28.2 C
Hyderabad
Wednesday, October 2, 2024

ఉద్యోగ నోటిఫికేషన్‌లపై కేంద్రం శ్వేతపత్రం విడుదల చేయాలి…. మంత్రి హరీశ్‌రావు డిమాండ్!‌

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం గత 8ఏళ్లలో విడుదల చేసిన ఉద్యోగాల నోటిఫికేషన్లపై శ్వేతపత్రం విడుదల చేయాలని మంత్రి టీ హరీశ్‌రావు కేంద్రాన్ని డిమాండ్ చేశారు.‌

ఉద్యోగాల విషయంలో కేంద్రం… ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమైంది. మరోవైపు, తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్) ప్రభుత్వం అదే సమయంలో 90,000 ఉద్యోగాల నియామకాలను చేపట్టడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ సర్వీసుల్లోకి 1.5 లక్షల మంది ఉద్యోగులను నియమించిందని ఆయన చెప్పారు.

నల్లధనాన్ని నియంత్రించేందుకు బీజేపీ పెద్దనోట్ల రద్దుకు దిగింది కానీ, ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయింది. ఒక్కొక్కరి ఖాతాలో లక్షల రూపాయలు జమ చేస్తామని… కేంద్రం జన్‌ధన్‌ ఖాతాలు తెరిపించిందని, కానీ బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం ఇంతవరకు చేసిందేమీ లేదన్నారు.

పంపుసెట్లకు విద్యుత్ మీటర్లను బిగించడానికి నిరాకరించినందుకు తెలంగాణకు రూ.30,000 కోట్లకు పైగా నిధులు రాకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుందని మంత్రి  ఆరోపించారు. కేంద్రం ఒత్తిడికి లొంగడానికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నిరాకరించారని అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఉచితంగా రాత్రింబవళ్లు కరెంటు ఇస్తుందన్నారు.

టీఆర్‌ఎస్ ప్రభుత్వం నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గం రూపురేఖలను మార్చిందని, దీంతో పాటు 28వ  మండలాన్ని కూడా ఏర్పాటు చేసింది. పీహెచ్‌సీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి.. రూ.2కోట్లతో ఆస్పత్రిని నిర్మించనున్నట్లు తెలిపారు.

నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ పథకాలను వివరిస్తూ సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులను త్వరలో పూర్తి చేసి నారాయణఖేడ్‌ ప్రాంతంలోని పొలాలకు గోదావరి నీటితో సాగునీరు అందిస్తామన్నారు.

జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పి మంజుశ్రీ, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, అదనపు కలెక్టర్ రాజహర్షి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles