25.7 C
Hyderabad
Wednesday, October 2, 2024

రాష్ట్రవ్యాప్తంగా 300 కొత్త వంతెనల నిర్మాణం!

హైదరాబాద్: రాష్ట్ర రహదారులపై కనెక్టివిటీని మెరుగుపరచడానికి రోడ్లు మరియు భవనాల శాఖ దాదాపు 300 కొత్త వంతెనలను నిర్మించనుంది. గత రెండేళ్లలో భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రంలో అనేక రోడ్లు, కల్వర్టులు తీవ్రంగా దెబ్బతిన్నాయని, రోడ్లు, కాజ్‌వేలు, కల్వర్టులు, వంతెనల మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ అధికారులు ఇటీవల ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. కొత్త వంతెనల నిర్మాణానికి రాష్ట్రవ్యాప్తంగా వివిధ రహదారులపై 300 ప్రాంతాలను ఆర్‌అండ్‌బీ అధికారులు గుర్తించారు.

గత రెండేళ్లలో వరదల కారణంగా దాదాపు 133 వంతెనలు దెబ్బతిన్నాయని, మరో  167 ప్రాంతాల్లో వంతెనలు నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్ర రహదారులపై విస్తృత సర్వే చేపట్టి తక్షణమే కనీసం 150 కొత్త వంతెనల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని, లేనిపక్షంలో వచ్చే వర్షాకాలంలో రోడ్లకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆర్‌అండ్‌బీ అధికారులు తెలిపారు. అన్ని కొత్త వంతెనలు 10 మీటర్ల నుండి 50 మీటర్ల పొడవుతో భూమి నుండి బాగా ఎత్తులో నిర్మించనున్నారు. తద్వారా నదుల్లో నీరు సాఫీగా వెళ్లడానికి వీలు కల్పిస్తుంది. అంతేకాదు భారీ వర్షాలు, వరదల సమయంలో అది మునిగిపోకుండా  ఉంటుందని అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు, వంతెనలు, కల్వర్టుల నిర్మాణానికి రూ.2,500 కోట్లు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. రోడ్ల మరమ్మతులు, కల్వర్టుల నిర్మాణాలకు త్వరగా టెండర్లు ఖరారు చేయాలని ఆర్‌అండ్‌బీ శాఖను ప్రభుత్వం కోరింది. మంజూరైన మొత్తంలో రోడ్ల మరమ్మతులకు రూ.1,865 కోట్లు, వంతెనలు, కల్వర్టుల నిర్మాణానికి రూ.635 కోట్లు కేటాయించారు.

కరీంనగర్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, మెదక్‌, నల్గొండ, మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, రంగారెడ్డి (రూరల్‌) సర్కిళ్లలో రోడ్లపై పలుచోట్ల కల్వర్టులు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… వర్షం కారణంగా మొత్తం 27,737.21 కి.మీ-నెట్‌వర్క్ ఆర్అండ్ బి రోడ్లు ధ్వంసం అయ్యాయి. కాగా 664 చోట్ల 1,675 కి.మీ. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా పరిధిలోని 1,087 కల్వర్టులు, రోడ్లు కూడా  దెబ్బతిన్నాయి.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles