Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

నేపాల్ మాజీ ప్రధాని భార్య సజీవ దహనం… ఇంటిని తగలబెట్టిన నిరసనకారులు!

ఖాట్మాండు: నేపాల్‌లో చెలరేగిన అసంతృప్తి జ్వాలలు తీవ్రరూపం దాల్చాయి. రెండోరోజైన మంగళవారం కూడా నిరసనలు, ఆందోళనల ఉధృతి కొనసాగింది. నేపాల్‌ మాజీ ప్రధాని జాలానాథ్‌ ఖనాల్‌ ఇంటికి ఆందోళనకారులు నిప్పంటించడంతో ఆయన భార్య రాజ్యలక్ష్మి చిత్రాకర్‌ సజీవదహనం అయ్యారు. జన్ జెడ్ ప్రదర్శనలు తీవ్రంగా పెరగడంతో నేపాల్ ప్రధాన మంత్రి కెపి ఓలి రాజీనామా చేయాల్సి వచ్చింది, అదే సమయంలో పార్లమెంట్ భవనం, ఖాట్మండులోని అధ్యక్ష కార్యాలయంతో సహా అనేక ప్రభుత్వ భవనాలను తగలబెట్టారు. మరోవంక నేపాల్ […]
Read more

ఖతార్‌లో హమాస్ నేతలపై ఇజ్రాయెల్ దాడి!

దుబాయ్: మధ్యప్రాచ్యంలో సంపన్న గల్ఫ్ దేశం ఖతార్‌లో ఉన్న హమాస్‌ నేతలే లక్ష్యంగా ఇజ్రాయెల్‌ దాడికి పాల్పడింది. సమ్మిట్‌ ఆఫ్‌ ఫైర్‌ పేరిట జరిపిన ఈ దాడితో దోహా నగరంలోని ఖతారా జిల్లా పరిధిలో పలు చోట్ల పేలుళ్లు సంభవించాయని, ఆకాశంలో దట్టమైన పొగలు అలుముకున్నాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. తాము కచ్చితమైన దాడులు చేశామని, 2023 అక్టోబరు 7 నాటి మారణహోమానికి ప్రత్యక్షంగా కారణమైనవారిని లక్ష్యంగా చేసుకున్నామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) తెలిపింది. కాగా, ఈ […]
Read more

గాజాకు వెళ్తున్న ఫ్లోటిల్లా ప్రధాన నౌకను ట్యునీషియా జలాల్లో ఢీకొట్టిన డ్రోన్!

గాజాకు వెళ్తున్న తమ ప్రధాన నౌకలలో ఒకదానిని ట్యునీషియా జలాల్లో డ్రోన్ ఢీకొట్టిందని… గాజాకు సహాయం అందించే అంతర్జాతీయ మానవతా మిషన్ గ్లోబల్ సుముద్ ఫ్లోటిల్లా (GSF) ధృవీకరించింది. పోర్చుగీస్ జెండా కింద ప్రయాణిస్తున్న ఫ్యామిలీ బోట్ లక్ష్యంగా చేసుకున్న డ్రోన్‌ దాడిలో… నౌక, దాని ప్రధాన డెక్, దిగువ నిల్వ ప్రాంతాలకు మంటలు చెలరేగాయి. అర్ధరాత్రి తర్వాత దాడి జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ఉన్న ఆరుగురు ప్రయాణికులు సిబ్బంది క్షేమంగా బయటపడ్డారు. “మా కీలక […]
Read more

బీహార్ SIR డాక్యుమెంట్లలో ఆధార్‌ను చేర్చండి…సుప్రీంకోర్టు!

న్యూఢిల్లీ: బీహార్‌లో సవరించిన ఓటరు జాబితాలో చేర్చడానికి గుర్తింపు రుజువుగా సమర్పించగల “12వ పత్రం”గా ఆధార్ కార్డును చేర్చాలని సుప్రీంకోర్టు భారత ఎన్నికల సంఘం (ECI)ని ఆదేశించింది. “బీహార్ సవరించిన ఓటరు జాబితాలో ఓటరును చేర్చడం/తొలగించడం కోసం ఒక వ్యక్తి గుర్తింపు కోసం ఆధార్ కార్డును కూడా పరిగణనలోకి తీసుకుంటారు” అని లైవ్‌లా ఉటంకించినట్లుగా, ECI సుప్రీంకోర్టు ముందు హామీ ఇచ్చింది. ఎన్నికలకు ముందు బీహార్‌లో ECI చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఏకపక్షం, రాజ్యాంగ […]
Read more

ఆగమాగమైన నేపాల్‌…19 మంది మృతి, హోం మంత్రి రాజీనామా!

ఖాట్మండు: నేపాల్‌లో పలు సోషల్ మీడియా యాప్‌లపై నిషేధాన్ని వ్యతిరేకిస్తూ అక్కడి యువత చేపట్టిన భారీ నిరసన రాజధాని ఖాట్మండులో తీవ్రమైన హింసకు దారి తీసింది. ఘర్షణల్లో 12 ఏళ్ల బాలుడితో సహా కనీసం 19 మంది మరణించారు. 300 మందికి పైగా గాయపడ్డారు. ఈ పరిస్థితికి బాధ్యత వహిస్తూ ఆ దేశ హోం మంత్రి రమేష్ లేఖక్ రాజీనామా చేసారు. విద్యార్థుల నిరసనల దెబ్బకు దిగివచ్చిన ప్రభుత్వం సామాజిక మాధ్యమాలపై నిషేధాన్ని ఎత్తివేయవలసి వచ్చింది. కోపంతో […]
Read more

క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తులకు శుభవార్త చెప్పిన రష్యా!

మాస్కో: ప్రాణాంతక మహమ్మారి క్యాన్సర్‌ బాధితులకు రష్యా గుడ్‌న్యూస్‌ వినిపించింది. సరైన చికిత్స లేక జీవితాంతం క్యాన్సర్‌తో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్‌ను కనిపెట్టింది. ‘ఎంటెరోమిక్స్’ పేరుతో తీసుకొచ్చిన ఈ టీకా క్లినికల్‌ ట్రయల్స్‌లో వంద శాతం ప్రభావం చూపింది. ఈ సంచలన వార్త లక్షలాది క్యాన్సర్‌ వ్యాధిగ్రస్తులకు ఓ ఆశాకిరణంగా మారింది. పలు కేసుల్లో క్యాన్సర్ గడ్డల పరిమాణాన్ని ఈ వ్యాక్సిన్ ఏకంగా 60 శాతం నుంచి 80 శాతం దాకా తగ్గిస్తున్నట్లు వెల్లడైంది. ఎలాంటి దుష్ప్రభావాలు […]
Read more

హైదరాబాద్‌లో 12 వేల కోట్ల విలువైన డ్రగ్స్‌ ఫ్యాక్టరీ సీజ్‌!

హైదరాబాద్: మహారాష్ట్ర పోలీసులు హై­ద­రా­బా­ద్‌­లో భారీ డ్ర­గ్స్ ఫ్యా­క్ట­రీ బం­డా­రాన్ని బయటపెట్టారు. ఇక్కడినుంచి దేశంలోని అనేక ప్రాంతాలకు మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హైదరాబాద్‌లోని సింథటిక్ మాదకద్రవ్యాల తయారీ యూనిట్‌ను మహారాష్ట్ర పోలీసులు సీజ్‌ చేశారు. స్వాధీనం చేసుకున్న పదార్థం విలువ దాదాపు రూ.12,000 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు. ఇటీవలి కాలంలో జరిగిన అతిపెద్ద మాదకద్రవ్యాల డెన్‌ బయటపడటం ఇదే ప్రథమం. మీరా-భయందర్ వాసాయి-విరార్ (MBVV) పోలీసుల క్రైమ్ డిటెక్షన్ యూనిట్ (సెల్-4) హైదరాబాద్‌లోని […]
Read more

భారతదేశంలో అరుదైన ‘బ్లడ్ మూన్‌’… 82 నిమిషాలసేపు కొనసాగిన చంద్రుని వైభవం!

బెంగళూరు: లడఖ్ నుండి తమిళనాడు వరకు దేశ వ్యాప్తంగా నిన్న రాత్రి కనిపించిన అరుదైన ‘బ్లడ్‌మూన్‌’ను కోట్లాదిమంది తిలకించారు. ఈ సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని చూడటానికి అంతరిక్ష పరిశీలకులు, ఖగోళ శాస్త్రజ్ఞులు చంద్రుని వైపు తమ దృష్టిని మరల్చారు. దేశంలోని కొన్ని ప్రాంతాలలో రుతుపవన వర్షాలు కురుస్తుండటంతో మేఘావృతమైన ఆకాశంలో చంద్రుడు దాగుడుమూతలు ఆడుతుండగా రాత్రి 9:57 గంటలకు భూమి నీడ చంద్రుడిని కప్పేయడం ప్రారంభించింది. రాత్రి 11:01 గంటలకు భూమి నీడ చంద్రుడిని పూర్తిగా కప్పి, […]
Read more

ప్రధాని మోడీ చైనా పర్యటన…ఆసక్తి రేపుతున్న ప్రశ్నలు!

న్యూఢిల్లీ: ప్రస్తుత భౌగోళిక రాజకీయాల్లో ప్రధాని మోడీ చైనా పర్యటన ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఆగస్టు 31-సెప్టెంబర్ 1, 2025న చైనాలోని టియాంజిన్‌లో జరిగిన షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యాక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందన, రష్యాతో భారతదేశ మిత్రత్వం… అమెరికాతో పాటు చైనా మరొక సూపర్ పవర్‌ ఆవిర్భావం వంటి ప్రశ్నలపై ప్రపంచం దృష్టి కేంద్రీకరించింది. SCO శిఖరాగ్ర సమావేశానికి ప్రధానమంత్రి మోదీ చైనాను సందర్శించడం, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, […]
Read more

గోదావరి తాగునీటి ప్రాజెక్టుకు నేడు సీఎం శంకుస్థాపన!

హైదరాబాద్: నగర నీటి సరఫరా అవసరాలను బలోపేతం చేయడానికి రూ.8,858 కోట్లతో చేపట్టిన గోదావరి తాగునీటి పథకం II & III దశల పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు శంకుస్థాపన చేయనున్నారు. మూసీ పునరుజ్జీవన పథకంలో భాగంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలను మంచినీటితో నింపడం ఈ కార్యక్రమాల లక్ష్యం. రాష్ట్ర ప్రభుత్వం రూ.7,360 కోట్ల వ్యయంతో HAM (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) పథకం కింద ఈ ప్రాజెక్టును చేపడుతుంది. 40 శాతం పెట్టుబడిని […]
Read more
1 13 14 15 16 17 95

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.