Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Author: Admin

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

హైదరాబాద్‌లో డ్రగ్స్ అక్రమ రవాణా ముఠా అరెస్టు…82 లక్షల విలువైన సొత్తు స్వాధీనం!

హైదరాబాద్: హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (HNEW) స్థానిక పోలీసుల సమన్వయంతో నిర్వహించిన దాడిలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా ముఠా అరెస్టు చేసింది. బేగం బజార్, గోల్కొండ, బోలారం అంతటా జరిపిన స్వతంత్ర దాడుల్లో తొమ్మిది మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుండి రూ.82.1 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. బేగం బజార్ పోలీసుల సమన్వయంతో ఇద్దరు అంతర్రాష్ట్ర మాదకద్రవ్యాల అక్రమ రవాణాదారులను, ఒక స్థానికుడిని నార్కోటిక్‌ వింగ్‌ అరెస్టు చేసింది. ఈ బృందం […]
Read more

పర్యాటకానికి ఊపు… హుస్సేన్ సాగర్‌లో కొత్త క్రూయిజ్ బోట్!

హైదరాబాద్: హుస్సేన్ సాగర్‌లో బోటింగ్ కోసం పెరుగుతున్న డిమాండ్‌ను నెరవేర్చేందుకు తెలంగాణ టూరిజం శాఖ అదనంగా కొత్త క్రూయిజ్ బోట్‌ను తీసుకొస్తోంది. సరస్సు ఒడ్డున కొత్త కాటమరాన్ పడవకు తుది మెరుగులు దిద్దుతున్నారు. పనులు పూర్తయ్యాక త్వరలోనే దీనిని ప్రారంభించనున్నారు. కాటమరాన్ క్రూయిజ్‌ బోట్‌ఈ కొత్త బోటులో రెండు హల్స్, ఇంజిన్‌లతో కూడిన రెండస్థులు ఉంటాయి. గంటలో 100 మంది సందర్శకులను తీసుకెళ్లేంత విశాలంగా ఉంటుంది. పడవ 22 మీటర్ల పొడవు, 8 మీటర్ల వెడల్పు ఉంటుంది. […]
Read more

శశి థరూర్‌కి ఉపరాష్ట్రపతి పదవి ఛాన్స్‌ ఉందా?

న్యూఢిల్లీ: ఉపాధ్యక్ష పదవికి జగదీప్ ధంఖర్ రాజీనామా చేయడం విమర్శకులను షాక్‌కు గురిచేసింది. రాజకీయ వర్గాలు దిగ్భ్రాంతికి లోనయ్యారు. కాగా, నిన్నటి వరకు ఆయనపై కత్తులు నూరిన ప్రతిపక్షాలను కలవరపెట్టింది. అయితే రాజీనామా ఒక వాస్తవం కావడంతో, ధంఖర్ స్థానంలో ఎవరు వస్తారనే దానిపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యేందుకు ఈ అర్హతలుంటే చాలు: అతను/ఆమె భారత పౌరుడిగా ఉండాలి; కనీసం 35 సంవత్సరాలు ఉండాలి; రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యే అర్హత కలిగి ఉండాలి; […]
Read more

కాన్వాస్‌పై తన ‘బాధ’ను ఎంబ్రాయిడరీ రూపంలో వ్యక్తపరిచిన గాజా శరణార్థి!

పారిస్‌: పాలస్తీనియన్ కళాకారిణి మహా అల్-దయా పారిస్‌లోని తన కొత్త ఇంట్లో… యుద్ధంతో శిధిల నగరంగా మారిన గాజా దుస్థితిని ఫాబ్రిక్‌పై సూది దారంతో ఎంబ్రాయిడరీ చేసింది. “యుద్ధానికి ముందు నేను సంతోషకరమైన సందర్భాల కోసం ఎంబ్రాయిడరీ చేసేదాన్ని. కానీ నేడు నా బాధను కుట్టు రూపంలో వ్యక్తపరిచానని 41 ఏళ్ల దయా అన్నారు, ఆమె కూడా చిత్రలేఖనం చేస్తుంది. 2023 అక్టోబర్‌లో గాజా యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఫ్రాన్స్‌కు వీసాలు మంజూరు అయిన వందలాది మంది […]
Read more

జగదీప్ ధంఖర్ ఆకస్మిక రాజీనామా…ఆయనకు ప్రభుత్వానికి మధ్య విబేధాలున్నాయా!

న్యూఢిల్లీ: ఆరోగ్య కారణాలను చూపుతూ జగదీప్ ధంఖర్ ఉప రాష్ట్రపతి పదవికి రాజీనామాను ప్రకటించడానికి ముందు…తెరవెనుక అనేక చర్యలు కీలక పాత్ర పోషించి ఉండవచ్చు. హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ ఇంట్లో నగదు కట్టలు దొరికాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన తొలగింపుపై ప్రతిపక్ష ఎంపీలు చేసిన తీర్మానాన్ని ఆమోదించాలని ధంఖర్ తీసుకున్న నిర్ణయం కేంద్ర ప్రభుత్వానికి నచ్చలేదని NDTV మంగళవారం ముందుగా నివేదించింది. అయితే ఈ అంశంపై బీజేపీ నాయకత్వం వహించాలని కోరుకుంది. జస్టిస్ వర్మ తొలగింపు […]
Read more

పేద ముస్లిం కుటుంబాలకు మద్దతు ఇచ్చేందుకు ముందుకొచ్చిన ఏపీ వక్ఫ్ బోర్డు!

న్యూఢిల్లీ: పేద ముస్లిం కుటుంబాలకు భద్రత,మద్దతు అందించడానికి ఏపీ ప్రారంభించిన ప్రత్యేకమైన P-4 (పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టనర్‌షిప్) కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు స్వీకరించింది. ఈ కార్యక్రమాన్ని పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ఈ ఏడాది ఉగాది రోజున సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. P-4 భావనలో భాగంగా, జనాభాలోని అత్యంత సంపన్నులైన 10% మంది పేద కుటుంబాలలో దిగువన ఉన్న 20% మందికి మద్దతు ఇచ్చేలా వారిని ప్రోత్సహిస్తారు. ఇది సమ్మిళిత వృద్ధిని పెంపొందిస్తుంది. పేదలను […]
Read more

స్థానిక ఎన్నికల్లో 42% బీసీ కోటాకు మద్దతు కోరేందుకు ఢిల్లీ వెళ్తున్న సీఎం రేవంత్‌రెడ్డి!

హైదరాబాద్: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు పార్టీలకు అతీతంగా ఎంపీల మద్దతు కూడగట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం జూలై 24న ఢిల్లీకి బయలుదేరుతుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణలో కుల సర్వే విధివిధానాలు, అమలుపై కాంగ్రెస్ కేంద్ర నాయకత్వానికి వివరించడమే ఈ ప్రతినిధి బృందం లక్ష్యమని విక్రమార్క ఒక ప్రకటనలో తెలిపారు. “పార్లమెంట్‌లో బీసీ బిల్లును త్వరగా ప్రవేశపెట్టి […]
Read more

‘గాజాలో యుద్ధం ఆగాలి’…UK, కెనడా సహా 26 దేశాల విజ్ఞప్తి!

లండన్: బ్రిటన్, జపాన్, అనేక యూరోపియన్ దేశాలు సహా మొత్తం ఇరవై ఎనిమిది దేశాలు నిన్న ఒక సంయుక్త ప్రకటన విడుదల చేస్తూ గాజాలో యుద్ధం “ఇప్పుడే ముగియాలి” అని పేర్కొన్నాయి. పాలస్తీనా విషయంలో ఇజ్రాయెల్ ఒంటరి కావడంతో మిత్రదేశాల నుండి పదునైన మాటలకు ఇది తాజా సంకేతం. ఆస్ట్రేలియా, కెనడాతో సహా దేశాల విదేశాంగ మంత్రులు “గాజాలో పౌరుల బాధలు వర్ణనాతీతమని అన్నారు. వారు ఇస్తున్న అరకొర సాయం, ప్రాథమిక అవసరాలైన నీరు, ఆహారం తీసుకోవడానికి […]
Read more

ఉద్యోగ స్కామ్‌తో ఒమన్‌లో చిక్కుకున్న హైదరాబాదీ మహిళ…సాయం చేయాలని కోరిన కుమార్తె!

హైదరాబాద్: ఉద్యోగ స్కామ్‌లో బాధితురాలిగా హైదరాబాద్‌కు చెందిన 37 ఏళ్ల మహిళ ఒమన్‌లోని మస్కట్‌లో చిక్కుకుంది. ఆమె కుమార్తె తక్షణ జోక్యం కోరుతూ విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA)కి లేఖ ద్వారా విజ్ఞప్తి చేసింది. కాలాపత్తర్‌కు చెందిన సాజిదా బేగంకు స్థానిక ఏజెంట్ ఒమన్‌లో పనిమనిషి ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చారు. ఆమె ఈ సంవత్సరం జూన్ 25న టూరిస్ట్ వీసాతో భారతదేశం నుండి బయలుదేరింది, కానీ అక్కడికి చేరుకున్న తర్వాత, ఆమె రోజుకు 16 గంటలకు […]
Read more

ఇజ్రాయెల్ ముట్టడితో గాజాలో ఆకలి చావులు!

గాజా స్ట్రిప్: ఇజ్రాయెల్ దిగ్బంధనం కారణంగా గాజాలో రెండు మిలియన్లకు పైగా పాలస్తీనియన్లు తీవ్ర మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ముట్టడి కారణంగా ఆహారం, మందులు, పరిశుభ్రమైన నీరు అందుబాటులోకి రావడం లేదని మానవతా సంస్థలు చెబుతున్నాయి. దీంతో ఈ ప్రాంతంలోని చాలా మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఈ ఏడాది మార్చి 2 నుండి, ఇజ్రాయెల్ గాజాపై పూర్తిస్థాయి దిగ్బంధనం విధించింది. మే నుండి పరిమిత సహాయం అనుమతించినప్పటికీ, పాలస్తీనా శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమితి […]
Read more
1 96 97 98 99 100 159

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.