Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

తెలంగాణలో 148 లక్షల టన్నుల వరి ఉత్పత్తి!

హైదరాబాద్: ఖరీఫ్ సీజన్‌లో తెలంగాణ 148.03 లక్షల టన్నుల వరి ఉత్పత్తిని సాధించింది. ఇది దేశంలో అత్యధికం అని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. వరి సేకరణలో కూడా రాష్ట్రం రికార్డు సృష్టిస్తుందని, దీని కోసం ప్రభుత్వం రూ. 23,000 కోట్లు ఖర్చు చేయాలని యోచిస్తోందని ఆయన అన్నారు. రిజిస్ట్రేషన్ చేసిన 48 గంటల్లోపు రైతులకు చెల్లింపులు జరుగుతాయని ఆయన ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి […]
Read more

మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ గురుకుల్ అధిపతి!

ముంబయి: గురుకుల అధిపతి, మహారాష్ట్రలోని ఒక ఉపాధ్యాయుడు క్యాంపస్‌లో మైనర్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. రత్నగిరి జిల్లాలోని వార్కారి గురుకుల్ అధిపతి భగవాన్ కోకరే మహారాజ్, ఉపాధ్యాయుడు ప్రీతేష్ ప్రభాకర్ కదమ్… ఒక విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. దీంతో ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేశారు. మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుండి బాల బాలికలు ఆధ్యాత్మిక విద్యను అభ్యసించడానికి గురుకులంలో చేరారు. బాధితురాలు కూడా జూన్ 12న ఆమెకు అడ్మిషన్ లభించింది. […]
Read more

బీహార్ ఎన్నికల్లో పోటీ చేయను…ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్!

పాట్నా: ఎన్నికల వ్యూహకర్త, రాజకీయ నాయకుడిగా మారిన ప్రశాంత్ కిషోర్ బీహార్‌ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. అన్ని ఊహాగానాలకు స్వస్తి పలుకుతూ, తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని, బదులుగా సంస్థాగత పనిపై దృష్టి పెడతానని పిటిఐ వార్తా సంస్థతో అన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నేను పోటీ చేయకూడదని పార్టీ నిర్ణయించింది. దానికి నేను కట్టుబడి ఉన్నాను. రాఘోపూర్‌లో తేజస్వీ యాదవ్‌పై పోటీకి మరో అభ్యర్థిని ప్రకటించాం. పార్టీ ప్రయోజనాల మేరకే నేను పోటీకి దూరంగా […]
Read more

కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్ల ఆస్తులను నిషేధిత జాబితాలో చేర్చిన విజిలెన్స్‌ విభాగం!

హైదరాబాద్: కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ పథకంలో అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నీటిపారుదల ఇంజనీర్ల ఆస్తులను తెలంగాణ విజిలెన్స్ విభాగం రెవెన్యూ రికార్డులలో నిషేధిత జాబితాలో చేర్చింది. అవినీతి నిరోధక బ్యూరో (ACB) సోదాల్లో వీరి దగ్గర వందల కోట్ల విలువైన అక్రమ ఆస్తులు బయటపడిన విషయం తెలిసిందే. ఈమేరకు మాజీ ఇంజనీర్లు-ఇన్-చీఫ్ భూక్య హరిరామ్, సి మురళీధర్ రావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్. శ్రీధర్ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో రూ. 400 కోట్లకు పైగా […]
Read more

భారత సంతతికి చెందిన అమెరికా రక్షణ నిపుణుడు ఆష్లే టెల్లిస్ అరెస్టు!

వాషింగ్టన్: ప్రఖ్యాత విదేశాంగ విధాన నిపుణుడు, భారత సంతతికి చెందిన రక్షణ వ్యూహకర్త ఆష్లే జె టెల్లిస్‌ను అమెరికా అధికారులు అరెస్టు చేసారు. జాతీయ భద్రతకు సంబంధించిన అత్యంత రహస్య పత్రాలను చట్టవిరుద్ధంగా తన వద్ద ఉంచుకున్నారనే తీవ్రమైన ఆరోపణలపై ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు వర్జీనియా ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ యూఎస్ అటార్నీ కార్యాలయం వెల్లడించింది. కాగా, 64 ఏళ్ల టెల్లిస్‌ కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్‌లో సీనియర్ ఫెలోగా పనిచేస్తున్నారు. అంతేకాదు టాటా చైర్ ఫర్ […]
Read more

కాల్పుల విరమణ తర్వాత…ఐదుగురు పాలస్తీనియన్లను చంపిన ఇజ్రాయెల్!

జెరుసలేం: కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించిన మరుసటిరోజే ఇజ్రాయెల్ దళాలు ఐదుగురు పాలస్తీనియన్లను చంపినట్లు సమాచారం. హమాస్ కాల్పుల విరమణలో భాగంగా బందీలందరినీ విడుదల చేసిన ఒక రోజు తర్వాత ఈ హత్యలు జరిగాయి. కాగా, హత్యలను ఇజ్రాయెల్ సైన్యం ధృవీకరించింది. వారు తమ సైనికులను సమీపిస్తున్నారనే సాకు చూపి వారిని చంపేసినట్లు అల్ జజీరా నివేదించింది. మరోవంక ఇజ్రాయెల్-హమాస్ కాల్పుల విరమణ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత, 28 ఏళ్ల పాలస్తీనియన్ పౌరుడు జర్నలిస్ట్ సలేహ్ […]
Read more

‘ఆపరేషన్ సిందూర్‌’ను ఆపానన్న ట్రంప్…అయినా ప్రధాని మౌనంగా ఉన్నారని కాంగ్రెస్ ఎద్దేవా!

న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్‌ను “ఆకస్మికంగా నిలిపివేయడానికి” సుంకాలను ఉపయోగించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ “51వ సారి” చెప్పారని, అయినా మా ప్రధాన మంత్రి మౌనంగా ఉన్నారని” కాంగ్రెస్ విమర్శించింది. కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఇన్‌చార్జ్, కమ్యూనికేషన్స్, జైరామ్ రమేష్, Xలో ఒక వీడియో లింక్‌ను షేర్‌ చేసారు. దీనిలో ట్రంప్ ఈ సంవత్సరం ప్రారంభంలో భారతదేశం,పాకిస్తాన్ మధ్య జరిగిన వివాదంతో సహా ఎనిమిది యుద్ధాలను పరిష్కరించడం గురించి తన వాదనను పునరావృతం చేశారు. “ఈసారి — […]
Read more

వందకుపైగా పాలస్తీనియన్‌ ఖైదీలకు ప్రవాస శిక్ష…షాక్‌లో కుటుంబాలు!

జెరూసలెం: ఇటీవల మధ్యవర్తిత్వ మార్పిడి ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ విడుదల చేసిన వందమందికి పైగా పాలస్తీనియన్‌ ఖైదీలు తమ బంధువులను కలుసుకునే అవకాశం ఉండదు. వారు స్వదేశానికి తిరిగి రారని, వారికి ఇజ్రాయెల్‌ ప్రవాస శిక్ష విధించిందని తెలుసుకున్న తర్వాత వారి వేదన వర్ణనాతీతంగా ఉంది. పాలస్తీనా ఖైదీల మీడియా కార్యాలయం ప్రకారం, సోమవారం విడుదలైన సమూహంలో కనీసం 154 మంది విముక్తి పొందిన పాలస్తీనియన్లను విదేశాలకు బహిష్కరించనున్నారు. హమాస్ విడుదల చేసిన 20 మంది ఇజ్రాయెల్ […]
Read more

జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ‘ఏఐ’ని దుర్వినియోగం చేయొద్దు!

హైదరాబాద్: రాబోయే జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో ‘ఏఐ’ని దుర్వినియోగం చేయొద్దని ఈసీ రాజకీయ పార్టీలను హెచ్చరించింది. ఈమేరకు ఎన్నికల ప్రక్రియ సమగ్రతను కాపాడాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. డీప్‌ఫేక్‌లను సృష్టించడానికి లేదా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని వాడొద్దని తేల్చి చెప్పింది. ఈమేరకు జిల్లా ఎన్నికల అధికారి (DEO) RV కర్ణన్ నిన్న జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక సందర్భంగా రాజకీయ పార్టీలకు వివరణాత్మక మార్గదర్శకాలను జారీ చేశారు. ప్రచార సామగ్రిలో ఉపయోగించే […]
Read more

రాజకీయ దుమారం రేపుతున్న హర్యానా దళిత ఐపీఎస్ అధికారి మరణం!

చండీగఢ్: ఉన్నతాధికారుల కుల వివక్షకు తాళలేక సీనియర్ ఐపీఎస్ అధికారి వై. పూరన్‌ కుమార్ ఆత్మహత్య చేసుకోవడం హర్యానాలోనే కాకుండా దేశవ్యాప్తంగా రాజకీయ తుఫానుకు దారితీశాయి. ఈ సంఘటన ప్రభావం వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్న బీహార్‌కు చేరుకుంది. ఒక సీనియర్ పోలీసు అధికారి మరణం వ్యవస్థను కుదిపేసింది. ఉన్నత స్థాయి అధికార వర్గాలలో కూడా కుల వివక్ష కొనసాగడంపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది. కానీ మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే హర్యానాలోని భారతీయ జనతా పార్టీ […]
Read more
1 45 46 47 48 49 143

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.