Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

ఢిల్లీ ఎర్రకోట వద్ద పేలుడు….ఎండీ సల్మాన్ పేరు మీద రిజిస్టర్ అయిన హ్యుందాయ్ ఐ20 కారు!

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో నిన్న సాయంత్రం ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడులో కనీసం 9 మంది మృతి చెందగా,20 మందికి పైగా గాయపడ్డారు. అనేక వాహనాలు దగ్ధమయ్యాయి. కాగా, హర్యానాలోని గురుగ్రామ్‌లో కారు యజమాని ఎండీ సల్మాన్‌ను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కారు ముగ్గురి చేతులు మారినట్లు తెలుస్తోంది. మొదటసల్మాన్‌ దానిని తారిఖ్ అనే వ్యక్తికి అమ్మినట్లు గుర్తించారు. అయితే అక్కడి నుంచి అది డాక్టర్ ఉమర్ చేతికి వెళ్లింది. డాక్టర్ ఉమర్ ఆ […]
Read more

సౌదీ అరేబియాతో ద్వైపాక్షిక హజ్ ఒప్పందంపై సంతకం చేసిన భారత్‌!

న్యూఢిల్లీ: మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు జెడ్డాలో ద్వైపాక్షిక హజ్ ఒప్పందంపై సంతకం చేశారు. ఈమేరకు 2026లో భారతదేశం హజ్‌ యాత్రికుల కోటా 1,75,025గా నిర్ధారించారు. నవంబర్ 7 నుండి 9 వరకు సౌదీ అరేబియాలో అధికారికంగా పర్యటిస్తున్న రిజిజు ఆదివారం జెడ్డాలో సౌదీ హజ్, ఉమ్రా మంత్రి తౌఫిక్ బిన్ ఫౌజాన్ అల్ రబియాతో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇద్దరు మంత్రులు కొనసాగుతున్న హజ్ సన్నాహాలను సమీక్షించారు. సమన్వయం, మద్దతు వంటి […]
Read more

పూణే భూ ఒప్పందం…బిఎస్ఐని ఖాళీ చేయాలని నోటీసులిచ్చిన తహసీల్దార్!

ముంబయి: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కుమారుడుకి సంబంధించిన కంపెనీ పూణేలో వివాదాస్పదమైన 40 ఎకరాల భూమి ఒప్పందం జరిగిన కొన్ని రోజుల తర్వాత… ప్రస్తుతం సస్పెన్ష్‌లో ఉన్న తహసీల్దార్ ఆ ఆస్తిలో చాలా కాలంగా అద్దెకు ఉన్న బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా (బిఎస్ఐ)ఖాళీ చేయాలని నోటీసు జారీ చేశారు. అమాడియా ఎంటర్‌ప్రైజెస్ ఎల్‌ఎల్‌పి అనే సంస్థ ఆ ఆస్తిని ‘చట్టబద్ధంగా’ సంపాదించిందని బీఎస్‌ఈకి ఇచ్చిన నోటీసులో తహసిల్దార్‌ తెలియజేశారు. అజిత్ పవార్ కుమారుడు […]
Read more

వందే భారత్ ప్రారంభోత్సవంలో ఆర్‌ఎస్‌ఎస్ గీతం…దర్యాప్తుకు ఆదేశించిన కేరళ!

తిరువనంతపురం: ఎర్నాకులం నుండి బెంగళూరుకు కొత్తగా ప్రారంభించిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో పాఠశాల విద్యార్థులు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ గీతం పాడటంపై కేరళ ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది. కాగా, కేంద్ర మంత్రులు ఈ చర్యను దేశభక్తి గీతంగా అభివర్ణిస్తూ సమర్థించడం గమనార్హం. ఈ సంఘటనపై విచారణ నిర్వహించి నివేదిక సమర్పించాలని సాధారణ విద్యా మంత్రి వి. శివన్‌కుట్టి ప్రజా సూచనల డైరెక్టర్‌ను ఆదేశించారు. ఈ సంఘటనను ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణిస్తుందని మంత్రి కార్యాలయం విడుదల చేసిన […]
Read more

‘పౌరులను నేరస్థుల్లా చూస్తున్నారు’…. నిరసనకారుల నిర్బంధంపై రాహుల్ విమర్శలు!

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకు దిగజారుతున్న గాలి నాణ్యతకు వ్యతిరేకంగా ఇండియా గేట్ వద్ద నిరసన తెలుపుతున్న చాలామందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామంపై లోక్‌సభలో ప్రతిపక్షనేత ఆందోళన వెలిబుచ్చారు. స్వచ్ఛమైన గాలి కావాలంటున్న పౌరులను “నేరస్థులు” లాగా ఎందుకు చూస్తున్నారని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని విమర్శించారు. స్వచ్ఛమైన గాలిని కోరుతున్న పౌరులపై ప్రభుత్వం దాడి చేయడానికి బదులుగా…వాయు కాలుష్యంపై “ప్రస్తుతం” నిర్ణయాత్మక చర్య తీసుకోవాలని రాహుల్‌గాంధీ పిలుపునిచ్చారు. నిరసనకారులను “తీసుకెళ్లి” […]
Read more

“ఓట్ల కోసం ప్రధాని మోదీ RJD పట్ల భయాన్ని రేకెత్తిస్తున్నారు”… ప్రశాంత్ కిషోర్!

పాట్నా: జన సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై విమర్శలు గుప్పించారు. బీహార్ ఎన్నికల్లో “ఓట్ల కోసం” ఓటర్లలో “ఆర్‌జేడీ పట్ల భయాన్ని రేకెత్తిస్తున్నారని” ఆరోపించారు. ఎందుకంటే ఆయనకు వేరే చెప్పడానికి ఏమీ లేదు. గత కొన్ని దశాబ్దాలుగా, NDA, BJP, నితీష్ కుమార్ ఓట్లు పొందడానికి ఉత్తమ మార్గం లాలూ పట్ల భయాన్ని చూపించడమే. తద్వారా పని పూర్తయినా, కనీసం ‘అటవిక రాజ్యం’ తిరిగి రాలేదని ప్రజలు చెబుతారు. కానీ ఈసారి […]
Read more

రచ్చ రచ్చ అయిన పూణే భూ ఒప్పంద వివాదం…డీల్ రద్దు చేసిన అజిత్ పవార్!

ముంబయి: పూణేలో భూ ఒప్పంద వివాదం మహారాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. డిప్యూటీ సీఎం అజిత్​ పవార్​ కొడుకు పార్ధ్‌పవార్‌కు చెందిన కంపెనీకీ కోట్ల రూపాయల విలువైన భూమిని అప్పనంగా దోచిపెట్టిన వైనంపై రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగుతోంది. ఈ పరిస్థితుల్లో డీల్ రద్దు చేసినట్లు ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రకటించారు. తన కుమారుడు పార్థ్ పవార్ సంస్థ కొనుగోలు చేయాలనుకున్న రూ. 300 కోట్ల విలువైన భూమి ప్రభుత్వానిదని తన కొడుక్కి తెలియదని, వివాదం రేగడంతో […]
Read more

బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల నుండి వీధి కుక్కలను తొలగించండి…సుప్రీంకోర్టు సంచలన ఆదేశం!

న్యూఢిల్లీ: కుక్కకాటు కేసులు ఆందోళనకర రీతిలో పెరుగుతున్న నేపథ్యంలో వీధికుక్కల అంశంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. విద్యాసంస్థలు, ఆసుపత్రులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఇతర బహిరంగ ప్రదేశాల నుంచి వీధి కుక్కలను తొలగించాలని ఆదేశించింది. అంతేకాదు ప్రజల భద్రత, పరిశుభ్రత కోసం… స్టెరిలైజేషన్ తర్వాత కుక్కలను సంబంధిత డాగ్ షెల్టర్లకు మార్చాలని పేర్కొంది. ఎనిమిది వారాల్లోగా ఈ తొలగింపు ప్రక్రియను పూర్తి చేయాలని కూడా అత్యున్నత న్యాయస్థానం తన ఆదేశాలలో స్పష్టం చేసింది. కుక్క […]
Read more

బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌కు మహిళా ఓటర్ల మద్దతు!

పాట్నా: బీహార్‌లో జరిగిన మొదటి విడత ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. మొత్తం 121 నియోజకవర్గాల్లో ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేశారు. సుమారు 65శాతం మంది తమ ఓటు హుక్కును వినియోగించుకున్నారు. గత ఎన్నికల్లో పోలింగ్‌ శాతం 57.29 మాత్రమే నమోదైంది. కాగా, తాజా ఎన్నికల్లో మహిళా ఓటర్లలో ఎక్కువ శాతం సీఎం నితీష్‌కుమార్‌కు బాసటగా నిలిచారని పలు సర్వేలు చెబుతున్నాయి. ఈమేరకు దర్భంగా జిల్లాలోని అలీనగర్‌కు చెందిన రేఖా దేవి మాట్లాడుతూ… తన జీవితాన్ని మెరుగుపరిచినందుకు ముఖ్యమంత్రి […]
Read more

‘జేఎన్‌యు’ విద్యార్థి సంఘం ఎన్నికల్లో వామపక్ష కూటమి గెలుపు!

న్యూఢిల్లీ: జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU) విద్యార్థి సంఘం ఎన్నికల్లో వామపక్ష కూటమి ఘనవిజయం సాధించింది. నాలుగు కీలక స్థానాలను లెఫ్ట్ కూటమి (ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎ, డిఎస్‌ఎఫ్‌) కైవసం చేసుకోవడం విశేషం. జెఎన్‌యుఎస్‌యు ఎన్నికలు ఈ నెల 4న జరిగాయి. ఆ రోజు నాలుగు సెంట్రల్‌ ప్యానెల్‌ పోస్టులతోపాటు, 42 కౌన్సిలర్ల పోస్టులకు పోలింగ్‌ జరిగింది. అర్హత కలిగిన 9,043 మంది విద్యార్థులలో 67 శాతం ఓట్లు వేశారు. మంగళవారం రాత్రి నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ […]
Read more
1 15 16 17 18 19 65

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.