Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: అంతర్జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

అమెరికా దాడులతో ఇరాన్ అణు కార్యక్రమం రెణ్నెళ్ల పాటు వాయిదా పడిందంతే.. ఓ రిపోర్ట్‌లో వెల్లడి!

వాషింగ్టన్: ఇరాన్ అణు కేంద్రాలపై వారాంతంలో అమెరికా జరిపిన దాడులు టెహ్రాన్ అణు కార్యక్రమాన్ని కొన్ని నెలల పాటు వెనక్కి నెట్టాయని అమెరికా నిఘా సంస్థలు ప్రాథమిక అంచనా వేశాయని ఈ విషయంపై అవగాహన ఉన్న మూడు వర్గాలు రాయిటర్స్‌కు తెలిపాయి. ఈ ప్రాథమిక నివేదికను పెంటగాన్ ప్రధాన నిఘా విభాగం, 18 అమెరికా నిఘా సంస్థలలో ఒకటైన డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ తయారు చేసిందని, వర్గీకృత విషయాలను చర్చించడానికి పేరు వెల్లడించకూడదని అభ్యర్థించిన రెండు వర్గాలు […]
Read more

యుద్ధం ముగిసింది…ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ప్రకటించిన ట్రంప్‌!

వాషింగ్టన్: ఇరాన్‌-ఇజ్రాయెల్‌ మధ్య 12రోజులుగా సాగుతున్న యుద్ధం ముగిసింది. ఈమేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య పూర్తి కాల్పుల విరమణను ప్రకటించారు. ఈ విషయాన్ని ట్రంప్‌ తన సోషల్‌మీడియాలో ప్రకటించారు. రెండు దేశాలకు అభినందనలు తెలిపారు. ఈ వారాంతంలో అమెరికాతో కలిసి ఇజ్రాయెల్, టెహ్రాన్ అణ్వాయుధాన్ని పొందేందుకు దగ్గరగా ఉందని ఆరోపించిన తర్వాత, ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు చేసింది. అయితే యుద్ధం ముగిసిందంటూ ట్రంప్‌ ఇచ్చిన ప్రకటనపై ఇజ్రాయెల్ ఇంకా స్పందించలేదు. […]
Read more

అమెరికా దాడుల తర్వాత, హార్ముజ్ జలసంధిని మూసివేయాలని యోచిస్తోన్న ఇరాన్‌!

న్యూఢిల్లీ: ఇరాన్ లోని అణు కేంద్రాలపై అమెరికా బాంబు దాడి చేసిన తర్వాత కీలకమైన చమురు షిప్పింగ్ మార్గం హార్ముజ్ జలసంధిని మూసివేయాలని ఇరాన్ యోచిస్తున్నట్లు ఆదేశ మీడియా తెలిపింది. కాగా, హార్ముజ్ జలసంధి ప్రపంచంలోని అత్యంత కీలకమైన రవాణా మార్గాలలో ఒకటన్న సంగతి తెలిసిందే. దీని ద్వారా ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాలో ఐదవ వంతు రవాణా అవుతుంది. అరేబియా సముద్రాన్ని, పర్షియన్ గల్ఫ్ ప్రాంతాన్ని కలిపే ఇరుకైన సముద్ర మార్గమే ఈ హర్మూజ్ జలసంధి. […]
Read more

చమురు ధరలు జంప్‌, మధ్యప్రాచ్య సంక్షోభం పెరగడంతో పడిపోయిన ఆసియా మార్కెట్లు!

న్యూఢిల్లీ: ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడి చేయడంతో మధ్యప్రాచ్య సంక్షోభాన్ని తీవ్రమైంది. ఫలితంగా ఇంధన మార్కెట్లకు అంతరాయం కలుగుతుందనే ఆందోళనల మధ్య నేడు ఆసియా మార్కెట్లు పతనమయ్యాయి చమురు ధరలు ఐదు నెలల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ ప్రపంచంలో తొమ్మిదవ అతిపెద్ద చమురు ఉత్పత్తి దేశం, రోజుకు దాదాపు 3.3 మిలియన్ బ్యారెళ్ల ఉత్పత్తి చేస్తుంది. ఆ మొత్తంలో దాదాపు సగం ఇరాన్‌ దేశమే ఎగుమతి చేస్తుంది. మిగిలిన మొత్తాన్ని దేశీయ వినియోగం కోసం […]
Read more

ఇరాన్‌లో నాయకత్వ మార్పుపై ట్రంప్‌ సంకేతాలు…మేక్‌ ఇరాన్‌ గ్రేట్‌ అగైన్‌ అంటూ సందేశం!

వాషింగ్టన్: నిన్న ఇరాన్ సైనిక స్థావరాలపై అమెరికా దాడుల తర్వాత ఇరాన్‌లో నాయకత్వ మార్పు ఎందుకు జరగకూడదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశ్నించారు. “‘పాలనలో మార్పు’ అనే పదాన్ని ఉపయోగించడం రాజకీయంగా సరైనది కాదు, కానీ ప్రస్తుత ఇరాన్ పాలన ఇరాన్‌ను మళ్లీ గొప్పగా మార్చలేకపోతే, పాలనలో మార్పు ఎందుకు జరగకూడదు??? “మేక్‌ ఇరాన్‌ గ్రేట్‌ అగైన్‌ (MIGA!!!)” అని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో రాశారు. మరోవంక ఇరాన్‌లోని ఫోర్డో అణు కేంద్రం […]
Read more

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ముగింపుకు శాంతి ప్రణాళిక…ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్!

