Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: అంతర్జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

హర్ముజ్ జలసంధిని తెరవడానికి ఇరాన్‌కు ఏప్రిల్ 6 వరకు గడువును పొడిగించిన ట్రంప్!

వాషింగ్టన్‌: హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు ఇరాన్‌కు ఏప్రిల్ 6 వరకు గడువు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వెల్లడించారు. ఈ దాడులను వాయిదా వేయాలన్న అభ్యర్థన టెహ్రాన్ నుండే వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ తన ట్రూత్ సోషల్‌‌లో చేసిన తాజా ప్రకటలో… ఇరాన్ యుద్ధాన్ని ముగించడానికి జరుగుతున్న చర్చలు చాలా బాగా సాగుతున్నాయని అన్నారు. ‘‘ఇరాన్ ప్రభుత్వ అభ్యర్థన మేరకు విద్యుత్ ప్లాంట్ల విధ్వంసాన్ని 10 రోజుల పాటు.. అంటే 2026 ఏప్రిల్ […]
Read more

యుద్ధ ముగింపుపై అమెరికా ప్రతిపాదనను తిరస్కరించిన ఇరాన్‌…ప్రతిగా ఐదు షరతులు!

టెహ్రాన్‌: యుద్ధాన్ని ముగించాలన్న అమెరికా ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించింది. తమ షరతుల ప్రకారమే “యుద్ధాన్ని ముగిస్తామని” పేర్కొంది. ఈ ప్రతిపాదన వివరాలు తెలిసిన ఒక సీనియర్ ఇరాన్ అధికారి ప్రెస్ టీవీతో మాట్లాడుతూ, వాషింగ్టన్ ప్రతిపాదన “అతిశయోక్తి” అని అభివర్ణించారు. “తాను నిర్ణయించుకున్నప్పుడు, తన షరతులు నెరవేరినప్పుడు మాత్రమే ఇరాన్ యుద్ధాన్ని ముగిస్తుంది” అని ఆ అధికారి అన్నారు. అమెరికాకు వ్యతిరేకంగా తన రక్షణను కొనసాగించాలని ఇరాన్ ఉద్దేశిస్తోంది. తన షరతులు నెరవేరే వరకు తీవ్రమైన దాడులు” […]
Read more

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం… మోదీ విదేశాంగ విధానంపై తీవ్ర విమర్శలు!

న్యూఢిల్లీ: పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధానంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ మేరకు ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగిన ఒక సెమినార్‌లో అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ సంఘర్షణ నేపథ్యంలో, విదేశాంగ విధానం “దిశను కోల్పోతోందని” దౌత్యవేత్తలు, విద్యావేత్తలు, పాత్రికేయులు, మేధావులు ఆరోపించారు. “జన్ హస్తక్షేప్” అనే పౌర హక్కుల సంస్థ నిర్వహించిన ఈ కార్యక్రమంలో అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ సంఘర్షణ మధ్య బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం “నిశ్శబ్దం” అవలంబించడాన్ని వక్తలు […]
Read more

ఇరాన్‌కు 15 సూత్రాల కాల్పుల విరమణ ప్రణాళికను ప్రతిపాదించిన ట్రంప్!

వాషింగ్టన్: ట్రంప్ ప్రభుత్వం ఇరాన్‌కు 15-సూత్రాల కాల్పుల విరమణ ప్రణాళికను ప్రతిపాదించిందని, అయితే ఆ ప్రణాళిక రూపరేఖల గురించి బహిరంగంగా మాట్లాడే అధికారం లేదని పేరు తెలపడానికి ఇష్టపడని వ్యక్తి తెలిపారు. వాషింగ్టన్, టెహ్రాన్‌ల మధ్య పునఃచర్చలకు ఆతిథ్యం ఇవ్వడానికి ముందుకొచ్చిన పాకిస్థాన్‌కు చెందిన మధ్యవర్తులు ఈ కాల్పుల విరమణ ప్రణాళికను ఇరాన్‌కు సమర్పించారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే ఉన్న సుమారు 50వేల మంది సైనికులకు అదనంగా, 82వ ఎయిర్‌బోర్న్ డివిజన్ నుండి కనీసం వేయి మంది […]
Read more

గాజా పరిస్థితి ‘చాలా కష్టంగా’ ఉందని హెచ్చరించిన శాంతి మండలి ప్రతినిధి!

జెనీవా: గాజాలో పరిస్థితి “చాలా కష్టంగా ఉంది” అని శాంతి మండలికి చెందిన ఒక సీనియర్ అధికారి హెచ్చరించారు. ఈమేరకు పాలస్తీనాపై జరిగిన ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశంలో, గాజా శాంతి మండలి ప్రతినిధి నికోలే మ్లాడెనోవ్ మాట్లాడుతూ… “మొదటి దశ అమలు తర్వాత గణనీయమైన మెరుగుదల ఉన్నప్పటికీ, గాజాలో పరిస్థితి ఇంకా క్లిష్టంగానే ఉంది” అని అన్నారు. “యుద్ధానికి ముందున్న సామర్థ్యంలో అత్యవసర సేవలు చాలా తక్కువ స్థాయిలో పనిచేస్తున్నాయి. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ కుప్పకూలిపోయింది. […]
Read more

యుద్ధానికి ట్రంప్ విరామం ఇచ్చినప్పటికీ… గ్యాస్ కేంద్రాలపై దాడులు జరిగాయన్న ఇరాన్!

టెహ్రాన్‌: ఇరాన్‌ విద్యుత్ మౌలిక సదుపాయాలపై దాడి చేస్తామన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గిన కొన్ని గంటల తర్వాత, రెండు గ్యాస్ కేంద్రాలు, ఒక పైప్‌లైన్‌ను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్-అమెరికా దాడులు చేశాయని ఇరాన్ మీడియా వెల్లడించింది. “జియోనిస్ట్,అమెరికన్ శత్రువులు జరుపుతున్నదాడులలో భాగంగా… ఇస్ఫహాన్‌లోని కావే వీధిలో ఉన్న గ్యాస్ పరిపాలనా భవనం, గ్యాస్ పీడన నియంత్రణ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకున్నారని” ఫార్స్ వార్తా సంస్థ తెలిపింది. ఇరాన్‌లోని ఈ కేంద్రాలు “పాక్షికంగా దెబ్బతిన్నాయి” […]
Read more

పశ్చిమాసియా యుద్ధం భారత విదేశాంగ విధానంపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది…మనీష్ తివారీ!

న్యూఢిల్లీ: పశ్చిమాసియా యుద్ధం విషయంలో భారత విదేశాంగ విధాన తీరును సీనియర్ కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ ప్రశ్నించారు. బలవంతపు పాలన మార్పులు, ఎంపిక చేసిన హత్యలు, సార్వభౌమ ప్రభుత్వాల అధికారుల అపహరణలపై భారతదేశం మౌనం వహించడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తివారీ ప్రత్యేకంగా ఇలా ప్రశ్నించారు, ‘అధికారంలో ఉన్న రాష్ట్రపతి హత్యను భారతదేశం విమర్శించాలి కదా, అలాగే న్యూయార్క్ టైమ్స్ నివేదిక ప్రకారం అమెరికా క్షిపణి దాడిలో మరణించిన 196 మంది అమాయక […]
Read more

పాలస్తీనియన్లను హింసించడానికి ఇజ్రాయెల్ లైసెన్స్‌ పొందింది…ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధి!

జెనీవా: ఆక్రమిత పాలస్తీనా భూభాగంపై “పాలస్తీనియన్లను హింసించడానికి ఇజ్రాయెల్ లైసెన్స్‌ పొందిందని” జెనీవాలోని మానవ హక్కుల మండలిలో ఒక కొత్త నివేదికను సమర్పిస్తూ ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధి వాపోయారు. ఇది “పాలస్తీనా ప్రజలపై కొనసాగుతున్న మారణహోమాన్ని” నమోదు చేస్తుందని, “పాలస్తీనియన్లకు వ్యతిరేకంగా హింసాత్మక వాతావరణాన్ని సృష్టించడంతో పాటు, ఇజ్రాయెల్ హింసను క్రమపద్ధతిలో ఉపయోగించడాన్ని” ఇది హైలైట్ చేస్తుందని ఫ్రాన్సెస్కా అల్బనీస్ అన్నారు. దురాగతాలకు ప్రభుత్వాలు సహకరిస్తున్నాయని ఆమె ఆరోపించారు, “మీ ప్రభుత్వాలలో చాలా వరకు, మీ మంత్రులు […]
Read more

హర్మూజ్‌ దాటాలంటే 2 మిలియన్‌ డాలర్లు చెల్లించాల్సిందే…ఇరాన్‌!

టెహ్రాన్: అమెరికా, ఇజ్రాయెల్‌లతో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో ఇరాన్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచ నౌకా రవాణాకు కీలకమైన హర్ముజ్ జలసంధిపై తన నియంత్రణను మరింత బలోపేతం చేసుకునే చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా, ఆ జలసంధి గుండా వెళ్లే కొన్ని నౌకల నుండి 2 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.18.8 కోట్లు) వసూలు చేయాలని ఇరాన్ నిర్ణయించింది. ఈ భారీ రుసుము ఇప్పటికే అమల్లోకి వచ్చిందని, ఇది ఆ కీలక జలమార్గాన్ని నియంత్రించేందుకు తీసుకుంటున్న కొత్త […]
Read more

ఇరాన్‌ గ్యాస్‌ ఫీల్డ్స్‌పై ఇజ్రాయెల్‌ దాడి చేయదు…ట్రంప్‌!

వాషింగ్టన్: ఖతార్‌ గ్యాస్‌ ఫీల్డ్స్‌పై ఇరాన్‌ దాడి చేయడంతో అమెరికా దిగొచ్చింది. ఈ దాడులతో ఎక్కడ గ్యాస్‌ సంక్షోభం ముంచుకొస్తుందోనని అమెరికా భయపడింది. ఇరాన్‌గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ దాడి చేయదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. కాగా, ఇరాన్‌ ఎల్‌ఎన్‌జి క్షేత్రంపై ఇజ్రాయెల్ దాడి చేసిన తర్వాత, టెహ్రాన్ తన పర్షియన్ గల్ఫ్ పొరుగు దేశాల ఇంధన సౌకర్యాలపై దాడులను తీవ్రతరం చేసింది. ఈ క్రమంలో ఖతార్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ సౌకర్యాలపై దాడి చేసింది. […]
Read more
1 13 14 15 16 17 56

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.