Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

పహల్గామ్ దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల ఆచూకీ, ‘కాల్పుల విరమణ’లో ట్రంప్ పాత్రపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్‌!

న్యూఢిల్లీ: పహల్గామ్‌ పరిణామాలు, ఉగ్రదాడిలో దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల ఆచూకీ, ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్‌-పాక్‌ మధ్య ‘కాల్పుల విరమణ’లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాత్రపై సమాధానాలు ఇవ్వాలని కాంగ్రెస్‌ కేంద్రాన్ని డిమాండ్‌ చేసింది. ఈ మేరకు కాంగ్రెస్‌ నేత జైరాం రమేష్‌ Xలో పోస్ట్‌ చేశారు. “నెహ్రూ వర్ధంతి నాడు కూడా, దేశ అత్యున్నత పదవిలో ఉన్న వ్యక్తి నెహ్రూను తిట్టడంలో చురుకుగా ఉన్నారు. నేడు మనం ఎదుర్కొంటున్న చాలా తీవ్రమైన సమస్యల నుండి […]
Read more

‘పాకిస్తాన్ నుండి వచ్చింది’ అంటూ కర్ణాటకలో ఐఏఎస్ అధికారిని అవమానించిన బీజేపీ నేత!

బెంగళూరు : ప్రభుత్వ ఉన్నత పదవుల్లో పనిచేస్తున్న ముస్లిం మహిళలపై మతపరమైన, మరియు అవమానకరమైన వ్యాఖ్యలు చేసినందుకు బిజెపి సీనియర్ నాయకులు తీవ్ర విమర్శలకు గురయ్యారు. తాజా వివాదంలో మే 24న కలబురగిలో జరిగిన నిరసన ర్యాలీలో బిజెపి నాయకుడు కర్ణాటక శాసన మండలిలో ప్రతిపక్ష చీఫ్ విప్ ఎన్ రవికుమార్ అవమానకరమైన వ్యాఖ్య చేశారు. మే 26న పార్టీ ‘కలబురగి చలో’ ప్రచారం సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తే… కలబురగి జిల్లా కలెక్టర్ ఫౌజియా తరన్నమ్ […]
Read more

పాకిస్తాన్ తరపున గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలతో CRPF జవాన్ మోతీ రామ్ జాట్‌ను అరెస్టు చేసిన ఎన్‌ఐఏ!

న్యూఢిల్లీ : పాకిస్తాన్ నిఘా అధికారులతో సున్నితమైన సమాచారాన్ని పంచుకున్నందుకు ఢిల్లీలోని CRPF జవాన్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అరెస్టు చేసింది. మోతీ రామ్‌ జాట్‌ అనే సీఆర్‌పీఎఫ్‌ జవాన్‌ 2023 నుంచి పాకిస్థాన్‌ నిఘా అధికారులకు జాతీయ భద్రతకు సంబంధించిన కీలకమైన సమాచారాన్ని అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. వివిధ మార్గాల ద్వారా పాకిస్తాన్ అధికారుల నుండి అతను అందుకున్న డబ్బు జాడను కూడా ఏజెన్సీ గుర్తించగలిగిందని NIA తెలిపింది. మోతీ రామ్ జాట్ అరెస్టు […]
Read more

అస్సాంలో ‘వెరిఫికేషన్ డ్రైవ్’…50 మంది పౌరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు!

గౌహతి: బంగ్లాదేశ్ నుండి వచ్చిన అక్రమ వలసదారులను గుర్తించడానికి అస్సాం ప్రభుత్వం ‘వెరిఫికేషన్ డ్రైవ్’ను ముమ్మరం చేసింది. దీంతో ఈ వారాంతంలో కనీసం 50 మందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసు వర్గాల ప్రకారం, ‘అనుమానాస్పద పౌరులను’ గౌహతి, గోలాఘాట్, ధుబ్రి, బార్పేట,కాచర్‌తో సహా అనేక జిల్లాల నుండి అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న పౌరులను రూప్‌నగర్ పోలీస్ రిజర్వ్‌లో ఉంచామని, వారి పత్రాలను తనిఖీ చేస్తున్నామని అధికారులు తెలిపారు. అయితే అదుపులోకి తీసుకున్న కొంతమంది తాము భారతీయ […]
Read more

భారీ వర్షాల కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో పాక్షికంగా కూలిపోయిన టెర్మినల్ -1 కనోపీ!

న్యూఢిల్లీ: ఢిల్లీలో శనివారం రాత్రి, ఆదివారం ఉదయం ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతోపాటు బలమైన గాలులు వీచాయి. వీటి ధాటికి ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్ 1 ముందు భాగంలో పందిరి ఆదివారం ఉదయం పాక్షికంగా కూలిపోయిందని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. దేశ రాజధాని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGIA)లో విమాన కార్యకలాపాల కోసం పునరుద్ధరించి, టెర్మినల్ 1 (T1) ఇటీవల ప్రారంభించారు. ఇది దేశంలోనే అతిపెద్ద, అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయం కూడా. […]
Read more

మణిపూర్‌లో మైతీల నిరసన సందర్భంగా టియర్ గ్యాస్ ప్రయోగం…హోంశాఖ అధికారులను కలవనున్న మెయిటీ సంస్థ!

గౌహతి: ఘర్షణలతో అతలాకుతలమైన మణిపూర్‌లో మళ్లీ అలజడి రేగింది. మైతీల నిరసన సందర్భంగా రాజ్ భవన్‌లోకి చొరబడటానికి ప్రయత్నించారని ఆరోపిస్తూ మెయిటీ సంస్థ COCOMIకి చెందిన నిరసనకారులను చెదరగొట్టడానికి భద్రతా దళాలు టియర్ గ్యాస్ షెల్స్‌ను ప్రయోగించాయి. మణిపూర్ ఐక్యతపై సమన్వయ కమిటీ (COCOMI) “సహకార నిరాకరణ ఉద్యమం” ప్రకటించిన ఒక రోజు తర్వాత ఈ నిరసన జరిగింది. దీంతో ఆగ్రహం చెందిన మైతీ సంస్థ సభ్యులు గవర్నర్ అజయ్ కుమార్ భల్లా, ప్రధాన కార్యదర్శి, DGP, […]
Read more

బెంగాల్‌లోని కాలిగంజ్ సీటు ఉప ఎన్నిక… సీఎం మమతా బెనర్జీకి అగ్ని పరీక్ష!

కోల్‌కతా: నాలుగురాష్ట్రాల్లోని ఐదు అసెంబ్లీ స్థానాలకు భారత ఎన్నికల కమిషన్‌ నిన్న ఉప ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసింది. దీంతో పశ్చిమ బెంగాల్‌లో మరోసారి ఎన్నికల వేడి రాజుకుంది. ఈ మేరకు ఆ రాష్ట్రంలోని నాడియా జిల్లా కాలిగంజ్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల జూన్ 19న ఉప ఎన్నికలు జరగనుంది. జూన్ 23న లెక్కింపు జరుగుతుంది. ఎన్నికలు జరగనున్న మిగిలిన నాలుగు నియోజకవర్గాలు గుజరాత్‌లోని కాడి, విసావ్‌దార్, పంజాబ్‌లోని లూధియానా-వెస్ట్ మరియు కేరళలోని నీలంబర్. నామినేషన్లు […]
Read more

బీజేపీ కపటత్వం…పార్లమెంటులో 0% ముస్లిం ఎంపీలు, కానీ దౌత్య బృందంలో 16% ప్రాతినిధ్యం!

న్యూఢిల్లీ : పహల్గామ్‌లో జరిగిన విషాదకరమైన ఉగ్రవాద దాడి మరోసారి ప్రపంచ సమాజం ముందు ఉగ్రవాదం క్రూరమైన వాస్తవాలను బహిర్గతం చేసింది. అదే సమయంలో, జాతీయ భద్రత, మైనారిటీలు, ముఖ్యంగా ముస్లింల పట్ల బిజెపి ప్రభుత్వ విధానంలోని అంతర్గత అసమానతలు, బాహ్య వైరుధ్యాలను ఇది బయటపెట్టింది. పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదాన్ని అంతర్జాతీయ స్థాయిలో బహిర్గతం చేయడానికి, మోడీ ప్రభుత్వం ఉగ్రవాదంపై భారతదేశం ప్రకటించిన జీరో-టాలరెన్స్ విధానంపై అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించే లక్ష్యంతో ఏడు అఖిలపక్ష ప్రతినిధులను ఏర్పాటు […]
Read more

బెదిరింపు కేసులో దోషిగా తేలిన రాజస్థాన్ ఎమ్మెల్యే…సభ్యత్వాన్ని రద్దు చేసిన అసెంబ్లీ స్పీకర్‌!

జైపూర్ : సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్‌పై (SDM) 2005లో తుపాకీతో బెదిరించిన కేసులో దోషిగా తేలిన తర్వాత రాజస్థాన్ అసెంబ్లీ బీజేపీ ఎమ్మెల్యే కన్వర్ లాల్ మీనాను అనర్హుడిగా ప్రకటించింది. అతని అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దును ధృవీకరిస్తూ అసెంబ్లీ అధికారిక నోటిఫికేషన్ జారీ చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 191(1)(E) మరియు ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 8(3) ప్రకారం అసెంబ్లీ స్పీకర్ వాసుదేవ్ దేవ్నాని అంటా ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేశారు. మీనా సభ్యత్వం రద్దు చేయడం ఆయన […]
Read more

కేరళ ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త హత్య కేసులో పాపులర్ ఫ్రంట్ నాయకుడికి సుప్రీంకోర్టు బెయిల్!

న్యూఢిల్లీ : నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా మాజీ సెక్రటరీ జనరల్ అబ్దుల్ సత్తార్‌కు సుప్రీంకోర్టు నుండి బెయిల్ లభించింది. పాలక్కాడ్‌లో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త శ్రీనివాసన్‌ను హత్య చేయడానికి 2022 కుట్రకు సంబంధించిన కేసులో ఆయనకు బెయిల్‌ దక్కింది. ఒక నిర్దిష్ట భావజాలాన్ని కలిగి ఉన్నందుకు మాత్రమే వ్యక్తులను జైలులో పెట్టలేమని కోర్టు వ్యాఖ్యానించింది. కేరళ హైకోర్టు బెయిల్ నిరాకరణను సవాలు చేస్తూ సత్తార్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను విచారిస్తూ జస్టిస్ అభయ్ […]
Read more
1 24 25 26 27 28 44

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.