పారిస్‌ : ఇజ్రాయెల్‌తో కొనసాగుతున్న వివాదాన్ని ముగించే లక్ష్యంతో యూరోపియన్ దేశాలు దౌత్యపరమైన చొరవతో ఇరాన్‌కు విస్తృత శాంతి ప్రతిపాదనను అందించడానికి సిద్ధమవుతున్నాయని గార్డియన్ తెలిపింది. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఆవిష్కరించిన ఈ ప్రణాళిక ప్రకారం…టెహ్రాన్ తన యురేనియం శుద్ధీకరణను నిలిపివేయాలి. బాలిస్టిక్ క్షిపణి అభివృద్ధిని ఆపేయాలి. మధ్యప్రాచ్యం అంతటా పనిచేస్తున్న ఉగ్రవాద గ్రూపులకు ఆర్థిక సహాయాన్ని అందించకూడదు. ఈ ప్రతిపాదన ఇటీవలి సంవత్సరాలలో యూరప్ చేసిన అత్యంత విస్తృతమైన శాంతి ప్రయత్నాలలో ఒకటిగా గుర్తింపు […]
Read more

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం…దౌత్యం తప్ప ఇజ్రాయెల్‌కు మరో మార్గం లేదు!

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంటోంది. కీలకమైన ఈ సమయంలో యుద్ధం నుంచి బయటకు వచ్చేందుకు దౌత్యం తప్ప మరో మార్గం లేదు. ఈ మేరకు E3 దేశాలైన జర్మనీ, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్‌డమ్ దౌత్యపరమైన ప్రయత్నాల ద్వారా ఉద్రిక్తతలను తగ్గించవచ్చు. ఇరానియన్ అణు సౌకర్యాలు, సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించడంతో…దీనికి ప్రతిగా ఇరాన్‌, డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో ప్రతీకార చర్యలు తీసుకుంటోంది. ఈ యుద్ధం ఎక్కడికి వెళుతుందో మనకు తెలియదు. […]
Read more

రోహింగ్యాలను బలవంతంగా బహిష్కరించడాన్ని వెంటనే నిలిపివేయాలి…ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌!

లండన్‌: నేడు ప్రపంచ శరణార్థుల దినోత్సవం. ప్రపంచవ్యాప్తంగా శరణార్థులు ఎదుర్కొంటున్న సవాళ్ల గురించి ప్రజలకు తెలియజేసే లక్ష్యంతో ఏటా జూన్‌ 20న ‘ప్రపంచ శరణార్థుల దినోత్సవం’గా (World Refugee Day) నిర్వహిస్తారు. ఈరోజున శరణార్థుల హక్కులు, అవసరాలపై దృష్టి సారిస్తారు. అయితే భారత ప్రభుత్వం రోహింగ్యా పురుషులు, మహిళలు, పిల్లల హక్కులను పట్టించుకోకుండా వారిని దేశం నుంచి బహిష్కరించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ పరిస్థితులు రోహింగ్యాల బహిష్కరణను వెంటనే నిలిపివేయాలని, వారిని శరణార్థులుగా గుర్తించి, వారిని గౌరవంగా చూసుకోవాలని, […]
Read more

చోరీ అయిన 16 బిలియన్ లాగిన్‌లు …ఆపిల్, గూగుల్ సహా మరిన్ని సంస్థలకు బెదిరింపులు!

వాషింగ్టన్‌ : చరిత్రలో అతిపెద్ద డేటా చోరీ అయింది. సైబర్‌సెక్యూరిటీ పరిశోధకులు పాస్‌వర్డ్‌లతో సహా 16 బిలియన్ లాగిన్ ఆధారాల లీక్‌ను నిర్ధారించారు. ఫోర్బ్స్‌లోని ఒక నివేదిక ప్రకారం….సమాచార లీక్ “ఆపిల్, ఫేస్‌బుక్, గూగుల్ నుండి గిట్‌హబ్, టెలిగ్రామ్, వివిధ ప్రభుత్వ సేవల వరకు ఊహించదగిన ఏ ఆన్‌లైన్ సేవకైనా” తలుపులు తెరవగలదు. ఈ భారీ డేటా లీక్‌ కారణంగా పెద్ద ఎత్తున సైబర్‌ దాడులు జరిగే ప్రమాదం ఉంది. వెబ్ సర్వర్‌లో పెద్దగా రక్షణ లేకుండా […]
Read more

ఇరాన్‌-ఇజ్రాయెల్‌ యుద్దంలో అమెరికా పాల్గొనడంపై రెండువారాల్లోపు నిర్ణయం…అధ్యక్షుడు ట్రంప్!

వాషింగ్టన్‌ : ఇజ్రాయెల్-ఇరాన్ వివాదంలో తలదూర్చాలా, వద్దా అన్న దానిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాబోయే రెండు వారాల్లో నిర్ణయం తీసుకుంటారని వైట్ హౌస్ తెలిపింది. ఇరాన్ బుషెహర్ అణు విద్యుత్ ప్లాంట్‌ను దాడి చేయవద్దని రష్యా ఇజ్రాయెల్‌ను హెచ్చరించింది. గురువారం సాయంత్రం టెల్ అవీవ్‌లోని ఇజ్రాయెల్‌లోని నార్వేజియన్ రాయబారి నివాసంపై గ్రెనేడ్ విసిరినట్లు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియాన్ సార్ తెలిపారు, ఎటువంటి గాయం కాలేదు. “నేను కొద్దిసేపటి క్రితం ఇజ్రాయెల్‌లోని నార్వేజియన్ రాయబారి […]
Read more
1 11 12 13 14 15 23

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.