Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: అంతర్జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

ప్రపంచం ఓ పెద్ద యుద్ధాన్ని ఎదుర్కోబోతోంది…ఐక్యరాజ్యసమితి అధిపతి!

న్యూయార్క్‌: ప్రపంచం ‘ఓ పెద్ద యుద్ధపు అంచున’ ఉందని, అది మధ్యప్రాచ్యాన్ని చుట్టుముట్టి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ హెచ్చరించారు. ఈమేరకు గురువారం న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ…శత్రుత్వాన్ని విరమించుకోవాలని అమెరికా, ఇజ్రాయెల్‌లను కోరారు. “ఈ యుద్ధం కారణంగా ప్రజలు తీవ్రమైన బాధ అనుభవిస్తున్నారని, ఇప్పటికే ఆర్థిక పరిణామాలు ఆందోళనకరంగా మారాయని, ఈ యుద్ధాన్ని ఆపడానికి ఇదే సరైన సమయమని” గుటెర్రస్‌ అన్నారు. ఇరాన్ తన పొరుగు […]
Read more

‘మేము యుద్దం నుంచి తొందరగా వైదొలగం’…మాట మార్చిన ట్రంప్!

వాషింగ్టన్‌: ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం నేడు 34వ రోజులోకి ప్రవేశించింది. అయితే యుద్ధ విరమణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పర విరుద్ధ ప్రకటనలతో గందరగోళం నెలకొంది. మేము ఇరాన్‌నుంచి తొందరగా వైదొలగమని ట్రంప్‌ అన్నారు. వాషింగ్టన్ తన సైనిక చర్యను ముందుకు తీసుకువెళ్తుందని ప్రతిజ్ఞ చేశారు. ఈమేరకు కెంటకీలోని హెబ్రాన్‌లో ట్రంప్‌ మాట్లాడుతూ… అన్ని లక్ష్యాలు సాధించే వరకు కార్యకలాపాలు కొనసాగుతాయని నొక్కిచెప్పారు. అమెరికా ఈ సంఘర్షణను ఉన్నపళంగా ముగించదని ట్రంప్ అన్నారు. హర్మూజ్ జలసంధిని […]
Read more

అమెరికా టెక్ కంపెనీలపై దాడులు చేస్తామన్న ఇరాన్!

టెహ్రాన్‌: తమ నేతల హత్యలో పాలు పంచుకున్న టెక్ సంస్థలను ఇరాన్ హెచ్చరించింది. నేటి నుండి ఆపిల్, గూగుల్, మెటా, ఐబిఎం, టెస్లా, బోయింగ్ వంటి 18 ప్రముఖ అమెరికన్ టెక్నాలజీ సంస్థలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ తెలిపారు. టెహ్రాన్ కాలమానం ప్రకారం రాత్రి 8:00 గంటల (1630 GMT) నుండి…ఈ కంపెనీల సంబంధిత యూనిట్లు ధ్వంసం చేస్తామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. “ఈ సంస్థల ఉద్యోగులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి వెంటనే తమ […]
Read more

పాలస్తీనా ఖైదీలకు కొత్త మరణశిక్ష చట్టం… ఇజ్రాయెల్‌ను విమర్శించని అమెరికా!

టెల్‌అవీవ్‌: పాలస్తీనా ఖైదీలకు మరణశిక్ష విధించే కొత్త చట్టాన్ని ఇజ్రాయెల్‌ పార్లమెంట్ ఆమోదించాక, అంతర్జాతీయంగా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. అయినా అమెరికా ఇజ్రాయెల్‌ను విమర్శించడానికి నిరాకరించింది. “ఉగ్రవాదానికి పాల్పడిన వ్యక్తులపై తమ సొంత చట్టాలను, శిక్షలను నిర్ణయించుకునే ఆ దేశ సార్వభౌమ హక్కును అమెరికా గౌరవిస్తుంది” అని విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. “అటువంటి చర్య ఏదైనా నిష్పక్షపాత విచారణతో, దానికి సంబంధించిన అన్ని వర్తించే హామీలు, రక్షణలకు అనుగుణంగా అమలవుతుందని మేము విశ్వసిస్తున్నామని” ఆ […]
Read more

ఇరాన్ పార్లమెంట్‌ స్పీకర్‌తో చర్చలు జరుపుతున్నామన్న ట్రంప్… ఖండించిన బఘేర్!

దుబాయ్: టెహ్రాన్‌తో యుద్ధాన్ని ముగించే ఒప్పందం “త్వరలో” కుదరకపోతే, ఇరాన్ ఇంధన వనరులను, డీశాలినేషన్ ప్లాంట్లతో సహా ఇతర కీలక మౌలిక సదుపాయాలను ధ్వంసం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. న్యూయార్క్ పోస్ట్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ట్రంప్‌ మాట్లాడుతూ…ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఖాలిబాఫ్‌తో అమెరికా చర్చలు జరుపుతోందని ట్రంప్ చెప్పారు. గతంలో వాషింగ్టన్ సంప్రదింపుల భాగస్వామిగా ఈ మాజీ రివల్యూషనరీ గార్డ్ కమాండర్ పేరు వినిపించింది, కానీ ఇరాన్ అమెరికాతో […]
Read more

ఇరాన్ చమురును స్వాధీనం చేసుకుంటాం…ఖర్గ్ ద్వీపంపై కన్నేసిన అమెరికా బలగాలు!

