Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

మతం మారితే జైలే…రాజస్థాన్‌లో మతమార్పిడి నిరోధక బిల్లు ఆమోదం!

జైపూర్: రాజస్థాన్‌లో మతమార్పిడి నిరోధక బిల్లు అటు మైనారిటీలు, ఇటు మతాంతర జంటల్లో తుఫానును రేకెత్తిస్తోంది. ఈ మేరకు రాజస్థాన్‌లో బలవంతపు, మోసపూరిత మతమార్పిడులను అరికట్టేందుకు భజన్‌లాల్ శర్మ ప్రభుత్వం అత్యంత కఠినమైన చట్టాన్ని తీసుకొచ్చింది. మంగళవారం రాజస్థాన్ అసెంబ్లీ… ‘రాజస్థాన్ చట్టవిరుద్ధ మత మార్పిడి నిరోధక బిల్లు-2025’ను మూజువాణి ఓటుతో ఆమోదించింది. ఇది భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్ర రాజకీయ దృశ్యంలో అలజడిని సృష్టించింది. ప్రధాన రాజ్యాంగ హక్కులను ప్రభావితం చేసే ఈ బిల్లును […]
Read more

బందీలను ‘పట్టించుకోని’ ఇజ్రాయెల్…దోహా దాడుల తర్వాత ఖతార్!

ఐక్యరాజ్యసమితి: దోహాలో హమాస్ నేతలపై దాడి చేసాక గాజా బందీల గురించి ఇజ్రాయెల్ “పట్టించుకోవడం లేదని” ఖతార్ ప్రధాన మంత్రి ఐక్యరాజ్యసమితికి తెలిపారు. అయితే ఈ దాడిని ఖండించే విషయంలో ప్రపంచ శక్తులు ఐక్యంగా ఉండటంతో శాంతి కోసం ఒత్తిడి చేస్తూనే ఉంటామని ఆయన ప్రతిజ్ఞ చేశారు. అమెరికా మిత్రదేశం ఖతార్‌పై మంగళవారం జరిగిన ఘోరమైన దాడితో, ఇజ్రాయెల్ ” అన్ని పరిమితులను దాటి వెళ్ళింది” అని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశంలో షేక్ మొహమ్మద్ […]
Read more

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ‘ఓట్లు కొనడానికి’ బీజేపీ ఒక్కో ఎంపీకీ 15-20 కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించిన అభిషేక్ బెనర్జీ!

కోల్‌కతా: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం సాధించాక…తృణమూల్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ బిజెపిపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ… కాషాయ శిబిరం “ఓట్లు కొనడానికి” ప్రతి ఎంపీకి రూ.15-20 కోట్లు ఖర్చు చేసిందని, ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేందుకు డబ్బు శక్తిని ఉపయోగించిందని ఆరోపించారు. లోక్‌సభలో టిఎంసి పార్లమెంటరీ పార్టీకి నాయకత్వం వహిస్తున్న బెనర్జీ, మంగళవారం జరిగిన ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేయడానికి బిజెపి నాయకులు “డబ్బు బస్తాలతో వచ్చారని” అన్నారు. మహారాష్ట్ర […]
Read more

ఉమర్ ఖలీద్ కేసులో బెయిల్‌ నిరాకరించడం న్యాయాన్ని అపహాస్యం చేయడమే!

న్యూఢిల్లీ: సెప్టెంబర్ 2020 ఢిల్లీ అల్లర్లకు సంబంధించిన ” కుట్ర” కేసులో ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్ సహా మరో ఏడుగురు నిందితుల బెయిల్ పిటిషన్లను ఇటీవల ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. జస్టిస్ నవీన్ చావ్లా, శైలీందర్ కౌర్‌లతో కూడిన డివిజన్ బెంచ్ తన తీర్పులో… శాంతియుత నిరసన హక్కును కాపాడుతుందని, కానీ నిరసన ముసుగులో కుట్రపూరిత హింసను… అనుమతించలేమని పేర్కొంది. ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్ పాత్రను “ప్రాథమికంగా తీవ్రమైనది” అని కోర్టు గుర్తించింది. ఈ […]
Read more

నేపాల్‌ మాజీ చీఫ్ జస్టిస్‌ను తాత్కాలిక ప్రధానిగా ప్రతిపాదించిన జన్‌జడ్‌ నేతలు!

న్యూఢిల్లీ: రాజకీయ తిరుగుబాటుగా మారిన నేపాల్ ‘జన్‌ జెడ్’నేతృత్వంలోని ప్రతినిధులు ఆ దేశ ఆర్మీ చీఫ్‌ను కలిసి, మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కర్కి పేరును తాత్కాలిక ప్రధానమంత్రిగా ప్రతిపాదించారని మీడియా నివేదికలు తెలిపాయి. నేపాల్‌లో సోమవారం ప్రారంభమై మంగళవారం తీవ్రరూపం దాల్చిన విద్యార్థుల నిరసనకు దెబ్బకు ప్రధానమంత్రి కె.పి. శర్మ ఓలి రాజీనామాకు దారితీసింది. శాంతిభద్రతలను కాపాడటానికి సైన్యం వీధుల్లో కవాతు నిర్వహించాల్సి వచ్చింది. అల్లర్ల కారణంగా 30 మంది మరణించారు. మొత్తం 1,033 మంది […]
Read more

హైదరాబాద్‌లో క్యాంటీన్లు…డ్వాక్రా గ్రూపులకు సాయం చేయనున్న జీహెచ్‌ఎంసీ!

హైదరాబాద్: నగరంలో మహిళల ఆర్థిక సాధికారతను ప్రోత్సహించడానికి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) స్వయం సహాయక బృందాలకు (SHGS) సహాయం చేస్తోంది. ఈ గ్రూపులు 33 ‘ఇందిరా మహిళా శక్తి’ క్యాంటీన్లను నిర్వహిస్తాయి. మహిళలకు ఆర్థిక భద్రతను పెంపొందించడానికి ఈ పథకాన్ని గత సంవత్సరం ప్రారంభించారు. ఈ క్యాంటీన్లు మహిళలకు ఉపాధిని కల్పించడమే కాకుండా, వారు ఆత్మవిశ్వాసం, స్వావలంబన పొందడంలో సహాయపడటంతో పాటు నామమాత్రపు ధరకు ప్రజలకు పోషకమైన భోజనాన్ని కూడా అందిస్తున్నాయి. ఈమేరకు NBT […]
Read more

హైదరాబాద్‌లోని ప్రముఖ రెస్టారెంట్లపై ఆహార భద్రతా బృందం దాడులు!

హైదరాబాద్: రాష్ట్ర ఆహార భద్రతా విభాగానికి చెందిన టాస్క్‌ఫోర్స్ హైదరాబాద్‌లోని ప్రముఖ రెస్టారెంట్లపై నిన్న దాడులు నిర్వహించింది. ఆహార భద్రత కమిషనర్‌కు అందిన ఫిర్యాదుల ఆధారంగా 10 అబ్సొల్యూట్ బార్బెక్యూ అవుట్‌లెట్‌లపై దాడులు జరిగాయి. బంజారా హిల్స్, ఇతర ప్రదేశాలలో తనిఖీలుఆహార భద్రత కమిషనర్ తన X హ్యాండిల్‌లో పంచుకున్న వివరాల ప్రకారం… హైదరాబాద్‌లోని AS రావు నగర్, కొంపల్లి, మేడిపల్లి, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, గచ్చిబౌలి, ఇనార్బిట్, మియాపూర్, వనస్థలిపురం, సికింద్రాబాద్‌లలో ఉన్న ప్రముఖ […]
Read more

ఆత్మహత్య అసహ్యం…జీవితం సర్వోత్తమం!

సెప్టెంబర్ 10…నేడు ఆత్మహత్యల నివారణ దినం. మనిషి జీవితం ఎంతో విలువైనది. మానవ జన్మ సర్వోత్తమమైనది. మన జీవితానికి గల పరమార్థం తెలుసుకొని, దాన్ని సార్థకం చేసుకోవాలంటే ఎలా జీవించాలో తెలుసుకోవాలి. కష్టాలను ఓర్చుకొని జీవితాన్ని కొనసాగించాలి. అయితే నేడు చిన్న చిన్న విషయాలకే కలత చెంది ఆత్మహత్య చేసుకొనే ధోరణి పెరగడం ఆందోళన కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో ఇస్లాం బోధించిన ఓర్పును వహిస్తూ.. జీవితంలో వచ్చే కష్టాలను అల్లాహ్ పెట్టిన పరీక్షలుగా భావించి ధైర్యంగా వాటిని […]
Read more

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో 13 మంది విపక్ష ఎంపీల క్రాస్ ఓటింగ్!

న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షం తమ 324 మంది ఎంపీలందరూ ఓటు వేసేలా చూసుకునేందుకు ఒక్క అవకాశాన్ని కూడా వదిలిపెట్టలేదు. కానీ ఫలితం రాజకీయ విశ్లేషకులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. విపక్షంలోని కనీసం 13 మంది ఎంపీలు ప్రత్యర్థి ఎన్డీఏకు చెందిన సి పి రాధాకృష్ణన్ కు మద్దతు ఇచ్చేందుకు గోడ దూకారు. ప్రతిపక్ష ఉమ్మడి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డికి కేవలం 300 ఓట్లు మాత్రమే వచ్చాయి, అంచనా వేసిన దానికంటే 24 తక్కువ […]
Read more

సరిహద్దు ఫెన్సింగ్‌ను నిలిపివేయాలంటూ మణిపూర్ హైవేలను దిగ్బంధించిన నాగా కౌన్సిల్‌!

ఇంఫాల్‌: మణిపూర్‌లోని నాగా తెగలకు ప్రాతినిధ్యం వహిస్తున్న యునైటెడ్ నాగా కౌన్సిల్ (UNC), స్వేచ్ఛా ఉద్యమ పాలన (FMR)ను ముగించి, 1,643-కి.మీ. భారతదేశం-మయన్మార్ సరిహద్దు వెంబడి కంచె నిర్మించాలనే కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా “వాణిజ్య నిషేధం” ప్రారంభించింది. రోడ్డు దిగ్బంధనం ఎటువంటి వాణిజ్య వస్తువులను దాటనివ్వదని UNC తెలిపింది. 2వనంబర్‌, 37వ నంబర్‌ జాతీయ రహదారుల వెంబడి నాగా ఆధిపత్య ప్రాంతాలలో నిరసనకారులు ట్రక్కులను అడ్డుకున్నారు. ప్రభావిత ప్రాంతాలలో సేనాపతి, ఉఖ్రుల్,టామెంగ్‌లాంగ్ ఉన్నాయి. దిగ్బంధనం కారణంగా మణిపూర్‌లోని […]
Read more
1 12 13 14 15 16 95

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.