26.2 C
Hyderabad
Wednesday, October 2, 2024

సోషల్ మీడియాపై పిర్యాదుల పరిష్కారానికి అప్పిలేట్ ప్యానెల్ ఏర్పాటు… కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్!

న్యూఢిల్లీ: సోషల్‌ మీడియా వేదికలు నేడు శక్తిమంతమైన సాధనాలుగా మారాయి. ఈ క్రమంలో సామాజిక మాధ్యమాలు జవాబుదారీగా ఉండాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వివాదాస్పద కంటెంట్‌ నిరోధంపై అటు ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ వంటి సోషల్‌మీడియా వేదికల నిర్ణయాలకు వ్యతిరేకంగా వినియోగదారుల పిర్యాదులను పరిష్కరించేందుకు అప్పిలేట్‌ ప్యానెల్‌ను కేంద్రం నోటిఫై చేసింది.

ముగ్గురు సభ్యులతో కూడిన గ్రీవెన్స్ అప్పీలేట్ కమిటీ(లు)ను మూడు నెలల్లో ఏర్పాటు చేయనున్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

“వినియోగదారులను శక్తివంతం చేయడం కోసం మధ్యవర్తి నియమించిన గ్రీవెన్స్ ఆఫీసర్ నిర్ణయాలకు వ్యతిరేకంగా అప్పీళ్లను విచారించేందుకు గ్రీవెన్స్ అప్పీలేట్ కమిటీ (జీఏసీ)ని ప్రవేశపెట్టారు’’ అని ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ట్వీట్ చేశారు.

ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త నిబంధనల ప్రకారం… అశ్లీలత, ట్రేడ్‌మార్క్ ఉల్లంఘనలు, నకిలీ సమాచారం, దేశ సార్వభౌమత్వానికి ముప్పు కలిగించే విషయాలతో పాటు అభ్యంతరకరమైన మతపరమైన కంటెంట్‌ను (హింసను ప్రేరేపించే ఉద్దేశ్యంతో) నియంత్రణ చేయవచ్చు.  సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు ఫ్లాగ్ చేయవచ్చు. అటువంటి  నిర్ణయాలను ఫిర్యాదు కమిటీల ముందు సవాలు చేయవచ్చు.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles