Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

పురానాపుల్ హింసపై ఆందోళన వ్యక్తం చేసిన జమాతే-ఇ-ఇస్లామి!

హైదరాబాద్: పాతబస్తీ పురానాపుల్ ప్రాంతంలో ఇటీవల జరిగిన హింసాకాండపై జమాతే-ఇ-ఇస్లామి హింద్, గ్రేటర్ హైదరాబాద్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఇక్కడ ఆలయ విధ్వంసం జరిగినట్టు వచ్చిన వదంతులు మత ఘర్షణలకు దారితీసాయి. ఇటువంటి సంఘటనలు నగరంలో సామాజిక సామరస్యాన్ని “తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి”, వాటిని తీవ్రంగా ఖండించాలి అని ఆ సంస్థ నొక్కి చెప్పింది. ప్రార్థనా స్థలంపై దాడి జరిగిందనే తప్పుడు పుకార్ల వల్ల అశాంతి చెలరేగిందని జమాతే-ఇ-ఇస్లామి హింద్ హైదరాబాద్‌ నగర అధ్యక్షులు ముబాషిర్ అహ్మద్ […]
Read more

ఇరాన్‌లో నిరసనలు తగ్గుముఖం…ఐక్యరాజ్యసమితిలో ఇరాన్-అమెరికా రాయబారుల ఘర్షణ!

న్యూయార్క్‌: ఇరాన్‌లో చెలరేగిన నిరసనల నేపథ్యంలో… ఐక్యరాజ్యసమితిలో అమెరికా, ఇరాన్ రాయబారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. “ఇరాన్‌లోని ధైర్యవంతులైన ప్రజలకు” తాము అండగా ఉంటామని అమెరికా పేర్కొంది. కాగా, అమెరికా జోక్యాన్ని “పాలన మార్పు”కు ప్రయత్నంగా ఇరాన్ ఖండించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిరసనకారులను ఉద్దేశించి ట్వీట్లు చేయడం, వారిని “ఇరాన్ దేశభక్తులు” అని పిలవడం, నిరసనకారులను రక్షించడానికి అమెరికా సిద్ధంగా ఉందని హెచ్చరించడంతో ఇరు దేశాల దౌత్యవేత్తల మధ్య రగడ మొదలైంది. కాగా, భద్రతా […]
Read more

మహారాష్ట్ర మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపుదిశగా అధికార బీజేపీ కూటమి!

ముంబయి: మూడేళ్ల విరామం తర్వాత జరిగిన బీఎంసీ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠగా సాగుతోంది. కౌంటింగ్‌లో తొలుతనుంచి బీజేపీ ముందంజలో ఉండగా…శివసేన రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక బృహన్‌ముంబయి కార్పొరేషన్‌ ఎన్నికలో అధికార పార్టీ గెలుస్తుందన్న ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాల మేరకు బీజేపీ కూటమి… థాకరే సోదరులపై ఆధిక్యంలో కొనసాగుతోంది. ప్రాథమిక అంచనాల ప్రకారం… బీఎంసీలో బీజేపీ నేతృత్వంలోని కూటమి 56 వార్డుల్లో ముందంజలో ఉంది. బీజేపీ 42 వార్డుల్లో ఆధిక్యంలో ఉండగా, ఏక్‌నాథ్ షిండే శివసేన 14 వార్డుల్లో […]
Read more

సదరన్ కమాండ్ హెడ్‌ఆఫీస్‌ను హైదరాబాద్‌కు తరలించండి… ఆర్మీని కోరిన సీఎం రేవంత్‌రెడ్డి!

హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో పౌర-సైనిక సమన్వయ సమావేశం సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో జరిగింది. ఈమేరకు తెలంగాణ ప్రభుత్వం తరఫున పలు విజ్ఞప్తులను ముఖ్యమంత్రి ఆర్మీ ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చారు. భారత సైన్యానికి చెందిన సదరన్ కమాండ్ ప్రధాన కార్యాలయాన్ని పుణే నుండి హైదరాబాద్‌కు తరలించే అంశాన్ని పరిశీలించాల్సిందిగా సీఎం అభ్యర్థించారు. అంతేకాదు సైన్యం, తెలంగాణ ప్రభుత్వం మధ్య ఉన్న భూ సమస్యలు, ఇతర పరిపాలనా సమస్యలను వేగంగా పరిష్కరించడంపై చర్చలు జరిగాయి. […]
Read more

మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు క్లీన్‌చిట్‌ ఇచ్చిన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ !

హైదరాబాద్‌: పార్టీ ఫిరాయింపుల కేసులో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈమేరకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ మరో ఇద్దరు ఎమ్మెల్యేలకు ఊరట కల్పించారు. కాలే యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి స్పీకర్ ఒక నిర్ణయాత్మక తీర్పు ఇచ్చారు. వారు పార్టీ మారారని చెప్పడానికి ఎటువంటి బలమైన ఆధారాలు లేవని ఆయన పేర్కొన్నారు. ఫలితంగా, ఈ ఇద్దరు ఎమ్మెల్యేలను అధికారికంగా బీఆర్ఎస్ సభ్యులుగా గుర్తిస్తున్నారు, దీంతో వారిపై దాఖలైన పిటిషన్లు కొట్టివేశారు. ఇటీవలే ఐదుగురు […]
Read more

గాజాలో కాల్పుల విరమణకు టర్కీ ‘కీలక పాత్ర’ పోషించింది…అమెరికా!

వాషింగ్టన్‌: గాజా కాల్పుల విరమణను సాధించడంలో టర్కీ సమగ్ర పాత్ర పోషించిందని ఒక అమెరికా అధికారి తెలిపారు. “ఈ మేరకు అధ్యక్షుడు ట్రంప్ టర్కీకి కృతజ్ఞతలు తెలిపారని” ఆ అధికారి అన్నారు. “(టర్కిష్) అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్, విదేశాంగ మంత్రి హకన్ ఫిడాన్, ఇంటెలిజెన్స్ డైరెక్టర్ ఇబ్రహీం కాలిన్ మాతో కలిసి అద్భుతమైన పని చేసారు” అని అధికారి తెలిపారు. “వారు చర్చలో పాల్గొనడం చాలా ముఖ్యం అని మేము భావిస్తున్నాము” అని అధికారి తెలిపారు. […]
Read more

సోమనాథ్‌ దేవాలయం… చరిత్రను మరోసారి రాజకీయ ఆయుధంగా మారుస్తున్న వైనం!

న్యూఢిల్లీ: మొన్నటివరకు రామమందిరం చుట్టూ సాగిన ప్రచారం…అంటే బాబ్రీ మసీదు కూల్చివేత; బీజేపీకి, దాని మాతృ సంస్థ అయిన ఆర్‌ఎస్‌ఎస్‌కు ఎన్నికల పరంగా గొప్ప ప్రయోజనాలను చేకూర్చింది. తరువాత కాశీ, మథుర వరుసలో ఉన్నాయి. ఇక తాజాగా సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ (సోమనాథ్ ఆత్మగౌరవ ఉత్సవం)తో ఇప్పుడు ఒక కొత్త వివాదాన్ని తెరపైకి తెస్తున్నారు… ఈ సందర్భంగా మన ప్రధానమంత్రి రెండు విషయాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా పేర్కొన్నారు. ఒకటి, సోమనాథ్ ఆలయం భారతదేశ కీర్తికి చిహ్నంగా నిలిచినందున, […]
Read more

మేడారం జాతరకు 3 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా…మంత్రి సీతక్క!

హైదరాబాద్: ఈ ఏడాది ‘మేడారం జాతర’కు దాదాపు మూడు కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ గిరిజన పండుగ జనవరి 28 నుండి 31 వరకు ములుగు జిల్లా, తాడ్వాయి మండలం, మేడారం అటవీ ప్రాంతంలో జరుగుతుందని ఆమె చెప్పారు. పండుగ ఏర్పాట్లను సమీక్షించడానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, వివిధ శాఖల సీనియర్ అధికారులు, ములుగు […]
Read more

తెలంగాణ మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లను ఖరారు!

హైదరాబాద్: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు కీలక అడుగు పడింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం 121 మునిసిపాలిటీలు, 10 కార్పొరేషన్లలో వార్డులు, చైర్‌పర్సన్లు/మేయర్ల పదవులకు రిజర్వేషన్లను ఖరారు చేసింది. షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీలు), షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీలు), వెనుకబడిన తరగతులు (బీసీలు), మహిళలకు రిజర్వేషన్లకు సంబంధించి మున్సిపల్ పరిపాలన శాఖ నిన్న నోటిఫికేషన్ జారీ చేసింది. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం 50 శాతం రిజర్వేషన్లు మించకుండా మహిళలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు […]
Read more

కరూర్ తొక్కిసలాటపై విజయ్‌కు సీబీఐ సమన్లు… బీజేపీతో పొత్తుకు నిరాకరించిన దళపతి!

చెన్నై: టీవీకే ర్యాలీలో జరిగిన కరూర్ తొక్కిసలాటలో 41 మంది మరణించిన ఘటనపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ…విజయ్‌ను జనవరి 19న మరో విడత విచారణకు పిలిచినప్పటికీ, ఆయన పార్టీ టీవీకే బీజేపీతో ఎలాంటి పొత్తు ఉండదని స్పష్టం చేసింది. విజయ్ మొదటి నుంచీ కాషాయ పార్టీని తన సైద్ధాంతిక శత్రువుగా అభివర్ణిస్తూ, ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా దానితో పొత్తును తోసిపుచ్చుతూనే ఉన్నారు. బీజేపీతో సంబంధాలను పునరుద్ధరించుకున్న ఏఐఏడీఎంకేతో కూడా ఎలాంటి సంబంధాలు ఉండవని ఆయన పరోక్షంగా సూచించారు. […]
Read more
1 25 26 27 28 29 159

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.