వాషింగ్టన్‌: మధ్యప్రాచ్యంలో అమెరికా బలగాలు తమ ఉనికిని విస్తరిస్తున్న నేపథ్యంలో, ఇరాన్‌లోని “చమురును స్వాధీనం చేసుకోవడానికి” తాను “ప్రాధాన్యత ఇస్తానని”, కీలకమైన ఎగుమతి కేంద్రమైన ఖర్గ్ ద్వీపాన్ని వాషింగ్టన్ స్వాధీనం చేసుకోవచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక పేర్కొంది. “నిజం చెప్పాలంటే, ఇరాన్‌లోని చమురును తీసుకోవడమే నాకు అత్యంత ఇష్టమైన విషయం,” అని ఆయన ఫైనాన్షియల్ టైమ్స్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అన్నారు. చమురు రంగాన్ని “నిరవధికంగా” నియంత్రించాలని అమెరికా లక్ష్యంగా […]
Read more

ఇరాన్‌ అణుకేంద్రాలపై దాడులు…అయినా హర్ముజ్ ద్వారా మానవతా సాయానికి ఓకే!

టెహ్రాన్‌: తన అణు కేంద్రాలపై దాడులు జరుగుతున్నప్పటికీ, కీలకమైన ఈ జలమార్గం గుండా మానవతా సహాయం, వ్యవసాయ సరుకులను రవాణా చేయడానికి అనుమతించాలన్న ఐక్యరాజ్యసమితి అభ్యర్థనను టెహ్రాన్ అంగీకరించిందని అలీ బహ్రెయిని తెలిపారు. నెల రోజుల యుద్ధం తర్వాత, ఈ రవాణా కీలక ప్రదేశంలో ఇది మొదటి ముందడుగు అవుతుంది. ప్రభుత్వాలు ప్రధానంగా చమురు, సహజ వాయువు సరఫరాలపై నిరోధంపై దృష్టి సారించగా, ఎరువులపై విధించిన ఈ ఆంక్షలు ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం, ఆహార భద్రతకు ముప్పు కలిగిస్తున్నాయి. […]
Read more

నేపాల్ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీ అరెస్టు!

కఠ్మండూ: నేపాల్‌ కొత్త ప్రధానిగా బాలేంద్ర షా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే ఆ దేశ మాజీ ప్రధాని కేపీ శర్మ ఓలీని అరెస్టు చేశారు. గత ఏడాది జరిగిన జెన్‌జీ ఆందోళనలను హింసాత్మకంగా అణచివేశారనే ఆరోపణలపై ఆయన అరెస్ట్ జరిగినట్టు తెలుస్తోంది. భక్తపూర్‌లోని గుండులో ఉన్న ఆయన నివాసం నుంచి నేపాల్ పోలీసులు ఓలీని అదుపులోకి తీసుకున్నారు. ఓలీతో పాటు, ఆయన మాజీ హోం మంత్రి రమేష్ లేఖక్‌ను కూడా అరెస్టు చేశారు. “మాజీ […]
Read more

చమురు అమ్మకం ఇరాన్ రోజుకు 139 మిలియన్ డాలర్లు సంపాదిస్తోంది…రిపోర్ట్‌!

టెహ్రాన్‌: యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి, హర్ముజ్ జలసంధిని ఉపయోగించుకోగలిగిన ఏకైక ప్రధాన ఎగుమతిదారుగా మారిన తర్వాత ఇరాన్… చమురు అమ్మకాల నుండి వందల మిలియన్ల డాలర్ల అదనపు ఆదాయాన్ని ఆర్జించి ఉండవచ్చు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ధరల కదలికల వల్ల ఇస్లామిక్ రిపబ్లిక్ రెండు విధాలుగా ప్రయోజనం పొందుతోంది. దాని ప్రధాన ముడి చమురు గ్రేడ్, ప్రధానంగా చైనాలోని వినియోగదారులకు, బ్రెంట్‌తో పోలిస్తే 10 నెలలకు పైగా అతి తక్కువ తగ్గింపుతో అమ్ముడవుతోంది. అంతేకాక, బాంబు దాడులు […]
Read more

హర్ముజ్ జలసంధిని తెరవడానికి ఇరాన్‌కు ఏప్రిల్ 6 వరకు గడువును పొడిగించిన ట్రంప్!

వాషింగ్టన్‌: హర్మూజ్ జలసంధిని తిరిగి తెరిచేందుకు ఇరాన్‌కు ఏప్రిల్ 6 వరకు గడువు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వెల్లడించారు. ఈ దాడులను వాయిదా వేయాలన్న అభ్యర్థన టెహ్రాన్ నుండే వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ తన ట్రూత్ సోషల్‌‌లో చేసిన తాజా ప్రకటలో… ఇరాన్ యుద్ధాన్ని ముగించడానికి జరుగుతున్న చర్చలు చాలా బాగా సాగుతున్నాయని అన్నారు. ‘‘ఇరాన్ ప్రభుత్వ అభ్యర్థన మేరకు విద్యుత్ ప్లాంట్ల విధ్వంసాన్ని 10 రోజుల పాటు.. అంటే 2026 ఏప్రిల్ […]
Read more
1 12 13 14 15 16 56

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.