25.7 C
Hyderabad
Wednesday, October 2, 2024

మరోసారి తెరపైకి ‘ఉమ్మడి పౌర స్మృతి’…. రాజ్యసభలో ప్రైవేటు మెంబర్ బిల్లు!

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా యూనిఫాం సివిల్ కోడ్ (UCC) అమలు చేయాలంటూ బిజెపి సభ్యుడు ప్రైవేట్ మెంబర్ బిల్లును రాజ్యసభలో నిన్న ప్రవేశపెట్టారు. దీనిపై ప్రతిపక్ష సభ్యుల నుండి తీవ్ర నిరసన వ్యక్తమైంది. విపక్ష సభ్యులు బిజెపి సభ్యుడు కిరోడి లాల్ మీనాను బిల్లును ఉపసంహరించుకోండి అని అభ్యర్థించారు. దేశంలోని లౌకిక నిర్మాణాన్ని నాశనం చేసే చట్టాన్ని ఆమోదించవద్దని చైర్మన్ జగదీప్ ధన్‌ఖర్‌ను కోరారు.

ప్రతిపక్ష పార్టీల తీవ్ర నిరసనల మధ్య ‘భారత్‌లో ఉమ్మడి పౌరస్మృతి బిల్లు`2020’ని బీజేపీ ఎంపీ కిరోది లాల్‌ మీనా ఎగువసభలో ప్రవేశపెట్టారు. ఉమ్మడి పౌర స్మృతి తయారీ కోసం జాతీయ తనిఖీ, దర్యాప్తు కమిటీ ఏర్పాటు చేయాలని, దేశవ్యాప్తంగా దీనిని అమలు చేయాలని, ఈ బిల్లును చర్చకు చేపట్టాలని బీజేపీ సభ్యులు కిరోది లాల్‌ మీనా విజ్ఞప్తి చేశారు. అయితే, ప్రతిపక్ష కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌, ఎండీఎంకే, ఆర్‌జేడీ, ఎస్‌పీ, ఎన్‌సీపీ సభ్యులు బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రతిపక్ష సభ్యులు డిమాండ్‌ చేయడంతో రాజ్యసభ చైర్మన్‌ జగదీప్‌ ధన్కర్‌ దీనిపై ఓటింగ్‌ పెట్టారు. బిల్లుకు అనుకూలంగా 63మంది, వ్యతిరేకంగా 23 మంది ఓటేశారు. దీంతో బిల్లుపై చర్చ చేపట్టారు.

కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నుండి చాలా మంది ప్రతిపక్ష సభ్యులు చర్చ సమయంలో, ఓటింగ్ సమయంలో సభకు హాజరు కాలేదు. అయితే ఎండీఎంకే సభ్యుడు వైగో బిల్లును వ్యతిరేకిస్తూ, “దేశభక్తి మీ గుత్తాధిపత్యం కాదు” అని ఆరోపించారు.

ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ అజెండాను మోదీ ప్రభుత్వం ఒకదారి తర్వాత మరొకటి అమలు చేస్తోందని విమర్శించారు. ఇప్పటికే కశ్మీరును అంతం చేశారని, ఇప్పుడు పౌరస్మృతిని తీసుకొస్తున్నారని చెప్పారు. దేశాన్ని ధ్వంసం చేయడం, సమగ్రతను దెబ్బతీయడం, మైనారిటీలను భయాందోళనకు గురిచేయడం కోసమే బిల్లు తీసుకొచ్చారని వైగో ఆగ్రహం వెలిబుచ్చారు.

సీపీఐ సభ్యుడు పి.సంతోశ్‌ కుమార్‌ మాట్లాడుతూ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. బిల్లు ఆమోదం పొందితే దేశంలో కొనసాగుతున్న సామాజిక పొందిక, భిన్నత్వంలో ఏకత్వం ధ్వంసమవుతుందని హెచ్చరించారు.

ఆర్‌జేడీ సభ్యుడు మనోజ్‌ కుమార్‌ మాట్లాడుతూ ఇంతకుముందు ఈ బిల్లును అనేకసార్లు సభలో ప్రవేశపెట్టారని, ఇప్పుడు ఇంత హడావుడిగా ఎందుకు చర్చకు చేపట్టారని ప్రశ్నించారు. ఎస్‌పీ సభ్యుడు రామ్‌గోపాల్‌ యాదవ్‌ మాట్లాడుతూ రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు బిల్లు వ్యతిరేమని చెప్పారు. బిల్లును ఉపసంహరించుకోవాల్సిందిగా బీజేపీ సభ్యులు మీనాకు సూచించాలని చైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు.

ఐయూఎంఎల్ సభ్యుడు (IUML) యొక్క అబ్దుల్ వహాబ్ మాట్లాడుతూ… ఇది ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే చర్య. భారతదేశంలో దీనిని అమలు చేయడం సాధ్యం కాదని అన్నారు.  ఇది దేశానికి ప్రయోజనం కలిగించదు, ఈ బిల్లును వెనక్కి తీసుకోండి” అని ఆయన అన్నారు.

సీపీఐ నుంచి ఎలమరం కరీం మాట్లాడుతూ భారతదేశం లౌకిక దేశమని, కూలీలకు వేతనాలు ఇవ్వాలని ఎన్నో సూత్రాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదన్నారు. “ఈ బిల్లు దేశాన్ని కాల్చేస్తుందని”  కరీం అన్నారు.

ప్రతిపక్ష సభ్యుల ఆరోపణలను సభా నాయకుడు పీయూశ్‌ గోయల్‌ తోసిపుచ్చారు. సభ్యుడు తన చట్టబద్ధమైన హక్కును లేవనెత్తారని చెప్పుకొచ్చారు. ఈ అంశంపై సభలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles