32.1 C
Hyderabad
Wednesday, October 2, 2024

సౌదీ టూరిస్ట్ వీసా నిబంధనలపై గందరగోళం…. ఇబ్బందుల్లో భారతీయులు!

జెడ్డా: రియాద్‌లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 62 ఏళ్ల హైదరాబాదీ మహిళను ఇటీవల అక్కడి అధికారులు అడ్డుకున్నారు. ఊహించని పరిణామంతో ఆమె దిగ్భ్రాంతికి గురైంది. వీసా నిబంధనలను ఉల్లంఘించి, ఆమె ఎక్కువ కాలం సౌదీలో గడిపారని, హైదరాబాద్‌కు వెళ్లే విమానంలో ఎక్కడానికి అనుమతించకుండా విమానాశ్రయం నుండి వెనక్కి పంపించారని చెప్పారు.

టూరిస్ట్ వీసాల విధానాలు, నియమాలు తెలియక ఇబ్బందుల్లో పడిన భారతీయులలో ఆమె ఒకరు. మహిళ భర్త కుటుంబ విజిట్ వీసా కోసం దరఖాస్తు చేయకుండా హైదరాబాద్‌లోని ట్రావెల్ ఏజెంట్ నుండి ఆమెకు టూరిస్ట్ వీసా ఏర్పాటు చేశాడు. సౌదీ అరేబియా ఇటీవల తన పర్యాటక, సందర్శన వీసా ప్రక్రియను సులభతరం చేసిన తర్వాత ఆమెలాగే, ప్రతిరోజూ కొన్ని వందల మంది భారతీయులు సౌదీ అరేబియాకు చేరుకుంటున్నారు.

అదే సమయంలో, కొంతమంది భారతీయులు సులభంగా లభించే టూరిస్ట్ వీసాలను దుర్వినియోగం చేస్తున్నారు. ఐటి రంగంలో పని చేస్తున్నవారు, సౌదీలో ఉద్యోగాలు పొందడంతోపాటు అనేక మంది నైపుణ్యం కలిగిన యువత ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

బహుళ-ప్రవేశ పర్యాటక వీసా జారీ చేసిన తేదీ నుండి ఒక సంవత్సరం పాటు చెల్లుబాటు అవుతుంది. అయితే ఈ వీసా పొందినవారు 90 రోజులు మాత్రమే సౌదీలో ఉండేందుకు అర్హులు.  సింగిల్-ఎంట్రీ టూరిస్ట్ వీసా జారీ చేసిన తేదీ నుండి మూడు నెలల వరకు చెల్లుబాటు అవుతుంది. చాలా మంది భారతీయులకు గ్రే ఏరియా అనేది వీసా యొక్క చెల్లుబాటు, బస వ్యవధి, దీనిని అర్థం చేసుకోవడంలో చాలా మంది విఫలమవుతున్నారు. తద్వారా చాలామంది ఇబ్బందుల్లో పడుతున్నారు. టూరిస్ట్ వీసాలపై వచ్చే భారతీయులు మల్టిపుల్ ఎంట్రీకి వీసా చెల్లుబాటు ఒక సంవత్సరం ఉంటుందనే భావనలో ఉన్నారు. తదనుగుణంగా ఉంటున్నారు. వారు సౌదీ అరేబియా నుండి 90 రోజుల ముందు బహ్రెయిన్ జోర్డాన్ వంటి పొరుగు దేశాలకు బయలుదేరి, మరింత కాలం పాటు ఉండటానికి మళ్లీ సౌదీలోకి ప్రవేశిస్తున్నారు.

“ఈ సందర్శకులలో ఎక్కువ మంది ఇక్కడే తప్పు చేస్తారు” అని రియాద్‌లోని తెలుగు ఎన్నారై కార్యకర్త ముజమ్మిల్ షేక్ అన్నారు, అలాంటి అనేక కేసులు ఇప్పుడు బయటపడుతున్నాయి.

90 రోజులు దాటినందుకు చాలా మంది భారతీయులు సౌదీ అరేబియాలో చిక్కుకుపోయారు. భారీ జరిమానాలు చెల్లించడానికి కష్టపడుతున్నారు. ఫ్యామిలీ విజిట్ వీసాల మాదిరిగా కాకుండా, హోల్డర్ సౌదీని విడిచిపెట్టి మళ్లీ ప్రవేశించినా 90 రోజుల తర్వాత టూరిస్ట్ వీసాలు పొడిగించబడవని ఆయన తెలిపారు. మొత్తం బస వ్యవధి 90 రోజులకు మించకూడదు.

చమురు-ఆధారిత ఆర్థిక వ్యవస్థను ఇతర రంగాలవైపు మళ్లించి అంతర్జాతీయ పర్యాటకులకు ఉద్దేశించి విజన్ 2030 సంస్కరణ ఎజెండాలో భాగంగా 2030 నాటికి 100 మిలియన్ల మంది సందర్శకులను ఆకర్షించే లక్ష్యంతో సౌదీ అరేబియా వీసా నిబంధనలను సరళతరం చేసింది. ఈ నిర్ణయాన్ని అర్థం చేసుకోవడంలో భారతీయులను ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles