26.2 C
Hyderabad
Wednesday, October 2, 2024

‘జేఎల్’ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. తెలంగాణ ఏర్పడ్డాక ఇదే తొలిసారి!

హైదరాబాద్: రాష్ట్రంలో జూనియర్ లెక్చరర్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. 1392 జేఎల్ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. డిసెంబరు 16 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. అభ్యర్థులు జనవరి 6 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ లేదా జులైలో రాతపరీక్ష నిర్వహించనున్నారు.

మొత్తం నోటిఫై చేసిన వాటిలో 724 పోస్టులు మల్టీ-జోన్ I కింద, 668 మల్టీ-జోన్ IIలో ఉన్నాయి. గణితంలో 154, ఇంగ్లీషులో 153, జువాలజీలో 128, హిందీలో 117, బోటనీ, కెమిస్ట్రీలో ఒక్కొక్కటి 113 సహా 27 విభిన్న సబ్జెక్టుల్లో పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు.

అర్హత గల అభ్యర్థులు కమిషన్ వెబ్‌సైట్ https://www.tspsc.gov.in/లో అందుబాటులో ఉన్న ప్రొఫార్మా అప్లికేషన్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

2008లో నాటి ఉమ్మడి రాష్ట్రంలో 1100 జూనియర్ లెక్చరర్ల పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో ఇది తెలంగాణ రాష్ట్రంలో తొలి నోటిఫికేషన్‌గా నిలిచింది.

వివరాలు..

జూనియర్ లెక్చరర్ పోస్టులు : ఖాళీల సంఖ్య: 1392

అర్హత: 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ డిగ్రీ అర్హత ఉండాలి. బీఏ, బీకామ్, బీఎస్సీ హానర్స్ డిగ్రీ ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి: 01.07.2022 నాటికి 18-44 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులకు 5 సంవత్సరాలు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, ఎన్‌సీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, బీసీ-ఎస్సీ-ఎస్టీ-ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలపాటు వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా.

దరఖాస్తు/పరీక్ష ఫీజు: అభ్యర్థులు దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.200, పరీక్ష ఫీజు కింద రూ.120 చెల్లించాలి. నిరుద్యోగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు పరీక్ష ఫీజు మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది.

పరీక్షవిధానంమొత్తం 450 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్ 150 ప్రశ్నలు-150 మార్కులు (ఒక్కో ప్రశ్నకు ఒకమార్కు), పేపర్-2 అభ్యర్థికి సంబంధించిన సబ్జెక్టు నుంచి 150 ప్రశ్నలు 300 మార్కులు (ఒక్కో ప్రశ్నకు 2 మార్కులు) ఉంటాయి. పరీక్ష సమయం ఒక్కో పేపరుకు 150 నిమిషాల సమయం కేటాయించారు. పేపర్-1 ఇంగ్లిష్, తెలుగులో; పేపర్-2 ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటుంది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles