Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: అంతర్జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

యెమెన్ రాజధాని సనాపై అమెరికా వైమానిక దాడుల్లో 12 మంది మృతి, 30 మంది గాయపడ్డారు…హౌతీలు!

సనా : యెమెన్ రాజధాని సనాలో రద్దీగా ఉండే మార్కెట్‌పై అమెరికా తాజాగా జరిపిన వైమానిక దాడుల్లో మరణించిన వారి సంఖ్య 12 కి పెరిగిందని, కనీసం 30 మంది గాయపడ్డారని హౌతీ నియంత్రణలో ఉన్న ఆరోగ్య అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. హౌతీలు నడుపుతున్న అల్-మసిరా టీవీ ప్రకారం, సనాలోని అత్యంత రద్దీగా ఉండే మార్కెట్లలో ఒకటైన షుబ్ పరిసరాల్లోని ఫర్వా మార్కెట్‌ను వైమానిక దాడులు లక్ష్యంగా చేసుకున్నాయి. శిథిలాల కింద ప్రాణాలతో బయటపడిన వారి […]
Read more

గాజా యుద్ధాన్ని ముగించడానికి, మిగిలిన బందీల విడుదలకు సిద్ధంగా ఉన్నామన్న హమాస్!

కైరో: గాజాలో యుద్ధాన్ని ముగించడానికి, ఇజ్రాయెల్‌లో జైలులో ఉన్న పాలస్తీనియన్ల కోసం ఇజ్రాయెల్ బందీలను మార్పిడి చేయడానికి హమాస్ సమగ్ర ఒప్పందాన్ని కోరుకుంటుందని, పాలస్తీనియన్ మిలిటెంట్ గ్రూప్‌కు చెందిన ఒక సీనియర్ అధికారి అన్నారు. అంతేకాదు ఇజ్రాయెల్ మధ్యంతర యుద్ధ విరమణ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నామని అన్నారు. ఓ టెలివిజన్ ప్రసంగంలో, చర్చల బృందానికి నాయకత్వం వహిస్తున్న గ్రూప్ గాజా చీఫ్ ఖలీల్ అల్-హయ్యా మాట్లాడుతూ… తమ గ్రూప్ ఇకపై మధ్యంతర ఒప్పందాలకు అంగీకరించదని అన్నారు. మధ్యంతర ఒప్పందాల […]
Read more

పాలస్తీనాను గుర్తించాలనే ఫ్రెంచ్‌ ప్రణాళికలపై మండిపడ్డ నెతన్యాహు!

జెరూసలేం: పాలస్తీనా దేశాన్ని గుర్తించాలనే ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ ప్రణాళికలపై ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు విరుచుకుపడ్డారు. “మా దేశం మధ్యలో పాలస్తీనా రాజ్యం అనే ఆలోచనను ప్రోత్సహించడంలో అధ్యక్షుడు మాక్రాన్ వైఖరిని ఇజ్రాయెల్‌ ప్రధాని తీవ్రంగా తప్పుపట్టారు. ఈ సందర్భంగా ఈ వారం ప్రారంభంలో మాక్రాన్ చేసిన వ్యాఖ్యలను నెతన్యాహు ప్రస్తావించారు. “వాస్తవికతను కాదని, కేవలం ఊహాగానాల ఆధారంగా మేము మా ఉనికికి ప్రమాదంలో నెట్టము. ఇజ్రాయెల్ ఉనికికి ప్రమాదం కలిగించే పాలస్తీనా రాజ్య […]
Read more

కాల్పుల విరమణ ఒప్పందం రద్దు తర్వాత గాజాలో నాలుగు లక్షల మంది నిరాశ్రయులయ్యారు… ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ!

న్యూయార్క్‌ : జనవరి కాల్పుల విరమణ ఒప్పందం రద్దయినప్పటినుంచి గాజా స్ట్రిప్‌లో దాదాపు నాలుగులక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారని పాలస్తీనా శరణార్థుల కోసం పనిచేస్తున్న యూఎన్‌ ఏజెన్సీ (UNRWA) సామాజిక మాథ్యమం Xలో హెచ్చరించింది. “యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి పాలస్తీనియన్లు ఇప్పుడు సహాయ సామాగ్రిని అందుకోవడంలో అతి ఎక్కువ రోజులు అంతరాయాన్ని ఎదుర్కొంటున్నారు” అని యూఎన్‌ ఏజెన్సీ తన సోషల్‌మీడియా ఖాతోలో పేర్కొంది. ఈ దుస్థితిని నివారించడానికి హమాస్‌, ఇజ్రాయెల్‌ మధ్య సంధిని తిరిగి ప్రారంభించాలని UNRWA […]
Read more

గాజాను “భూతల నరకం”గా అభివర్ణించిన రెడ్ క్రాస్!

జెనీవా: పాలస్తీనా నిరాశ్రయుల దుస్థితిని చూసి చలించిన రెడ్ క్రాస్ అధ్యక్షుడు గాజాను “భూమిపై నరకం”గా అభివర్ణించారు. రెండు వారాల్లోగా తమ ఫీల్డ్ హాస్పిటల్‌లో సరఫరాలు అయిపోతాయని హెచ్చరించారు. గాజాను”భూతల నరకం అని వర్ణించాల్సిన పరిస్థితిలో ఇప్పుడు మనం ఉన్నాము… చాలా ప్రాంతాల్లో ప్రజలకు నీరు, విద్యుత్, ఆహారం అందుబాటులో లేవు” అని మిర్జానా స్పోల్జారిక్ జెనీవాలోని అంతర్జాతీయ రెడ్ క్రాస్ కమిటీ ప్రధాన కార్యాలయంలో రాయిటర్స్‌తో అన్నారు. మార్చి 2న ఇజ్రాయెల్ సహాయ ట్రక్కుల ప్రవేశాన్ని […]
Read more

గాజా ఇప్పుడు హిరోషిమాగా మారింది: తమ నేరాలను ఒక్కొక్కటిగా బయటపెడుతున్న ఇజ్రాయెల్ సైనికులు!

జెరూసలేం : ఇజ్రాయెల్ సైనికులు సరిహద్దు వెంబడి బఫర్ జోన్ ప్రాంతాన్ని స్థాపించడానికి గాజాలో విస్తృతమైన విధ్వంసం, హత్యలను వివరిస్తూ వివరణాత్మక సాక్ష్యాలను అందించారని ఇజ్రాయెల్ గ్రూప్ బ్రేకింగ్ ది సైలెన్స్ కొత్త నివేదిక తెలిపింది. బఫర్ జోన్ ప్రణాళికను అమలు చేయడంలో పాల్గొన్న దళాల వివరాలను నివేదిక సంకలనం చేసింది. “ఈ మిషన్లలో ఒకటి గాజా లోపల ‘బఫర్ జోన్’ని సృష్టించడం, అంటే ఆచరణలో ఆ ప్రాంతాన్ని నేలమట్టం చేయడం. ఉద్దేశపూర్వక విధ్వంసం ద్వారా, సైన్యం […]
Read more

శిధిల నగరం గాజాలో ఆశ్రయం కోసం అన్వేషిస్తున్న నిరాశ్రయులు!

గాజా: పాలస్తీనాలోని గాజా స్ట్రిప్‌లో పాలస్తీనియన్లను వైమానిక బాంబులు, క్షతగాత్రుల అరుపులు, భయం, అదేపనిగా వెంటాడుతున్నాయి, ఇక్కడ మూడు వారాల క్రితం ఇజ్రాయెల్ దాడులు తిరిగి ప్రారంభించడంతో నిరాశ్రయులు సురక్షిత స్థలం కోసం అన్వేషణ మొదలెట్టారు. ఇజ్రాయెల్‌ సైనికులు మమ్మల్ని” ఖాళీ చేయాలని అడుగుతున్నారు, కానీ మేము ఎక్కడికి వెళ్తాము?” అని ఉత్తరాన బాంబు దాడుల నుండి పారిపోయి అజ్-జావేదా మధ్య పట్టణంలో ఒక టెంట్‌లో నివసించడానికి వచ్చిన మహమూద్ హుస్సేన్ మీడియాను ప్రశ్నించారు. ఇజ్రాయెల్ సైన్యం […]
Read more

పీఛే ముడ్‌…టారిఫ్‌లపై వెనక్కి తగ్గిన ట్రంప్‌!

వాషింగ్టన్‌ : సుంకాల విధింపుపై అమెరికా వెనక్కి తగ్గింది. చైనా మినహా మిగతా దేశాలపై విధించిన ప్రతీకార సుంకాలను 90రోజులపాటు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, చైనాపై టారిఫ్‌లను మాత్రం 125%కి పెంచింది. దీనిపై బీజింగ్ ప్రతీకారం తీర్చుకుంది, అమెరికా దిగుమతులపై 84% లెవీ విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు తన సొంత సామాజిక వేదిక ట్రూత్‌ సోషల్‌లో స్పందించారు. మిగతా దేశాలు చైనా మాదిరిగా మాపై తిరిగి ప్రతీకార చర్యలకు పాల్పడలేదు. పైగా టారిఫ్‌లపై […]
Read more

చైనాపై 104% సుంకాలు విధించిన డోనాల్డ్ ట్రంప్…చివరి వరకు” పోరాడతామన్న బీజింగ్‌!

బీజింగ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా దిగుమతులపై ఏకంగా 104 శాతం సుంకాలను విధించారు. దీంతో చైనా-యునైటెడ్ స్టేట్స్ పూర్తి వాణిజ్య యుద్ధం వైపు అడుగులు వేసాయి. అధిక-పన్నుల ఆటలో చిక్కుకున్న రెండు దేశాలు వెనక్కి తగ్గడానికి నిరాకరించాయి, బీజింగ్ అమెరికా దూకుడుకు వ్యతిరేకంగా “చివరి వరకు” పోరాడతామని ప్రతిజ్ఞ చేసింది. ట్రంప్ మొదట చైనా వస్తువులపై 34 శాతం అదనపు సుంకాన్ని విధించింది. అయితే, బీజింగ్ అమెరికన్ ఉత్పత్తులపై తనదైన రీతిలో 34 శాతం […]
Read more

మార్కెట్ల పతనంపై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు…వాణిజ్య లోటు పరిష్కారమయ్యేవరకు సుంకాలు తగ్గించే ప్రసక్తే లేదన్న అమెరికా అధ్యక్షుడు!

వాషింగ్టన్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల కారణంగా వాల్ స్ట్రీట్‌లో గణనీయమైన నష్టాలను అమెరికా ఫ్యూచర్స్ సూచించాయి. ట్రంప్‌ టారిఫ్‌ల భయంతో నేడు ఆసియా స్టాక్ మార్కెట్లు బ్లడ్‌బాత్‌తో ప్రారంభమయ్యాయి, బొంబాయి స్టాక్‌ ఎక్స్చేంజీ భారీగా నష్టపోయి బ్లాక్‌మండేను తలపించింది. కాగా, పడిపోతున్న మార్కెట్ల గురించి ట్రంప్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్నిసార్లు అనారోగ్యాన్ని బాగు చేసుకోవాలంటే చేదుగా ఉన్నా సరే మెడిసిన్ తీసుకోవాల్చి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇక, వాణిజ్య లోటు […]
Read more
1 17 18 19 20 21 23

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.