంచి మార్చి 2 వరకు రెండో విడత తరగతులు జరుగుతాయి. అదేనెల 17 నుంచి సెమిస్టర్‌ ముగింపు పరీక్షలుంటాయి.

రెండో సెమిస్టర్‌ తరగతులు ఏప్రిల్‌ 3 నుంచి ప్రారంభమవుతాయి. జూన్‌ 10 వరకు తరగతులు కొనసాగుతాయి. మధ్యలో మే 15 నుంచి 27 వరకు వేసవి సెలవులుంటాయి. జూన్‌ 12 నుంచి 17 వరకు మొదటి మిడ్‌ టర్మ్‌ పరీక్షలు జరుగుతాయి. అదేనెల 19 నుంచి ఆగస్టు 12 వరకు రెండో విడత తరగతులు జరుగుతాయి.  ఆగస్టు 14 నుండి 19 వరకు రెండవ-మిడ్ పరీక్షలు. ఆగస్టు 21 నుండి 26 వరకు ప్రిపరేషన్ సెలవులు ఉంటాయి.  ఆగస్టు 28 నుంచి సెప్టెంబరు 9 వరకు సెమిస్టర్‌ ఫైనల్‌ పరీక్షలు ఉంటాయి.

ఇక.. ఎంటెక్‌, ఎం.ఫార్మసీ మొదటి ఏడాది తరగతులు అక్టోబ‌రు 26 నుంచి ప్రారంభమయ్యాయి. మొదటి సెమిస్టర్‌ పరీక్షలు మార్చి 13 నుంచి 25 వరకు జరుగుతాయి. రెండో సెమిస్టర్‌ తరగతులు వచ్చే ఏడాది మార్చి 27 నుంచి ప్రారంభమవుతాయి. మే 15 నుంచి 27 వరకు వేసవి సెలవులు ఉంటాయి. ఆగస్టు 24 నుంచి సెప్టెంబరు 6 వరకు రెండో సెమిస్టర్‌ పరీక్షలు జరుగుతాయి. ఎంబీఏ, ఎంసీఏ రెండో ఏడాది తరగతులు న‌వంబ‌రు 10 నుంచి ప్రారంభం కానున్నాయి.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles