Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: అంతర్జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

సుడాన్‌లో కాల్పుల విరమణకు అంగీకరించిన ఆర్‌ఎస్‌ఎఫ్‌!

ఖర్తోమ్‌: సుడాన్‌లో ప్రస్తుతం సైన్యం, పారామిలిటరీ దళాల మధ్య ఆధిపత్యం కోసం జరుగుతున్న ఘర్షణల కారణంగా తీవ్రమైన మానవతా సంక్షోభం నెలకొంది. ఈ సంఘర్షణ 2023లో ప్రారంభమై, ఇప్పటికీ కొనసాగుతోంది, దీని ఫలితంగా లక్షలాది మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి పారిపోవాల్సి వస్తోంది. ఆహార కొరత తీవ్రమైంది. ఈ నేపథ్యంలో సంక్షోభాన్ని నివారించేందుకు సూడాన్ పారామిలిటరీ, రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (RSF), US నేతృత్వంలోని మధ్యవర్తి బృందం ప్రతిపాదించిన మానవతావాద సంధికి అంగీకరించింది. 18 నెలలకు […]
Read more

ఫిలిప్పీన్స్‌లో కల్మేగి తుపాను బీభత్సం…114 మంది దుర్మరణం!

మనీలా: అత్యంత శక్తివంతమైన కల్మేగి తుఫాను ఫిలిప్పీన్స్‌ను అతలాకుతలం చేసింది. ఈ ప్రకృతి విలయం దెబ్బకు114 మంది మరణించగా మరో 127గురు తప్పిపోయారు. తీవ్రంగా గాయపడ్డ మరికొందరు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. కల్మేగి తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్న సెంట్రల్ ప్రావిన్స్ సెబులో చాలా మరణాలు సంభవించాయని, ఆకస్మిక వరదలతో నదులు, ఇతర జలమార్గాలు పొంగిపొర్లాయని పౌర రక్షణ కార్యాలయం డిప్యూటీ అడ్మినిస్ట్రేటర్ బెర్నార్డో రాఫెలిటో అలెజాండ్రో IV నేడు మీడియాకు తెలిపారు. మంగళవారం దక్షిణ ప్రావిన్స్ అగుసాన్ […]
Read more

విక్టరీ స్పీచ్‌లో నెహ్రూను ఉటంకించిన మమ్దానీ…ట్రంప్‌కు సవాల్‌!

న్యూయార్క్: నగర మేయర్‌గా ఎన్నికైన జోహ్రాన్ మమ్దానీ వలసలపై కఠిన చర్యలు ప్రారంభించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను సవాలు చేశారు. న్యూయార్క్ వలసదారులచే శక్తిని పొందుతుందని, వలసదారుడి నాయకత్వంలో ఉంటుందని నొక్కి చెప్పారు. తన విజయం ఒక రాజకీయ రాజవంశాన్ని కూల్చివేసిందని అన్నారు. అంతేకాదు నేరుగా అధ్యక్షుడు ట్రంప్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ట్రంప్‌.. ఇదంతా మీరు చూస్తున్నారని నాకు తెలుసు. మీకు చెప్పడానికి నా వద్ద నాలుగు మాటలు ఉన్నాయి. సౌండ్ పెంచండి. […]
Read more

న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో జోహ్రాన్ మమ్దానీ ఘనవిజయం!

వాషింగ్టన్‌: డోనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యాక రిపబ్లికన్లకు తొలిదెబ్బ తగిలింది. అత్యంత కీలకంగా భావించిన న్యూయార్క్‌ మేయర్‌ ఎన్నికల్లో డెమొక్రాటిక్‌ అభ్యర్థి మమ్దానీ విజయం సాధించారు. కాగా, అధ్యక్షుడు ట్రంప్ కూడా న్యూయార్క్ మేయర్‌ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. జోహ్రాన్ కు ఓటు వేస్తే యూదులకు వ్యతిరేకంగా ఓటు వేసినట్టే అంటూ ప్రచారం చేశారు. అయినా మమ్దానీ విజయాన్ని ఆపలేకపోయారు. మేయర్ ఎన్నికల్లో మమ్దానీకి 49.6 శాతం ఓట్లు(6,77,615) పోల్ అయ్యాయి. ప్రత్యర్థి క్యూమోకు […]
Read more

మేయర్ ఎన్నికల్లో మమ్దానీ గెలిస్తే న్యూయార్క్‌కు కష్టాలే…హెచ్చరించిన ట్రంప్‌!

వాషింగ్టన్‌: యూఎస్‌లో నేడు జరిగే మేయర్‌ ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీ విజయం సాధిస్తే, న్యూయార్క్ నగరానికి అందే ఫెడరల్ నిధులను తగ్గిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “కమ్యూనిస్ట్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీ న్యూయార్క్ నగర మేయర్ ఎన్నికల్లో గెలిస్తే, నా ప్రియమైన మొదటి ఇంటికి అవసరమైన కనీస మొత్తానికి మించి సమాఖ్య నిధులను నేను విరాళంగా ఇచ్చే అవకాశం చాలా తక్కువ, ఎందుకంటే కమ్యూనిస్ట్ నాయకత్వంలో, ఈ గొప్ప […]
Read more

ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లో శక్తివంతమైన భూకంపం… ఏడుగురు మృతి, 150 మందికి గాయాలు!

కాబూల్‌: ఆఫ్ఘనిస్తాన్‌పై ప్రకృతి పగబట్టింది. తరచూ ప్రకృతివైపరీత్యాలు సంభవించడం మామూలైపోయింది. తాజాగా మజార్-ఇ-షరీఫ్ నగరానికి సమీపంలో ఉత్తర ఆఫ్ఘనిస్తాన్‌లో 6.3 తీవ్రతతో కూడిన శక్తివంతమైన భూకంపం సంభవించింది. దీనితో కనీసం ఏడుగురు మరణించగా, 150 మంది గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. అనేకమంది శిథిలాల్లో చిక్కుకున్నారన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వెల్లడించారు. మజార్-ఇ-షరీఫ్ సమీపంలో 28 కి.మీ లోతులో ఈరోజు తెల్లవారుజామున 12:59 గంటలకు భూకంపం సంభవించిందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే […]
Read more

గాజా కాల్పుల విరమణ ఒప్పందాన్ని194 సార్లు ఉల్లంఘించిన ఇజ్రాయెల్‌!

జెరూసలేం: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్యవర్తిత్వంలో హమాస్‌తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్‌ పదేపదే ఉల్లంఘిస్తోంది. గత నెల అక్టోబర్ 10 నుండి అమల్లోకి వచ్చిన ఈ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ సైన్యం ఇప్పటికి 194 సార్లు ఉల్లంఘించిందని ప్రభుత్వ మీడియా కార్యాలయం తెలిపింది. ఈమేరకు ఆఫీస్ డైరెక్టర్ ఇస్మాయిల్ అల్-తవాబ్తే వార్తాసంస్థతో మాట్లాడుతూ… “ఎల్లోలైన్‌”ను పలుమార్లు దాటుతోంది. ఆ గీత వెలుపల ఇజ్రాయెల్ చొరబాట్లు, వైద్య సామాగ్రి, మందులు, గుడారాలు, మొబైల్ గృహాలను నిరోధించడం, […]
Read more

ఖైదీల వీడియో లీక్…ఇజ్రాయెల్ ప్రాసిక్యూటర్‌ రాజీనామా!

జెరూసలేం: గాజా యుద్ధంలో అరెస్టయిన పాలస్తీనా ఖైదీపై క్రిమినల్ విచారణ సందర్భంగా ఇజ్రాయెల్‌ సైనికులు దుర్భాషలాడిన వీడియో లీక్ కావడంపై పై ఇజ్రాయెల్ మిలిటరీ చీఫ్ లీగల్ ఆఫీసర్ రాజీనామా చేశారు. కాగా, ఆగస్టు 2024లో ఈ వీడియో లీక్‌ను ఆమోదించినందుకుగాను తాను రాజీనామా చేస్తున్నట్లు అడ్వకేట్ జనరల్ మేజర్-జనరల్ యిఫత్ టోమర్-యెరుషల్మి తెలిపారు. దుర్వినియోగంపై దర్యాప్తు తర్వాత ఐదుగురు సైనికులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఇది ఒక కలకలం రేపింది. ఈ దర్యాప్తును మితవాద […]
Read more

‘ఇమ్మిగ్రెంట్స్‌’ వర్క్ పర్మిట్ల ఆటోమేటిక్ పునరుద్ధరణను రద్దు చేసిన అమెరికా!

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండో సారి బాధ్యతలు చేపట్టిన తర్వాత వలసదారులపై కఠిన చర్యలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అగ్ర రాజ్యాధిపతి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వలస కార్మికుల వర్క్‌పర్మిట్ల (EAD) ఆటోమేటిక్ పొడిగింపును నిలిపివేయాలని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం నిర్ణయం తీసుకుంది. దీంతో వేలాది మంది విదేశీ ఉద్యోగులు ప్రభావితం అయ్యేఅవకాశం ఉంది, వీరిలో ఎక్కువ మంది భారతీయులే కావడం గమనార్హం. ఈ ఏడాది అక్టోబర్ 30 (నేటినుంచి) […]
Read more

గాజాపై ఇజ్రాయెల్‌ మారణకాండ…104మంది మృతి!

పాలస్తీనా: గాజాలో ఇజ్రాయెల్‌ యుద్ధం కారణంగా మిగిల్చిన చేదు జ్ఞాపకాలు మరిచిపోక ముందే…కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్నప్పటికీ ఇజ్రాయెల్‌ యుద్ధకాంక్ష తీరలేదు. రోజుకో సాకు చూపి పాలస్తీనియన్లను చంపుతూనే ఉంది. మొన్న అర్థరాత్రి చేసిన ఇజ్రాయెల్‌ మెరుపు దాడులతో గాజా మరోసారి వణికిపోయింది. డ్రోన్లు, యుద్ధ, నిఘా విమానాలతో ఐడీఎఫ్‌ సైన్యం విరుచుకుపడింది. మొన్న అర్థరాత్రి నుంచి బుధవారం రాత్రి వరకూ జరిగిన దాడుల్లో 100 మందికిపైగా మరణించారు. అనేక మంది గాయపడ్డారు. వీరిలో చిన్నారులు, […]
Read more
1 24 25 26 27 28 51

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.