32.1 C
Hyderabad
Wednesday, October 2, 2024

తూర్పు జెరూసలేంలో కొత్త ఇళ్ల నిర్మాణంపై ఇజ్రాయెల్ పునరాలోచించాలి – ఈయూ!

పారిస్: తూర్పు జెరూసలెంలో కొత్త ఇళ్లను నిర్మించాలని, షేక్ జర్రా పరిసరాల్లోని భవనాలను కూల్చివేయాలని ఇజ్రాయెల్ తీసుకున్న నిర్ణయంపై యూరోపియన్ యూనియన్ లోని ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్‌ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నిర్ణయాన్ని పునరాలోచించాలని యూదు రాజ్యానికి పిలుపునిచ్చాయి.
ఇజ్రాయెల్ కార్యకలాపాలు పాలస్తీనా భవిష్యత్తుకు ప్రత్యక్ష ముప్పును కలిగిస్తాయని, ఇది అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించినట్లు అవుతుందని ఈయూ దేశాల విదేశాంగ మంత్రిత్వ శాఖలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం పరిష్కారానికి ఇది మరో అడ్డంకిగా మారుతుందని నాలుగు దేశాలు భావిస్తున్నాయి. ‘గివాత్ హమాటోస్‘ ‘హర్ హోమా‘మధ్య సహా తూర్పు-జెరూసలేంలో వందలాది కొత్త ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లాలనే నిర్ణయం పట్ల నాలుగు ఈయూ దేశాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. షేక్ జర్రా పరిసరాల్లో ఇటీవలి పరిణామాల పట్ల కూడా ఈయూ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. తూర్పు జెరూసలేం, అలాగే ‘ఏరియా సి‘ లోని పాలస్తీనా నిర్మాణాల తొలగింపు, కూల్చివేత చర్యలను శాశ్వతంగా నిలిపివేయాలని ఈయూ ఇజ్రాయెల్ ప్రభుత్వాన్ని కోరింది. ఇలాంటి దుందుడుకు చర్యలు ఉద్రిక్తతలకు ఆజ్యం పోయడానికి దోహదం చేస్తాయని ఈయూ విదేశాంగ మంత్రిత్వ శాఖలు సంయుక్త ప్రకటనలో తెలిపాయి.
ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య దశాబ్దాలుగా సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇజ్రాయెల్ పాక్షికంగా ఆక్రమించిన తూర్పు జెరూసలేం, గాజాస్ట్రిప్‌తో సహా వెస్ట్ బ్యాంక్ భూభాగాలపై పాలస్తీనియన్లు తమ స్వతంత్ర రాజ్యానికి దౌత్యపరమైన గుర్తింపును కోరుతున్నారు.
ఇజ్రాయెల్ ప్రభుత్వం పాలస్తీనాను స్వతంత్ర రాజకీయ మరియు దౌత్య సంస్థగా గుర్తించడానికి నిరాకరిస్తోంది. అంతేకాదు ఐక్యరాజ్యసమితి నుండి అభ్యంతరాలు ఉన్నప్పటికీ, ఆక్రమిత ప్రాంతాలలో స్థిరనివాసాలను నిర్మిస్తుందని ఏఎన్ఐని ఉటంకిస్తూ రష్యన్ వార్తా సంస్థ స్పుత్నిక్ వెల్లడించింది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles