Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూ సంతకం చేసిన బ్రిక్స్‌ నేతలు!

రియోడిజనీరో: పహల్గామ్ ఊచకోతను ఖండిస్తూ బ్రిక్స్ దేశాలకు చెందిన 11 మంది నాయకులు ఒక ప్రకటనపై సంతకం చేశారు. ఉగ్రవాదాన్ని “నేరపూరితమైనది, సమర్థించలేనిది”అని బ్రెజిల్‌ రాజధాని రియో డి జనీరో బ్రిక్స్‌ శిఖరాగ్ర సమావేశంలో నేతలు ఒక ఉమ్మడి ప్రకటనలో అభివర్ణించారు. ఉగ్రదాడులు ఎక్కడ జరిగినా ముక్త కంఠంతో ఖండిస్తున్నామని, టెర్రరిజం ఏ రూపంలో ఉన్న వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశాయి. ఐక్యరాజ్య సమితి గుర్తించిన ఉగ్రవాదులు, ఉగ్ర సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాయి. ఈ […]
Read more

రాజ్-ఉద్ధవ్ ఠాక్రే పునఃకలయికపై తీవ్రంగా మండిపడ్డ బీజేపీ!

ముంబయి: శివసేన (UBT) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే రెండు దశాబ్దాల తర్వాత ఏకమయ్యారు. మొదటిసారిగా ముంబైలోని వర్లిలో జరిగిన ‘మరాఠీ స్వరం’ విజయోత్సవ సభలో వారిద్దరూ ఒకే వేదికను పంచుకున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో హిందీని మూడవ భాషగా తప్పనిసరి చేయాలన్న ఫడ్నవీస్ ప్రభుత్వం నిర్ణయానికి వ్యతిరేకంగా అన్నదమ్ములు కలిసిపోయారు. కాగా, థాకరే సోదరుల కలయికపై బేజేపీ విరుచుకుపడింది. ఈ ర్యాలీని జీహాదీ, హిందూ వ్యతిరేక సమావేశం అంటూ […]
Read more

ఎస్పీ నేత ఆజం ఖాన్ పార్టీ నుంచి వైదొలగే అవకాశం, ఉత్తరప్రదేశ్‌లో కొత్త రాజకీయ పొత్తు!

లక్నో: సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ నాయకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ మంత్రి ఆజం ఖాన్ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారనే ఊహాగానాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న ఆజం ఖాన్, యూపీ రాజకీయాల్లో, ముఖ్యంగా రాష్ట్ర ముస్లిం ఓటర్లలో కీలక వ్యక్తిగా కొనసాగుతున్నారు. ఆయన భార్య, మాజీ ఎంపీ తజీన్ ఫాత్మా ఇటీవల చేసిన ప్రకటన ఈ ఊహాగానాలను మరింత తీవ్రతరం చేసింది, ఎస్పీ నుండి వైదొలగడం, మరొక రాజకీయ పార్టీతో తిరిగి పొత్తు పెట్టుకోవడంపై ఆమె సంకేతాలు […]
Read more

తమిళనాడులో దళిత పారిశుధ్య కార్మికులపై కుల వివక్ష…విచారణకు ఆదేశించిన ప్రభుత్వం!

చెన్నై: విల్లుపురం జిల్లాలోని మెల్పతి గ్రామానికి చెందిన నలుగురు దళిత పారిశుధ్య కార్మికులపై కుల వివక్షకు పాల్పడ్డారనే ఆరోపణలపై దర్యాప్తు చేయాలని తమిళనాడు ప్రభుత్వం విల్లుపురం ఎస్పీని ఆదేశించింది. ముఖ్యమంత్రి ప్రత్యేక సెల్‌కు సమర్పించిన పిటిషన్‌ను అనుసరించి డిప్యూటీ సెక్రటరీ (హోం శాఖ) నుండి ఈ ఆదేశాలు వెలువడ్డాయి. తనతో పాటు తన ముగ్గురు సహచరులను మెల్పతి పంచాయతీ అధ్యక్షుడు, కొంతమంది హిందువులు పదేపదే దుర్భాషలాడారని ఒక కార్మికుడు ఆరోపించారు. “మమ్మల్ని అవమానించారు, బెదిరించారు, ఒట్టి చేతులతో […]
Read more

ప్రధాని మోదీ 42 దేశాలు సందర్శించారు కానీ మణిపూర్‌కు మాత్రం వెళ్లలేదు..మల్లికార్జున ఖర్గే!

హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 42 దేశాలు సందర్శించారు, కానీ ఆయనకు మణిపూర్ సందర్శించడానికి సమయం లేదు, అక్కడ ప్రజలపై దాడులు జరుగుతున్నాయి, మరణాలు సంభవిస్తున్నాయని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. మణిపూర్ సందర్శించకపోవడంపై… భారతదేశం-పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై ప్రధాని మోదీ మౌనం వహించడాన్ని కాంగ్రెస్ చీఫ్ తీవ్రంగా విమర్శించారు. పాక్‌ ఆక్రమిత కాశ్మీర్ (పిఓకె)ను స్వాధీనం చేసుకోవడంలో ఆయన ఎందుకు విఫలమయ్యారని, పాకిస్తాన్ పై […]
Read more

దేశంలో ఎమర్జెన్సీ…RSS పాత్ర!

ఈ ఏడాది జూన్‌లో మనదేశం ఎమర్జెన్సీ 50వ వార్షికోత్సవం జరుపుకుంది. 1975లో ఇందిరా గాంధీ విధించిన అత్యవసర పరిస్థితి గురించి చాలా రాశారు, ఈ కాలంలో అనేక ప్రజాస్వామ్య స్వేచ్ఛలు నిలిపివేశారు. వేలాది మంది జైలు పాలయ్యారు. మీడియాను సెన్సార్ చేశారు. గత దశాబ్దంలో ఇందిరా గాంధీ తీసుకున్న విప్లవాత్మక చర్యలు, బ్యాంకుల జాతీయీకరణ, ప్రైవేట్ పర్స్ రద్దు వంటివి గుర్తుచేసుకునే కొంతమంది దళిత నాయకులు ఈ కాలాన్ని చాలా భిన్నంగా చూస్తారు. దీని గురించి విశ్లేషించాల్సిన […]
Read more

బీహార్ ఓటర్ల జాబితా సవరణ…ఈసీతో సమావేశంపై నిరాశ వ్యక్తం చేసిన ఇండియా కూటమి!

న్యూఢిల్లీ: బీహార్‌లో ఇటీవల ప్రకటించిన “స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్” (SIR) ఎన్నికల జాబితాకు వ్యతిరేకంగా నిన్న సాయంత్రం ఇండియా కూటమి ప్రతినిధి బృందం ఎన్నికల సంఘాన్ని (EC) కలిసింది – ఈ సమావేశం”నిరాశపరిచింది”, “స్నేహపూర్వకంగా లేదు” అని నేతలు పేర్కొన్నారు. బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు SIRను ప్రారంభించాలనే EC చర్యను ఇండియా కూటమి వ్యతిరేకించింది. దాని సాధ్యాసాధ్యాల గురించి ప్రశ్నలను లేవనెత్తింది, దీని కోసం కమిషన్ బీహార్‌లో 7.75 కోట్ల మంది అర్హతగల […]
Read more

భారతదేశంలో ముస్లింల సామాజిక, విద్యా స్థితి – ఒక అధ్యయనం!

‘ముస్లిం వెనుకబాటుతనం’ అనేది భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలో ఒక చర్చనీయాంశం. ముస్లింలు సాధారణంగా నిరక్షరాస్యత, అవకాశాల లేకపోవడం కారణంగా పేదలుగా జీవిస్తున్నారనేది వాస్తవం. జోయా హసన్, రీతు మీనన్ వారి ‘ఎ స్టడీ ఆఫ్ ముస్లిం ఉమెన్ ఇన్ ఇండియా’ అనే పుస్తకంలో “మతం అనేది విద్య పరంగా అత్యంత ముఖ్యమైన రంగాలలో ఒకటి. ముస్లింలు గత 75 సంవత్సరాల భారత స్వతంత్ర చరిత్రలో విద్యాపరంగా అత్యంత వెనుకబడిన సామాజిక-మత సమూహాలలో ఒకటిగా గుర్తింపు పొందారు” (Unequal […]
Read more

“నా కొడుకు ఎక్కడ ఉన్నాడు?”

-9 ఏళ్ల క్రితం నాటి కేసు మూసివేతకు కోర్టు అంగీకారం -అదృశ్యమైన కొడుకు కోసం ఓ తల్లి న్యాయ పోరాటం న్యూఢిల్లీలోని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థి నజీబ్ 9 సంవత్సరాల క్రితం అదృశ్యమయ్యాడు. ఇప్పటికీ అతడి జాడ లేదు. నజీబ్ ఎక్కడ ఉన్నాడు? అనే ప్రశ్నకు సమాధానం లభించక అతడి తల్లి మౌనంగా బాధ పడుతుండగా, ఈ కేసు ముగించమని ఢిల్లీ పోలీసులు, సీబీఐ కోర్టును కోరాయి. చివరికి ఢిల్లీ లోని రౌజ్ […]
Read more

తమిళనాడు కస్టడీ మరణంపై సీబీఐ దర్యాప్తు…ఐదుగురు పోలీసుల అరెస్టు!

చెన్నై : తమిళనాడులో సంచలనం సృష్టించిన కస్టడి మరణంపై సీఎం స్టాలిన్‌ కొరడా ఝళిపించారు. , దొంగతనం కేసుకు సంబంధించి విచారణ కోసం తీసుకెళ్లిన అజిత్ కుమార్ (29) మరణంపై దర్యాప్తును సీబీఐకి బదిలీ చేశారు. విచారణ కోసం తీసుకెళ్లిన అజిత్ కుమార్ తిరుప్పువనంలో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించాడని తెలిసి తాను బాధపడ్డానని, “విచారణ సమయంలో పోలీసులు కొట్టడం వల్లే” అని ముఖ్యమంత్రి అన్నారు. “ఇది అన్యాయం, క్షమించలేము” అని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ […]
Read more
1 18 19 20 21 22 44

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.