Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

మహమ్మద్ దీపక్‌ను చంపడానికి డబ్బు ఆఫర్ చేసిన వ్యక్తి అరెస్టు!

డెహ్రాడూన్: కోట్ద్వార్‌లో జరిగిన ఒక దుకాణం పేరు వివాదంలో ‘మహమ్మద్ దీపక్’గా ప్రసిద్ధి చెందిన జిమ్ యజమాని దీపక్ కుమార్ హత్యకు రూ. 2 లక్షల రివార్డును ప్రకటించిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. బీహార్‌లోని మోతీహరి నివాసి అయిన నిందితుడు ఉత్కర్ష్ కుమార్ సింగ్ తన ఫాలోవర్స్‌ సంఖ్యను పెంచుకోవడానికి సోషల్ మీడియాలో ఈ సందేశాన్ని పోస్ట్ చేశానని పోలీసులకు చెప్పాడని తెలిపారు. దుకాణం పేరు మార్చమని దాని యజమానిపై ఒత్తిడి తెచ్చేందుకు ఒక బట్టల దుకాణం […]
Read more

అహ్మదాబాద్‌లో నకిలీ కాల్ సెంటర్‌ మోసాన్ని ఛేదించిన ఈడీ!

హైదరాబాద్: అమెరికా పౌరులను మోసం చేస్తున్న అహ్మదాబాద్‌లోని నకిలీ కాల్ సెంటర్లపై హైదరాబాద్ ఈడీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ స్కామ్‌కు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గుజరాత్‌లోని ఆరు ప్రదేశాలలో సోదాలు నిర్వహించింది. క్రిప్టోకరెన్సీ, నగదు స్వాధీనంఈ సోదాల్లో 12,000 విలువైన క్రిప్టోకరెన్సీని గుర్తించి, దానిని ED అధికారిక క్రిప్టో వాలెట్‌కు బదిలీ చేశారు. 31 బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేశారు. నిందితులు తమను తాము యూఎస్ అధికారులమని చెప్పుకుంటూ, గిఫ్ట్ కార్డ్‌ల ద్వారా డబ్బులు వసూలు […]
Read more

రష్యా చమురు కొనుగోలును నిలిపివేయాలన్న ట్రంప్ ఆదేశంపై మౌనం పాటిస్తున్న మోడీ ప్రభుత్వం!

న్యూఢిల్లీ: రష్యా ముడి చమురు దిగుమతులన్నింటినీ నిలిపివేయడానికి భారతదేశం అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై మోడీ ప్రభుత్వం స్పష్టమైన మౌనం కొనసాగిస్తోంది. రష్యా చమురు కొనుగోలును ఆపుతామని న్యూఢిల్లీ హామీ ఇచ్చిందని వాషింగ్టన్ ప్రకటించింది…అయితే రష్యా చమురును నిలిపివేస్తున్నట్లు భారత్ అధికారికంగా ధృవీకరించలేదు. భారతదేశం రష్యన్ ముడి చమురు కొనుగోలును ఆపడానికి అంగీకరించిందని ట్రంప్ చేసిన ప్రకటనపై ఈ మౌనం అనేక సందేహాలు రేగుతున్నాయి. కొనుగోలు నుంచి వెనక్కి తగ్గే బదులు, మోడీ […]
Read more

మైనారిటీలపై తుపాకీ గురిపెట్టిన అస్సాం సీఎం!

గువహటి: బీజేపీ అస్సాం యూనిట్‌ ‘X’ లో ఒక వీడియోను పోస్ట్ చేయడంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఆ వీడియోలో ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తుపాకీతో గురిపెట్టి ఇద్దరు వ్యక్తులపై కాల్పులు జరుపుతున్నట్లు చూపించారు – ఆ ఇద్దరిలో ఒకరు తలకు టోపీ ధరించగా, మరొకరు గడ్డంతో ఉన్నారు. దీనికి- “పాయింట్-బ్లాంక్ షాట్” అనే శీర్షిక పెట్టారు. అయితే సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు రావడంతో ఆ వీడియోను బీజేపీ తొలగించింది. కానీ ఈ వీడియో […]
Read more

ఏకాభిప్రాయం ద్వారా ఉమ్మడి పౌర స్మృతిని రూపొందించాలి…ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్!

ముంబయి: అన్ని వర్గాలను పరిగణనలోకి తీసుకొని ఉమ్మడి పౌర స్మృతిని (యూసీసీ) రూపొందించాలని, అది విభేదాలకు దారితీయకూడదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) అధిపతి మోహన్ భాగవత్ అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో జరిగిన సంభాషణలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై భాగవత్ మాట్లాడుతూ… ఒప్పందాలలో ఇచ్చిపుచ్చుకోవడం ఉంటుందని అన్నారు. “అది ఇరుపక్షాలకూ లాభదాయకంగా ఉండాలి… మనం నష్టపోకుండా చూసుకోవాలని అన్నారు.” హిందుత్వ సిద్ధాంతకర్త వీర్ […]
Read more

బీఆర్ఎస్ అంటే ‘బ్లాక్‌మెయిల్ రాజకీయ సమితి’…సీఎం రేవంత్ రెడ్డి!

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గులాబీ పార్టీపై ఘాటు విమర్శలు చేశారు. బీఆర్ఎస్‌ను ‘బ్లాక్‌మెయిల్ రాజకీయ సమితి’గా అభివర్ణించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు వంటి సంఘటనలు… బీఆర్ఎస్ నాయకత్వం వ్యాపారవేత్తలను డబ్బు కోసం ఎలా బ్లాక్‌మెయిల్ చేసిందో, భూములను ఎలా కబ్జా చేసిందో నిరూపిస్తున్నాయని ఆయన అన్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ములుగులో జరిగిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… గులాబీ పార్టీ ఖాతాలో ఉన్న రూ. 1500 కోట్లు అనైతిక పద్ధతుల ద్వారా […]
Read more

పదిరోజుల్లో రంజాన్‌ మాసం…అల్-అక్సాలోకి పాలస్తీనియన్ల ప్రవేశాన్ని నిషేధించిన ఇజ్రాయెల్!

జెరూసలేం: రంజాన్ నెల ఆరంభానికి మరో పదిరోజులే మిగిలింది. ఈ తరుణంలో జెరూసలేంలోని పాలస్తీనియన్లు అల్-అక్సా మసీదులోకి ప్రవేశాన్ని నిషేధిస్తూ ఇజ్రాయెల్ నిఘా సంస్థ నుండి వాట్సాప్ సందేశాలు వస్తున్నట్లు సమాచారం. ఫిబ్రవరి 5న ఇజ్రాయెల్ ఆక్రమణ అధికారులు పాలస్తీనియన్ జెరూసలేమియులను అల్-అక్సా మసీదులోకి ప్రవేశించకుండా నిషేధిస్తూ కొత్త ఉత్తర్వులు జారీ చేసినట్లు పాలస్తీనియన్ వార్తా సంస్థ వాఫా నివేదించింది. వాడి హిల్వే ఇన్ఫర్మేషన్ సెంటర్‌ను ఉటంకిస్తూ… జెరూసలేం పరిసర ప్రాంతమైన అల్-ఇస్సావియాకు చెందిన ముగ్గురు మాజీ […]
Read more

ఇరాన్‌తో అణుచర్చలపై సంతృప్తి వ్యక్తం చేసిన ట్రంప్!

మస్కట్‌: ఒమన్‌లో ఇరాన్‌, అమెరికా పరోక్ష చర్చలు ఉభయదేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగకుండా నిరోధించగలవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. “ఇరాన్‌తో మేము చాలా మంచి చర్చలు జరిపాము. “వచ్చే వారం ప్రారంభంలో మేము మళ్ళీ కలుస్తాము” అని ఆయన అన్నారు, అణు ఒప్పందం విఫలమైతే “పరిణామాలు” తీవ్రంగా ఉంటాయని గత వారాంతంలో ట్రంప్‌ హెచ్చరించిన విషయం తెలిసిందే అంతకుముందు, మస్కట్‌లో అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన పరోక్ష చర్చలు రెండు వైపులా మళ్ళీ కలవడానికి […]
Read more

బడ్జెట్ 2026లో మైనారిటీల పట్ల వివక్ష చూపిన కేంద్రం!

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌లో మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు కేవలం రూ.3,400 కోట్లు మాత్రమే కేటాయించడం, 20% జనాభా ఉన్న మైనారిటీలకు తీవ్ర నిరాశను మిగిల్చింది. నిధుల కోత, స్కాలర్‌షిప్‌ల తగ్గింపు, విద్యా రుణాల సబ్సిడీల నిలిపివేత వంటి నిర్ణయాలు మైనారిటీల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయని రూఢీ అవుతోంది. ఇది కేవలం సంప్రదాయ బడ్జెట్ లావాదేవీల (eyewash) వ్యవహారంగా మిగిలిపోయిందని విమర్శలు వస్తున్నాయి. కాగా, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ 2006లో ముస్లిం మైనారిటీ వర్గం సంక్షేమం కోసం […]
Read more

కాళేశ్వరం స్కామ్‌పై కేసీఆర్, హరీష్ రావులను అరెస్టు చేయండి… బీజేపీకి సీఎం రేవంత్‌ సవాల్‌!

హైదరాబాద్: కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్), మాజీ బీఆర్ఎస్ మంత్రి హరీష్ రావులను అరెస్టు చేయాలని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కాళేశ్వరం కుంభకోణంలో భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నాయకులను అరెస్టు చేసేలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఒప్పించాలని తెలంగాణ సీఎం, బీజేపీ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు అరవింద్‌కు సవాల్ విసిరారు. బీజేపీ, బీఆర్ఎస్‌లకు ఓటు వేయవద్దని తెలంగాణ […]
Read more
1 15 16 17 18 19 159

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.