Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

ఢిల్లీలో ఘనంగా గణతంత్ర వేడుకలు!

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా 77వ గణతంత్ర వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో జరిగిన పరేడ్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మువ్వన్నెల జెండాను ఆవిష్కరించారు. తదనంతరం భద్రతా బలగాల గౌరవ వందనం స్వీకరించారు. కాగా, రిపబ్లిక్‌ డేను పురస్కరించుకుని… దేశ అభివృద్ధి ప్రస్తానమైన సాంస్కృతిక గొప్పతనం, ఆర్థిక పురోగతి, సైనిక బలాన్ని మన దేశం అద్భుతంగా ప్రదర్శించింది, ఇందులో క్షిపణులు, ఫైటర్ జెట్‌లు, ఆపరేషన్ సిందూర్ సమయంలో ఉపయోగించిన అధునాతన ఆయుధాలు ఉన్నాయి. గణతంత్ర వేడుకలకు ఐరోపా […]
Read more

77 ఏళ్ల గణతంత్రం: ముస్లింల గుండెల్లో భయం.. రాజ్యాంగం నీడలో అన్యాయం!

దేశం 77వ గణతంత్ర దినోత్సవ ముంగిట ఉంది. ఎటు చూసినా త్రివర్ణ పతాకాలు, దేశభక్తి గీతాలు. కానీ, అదే జెండా నీడలో ఒక వర్గం పౌరులు తమ ప్రాణాల కోసం, ఆత్మగౌరవం కోసం విలవిలలాడుతున్నారు. గడిచిన రెండు వారాల రక్తచరిత్రను చూస్తే.. మనం జరుపుకునే ఈ వేడుకలు బాధితుల గాయాలపై ఉప్పు చల్లినట్లు అనిపించడం లేదా?రక్తసిక్తమైన వీధులు – మౌనమైన చట్టంమొరాదాబాద్‌లో ఒక యువకుడిని సజీవ దహనం చేసినా, జార్ఖండ్‌లో గుంపులుగా చేరి మనిషిని వేటాడి చంపినా.. […]
Read more

ఓవైసీ రాజకీయాలు…బీజేపీ దీర్ఘకాలిక ప్రయోజనాలకు ఇంధనం!

ఖమర్ క్రాంతి న్యూఢిల్లీ: సంఘ్-బీజేపీ మాటే ‘ఓవైసీ అజెండా’ అని ఒక నానుడి. వాస్తవానికి ఇదొక లోతైన రాజకీయ వ్యూహం. దీన్ని అర్థం చేసుకోకుండా, ఈ రోజు దేశంలో పెరుగుతున్న అశాంతిని అర్థం చేసుకోవడం అసాధ్యం. భారతదేశంలోని చాలా ప్రాంతాలలో… ముఖ్యంగా ముస్లిం యువతలో… కోపం, అవమానం, భయం, అదే సమయంలో ఒక నిర్దిష్ట నాయకుడిపై, ఒక నిర్దిష్ట పార్టీపై భావోద్వేగ అనుబంధం కనిపిస్తుంది. కానీ ఈ అనుబంధం రాత్రికి రాత్రే పుట్టుకొచ్చింది కాదు. ఇది ఓ […]
Read more

జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌…ఐదుగురు మహిళలు సహా 17 మంది మావోయిస్టులు మృతి!

చైబాసా, జార్ఖండ్: సీపీఐ (మావోయిస్ట్) కేంద్ర కమిటీకి చెందిన ఉన్నత స్థాయి సభ్యుడు పతిరామ్ మాఝీ అలియాస్ అనల్‌దా నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌లో ఎన్‌కౌంటర్‌ అయ్యాడు. కాగా, సారండ అడవిలో 209 కోబ్రా, చైబాసా జిల్లా పోలీసులు, జార్ఖండ్ జాగ్వార్ సంయుక్తంగా మేఘాబురు ఆపరేషన్‌ను ప్రారంభించాయి. ఈక్రమంలో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో మొత్తం 17 మంది మావోస్టులు మృతి చెందారని ఆపరేషన్‌ ఐజీ మైఖేల్ రాజ్‌ వెల్లడించారు. అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారనే […]
Read more

బీజేపీ ‘డబుల్ ఇంజిన్’ తమిళనాడులో నడవదు…సీఎం స్టాలిన్‌!

చెన్నై: ప్రధాని మోదీ ‘డబుల్ ఇంజిన్’ వ్యాఖ్యలపై సీఎం స్ఠాలిన్‌ విరుచుకుపడ్డారు. అది తమిళనాడులో నడవదని ఆయన అన్నారు. మధురాంతకంలోని శివారు ప్రాంతంలో జరిగిన ఎన్డీఏ రాజకీయ సభలో ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలపై సీఎం స్టాలిన్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ డబుల్ ఇంజిన్ సర్కార్ నినాదాన్ని “డమ్మీ ఇంజిన్” అని ఎద్దేవా చేశారు. ఈ మేరకు స్టాలిన్ ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘డబుల్ ఇంజిన్’ ప్రవేశించని తమిళనాడు, కేరళ, తెలంగాణ, కర్ణాటక, పశ్చిమ […]
Read more

న్యూఢిల్లీ ప్రపంచ పుస్తక ప్రదర్శన…సాహిత్య ఉత్సవమా లేక భావజాల ప్రదర్శనా?!

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని భారత్ మండపంలో జరిగిన న్యూఢిల్లీ ప్రపంచ పుస్తక ప్రదర్శన (NDWBF 2026) ఘనంగా ముగిసిన సంగతి తెలిసిందే. నేషనల్ బుక్ ట్రస్ట్ నిర్వహించిన ఈ తొమ్మిది రోజుల ఉత్సవం, గతేడాదితో పోలిస్తే సందర్శకుల సంఖ్యలో 20% పెరుగుదలను, పుస్తకాల అమ్మకాల్లో 30% వృద్ధిని సాధించిందని ప్రకటించింది. అయితే వైవిధ్యం, స్వేచ్ఛా ఆలోచనలనే లక్ష్యంగా యునైటెడ్ స్టేట్స్‌ సహా విదేశాల్లో జరిగే అనేక అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనలకు భిన్నంగా… న్యూఢిల్లీ పుస్తకాల పండుగ జరగడం […]
Read more

జనాభా లెక్కల కోసం 33 ప్రశ్నలను సిద్ధం చేసిన ప్రభుత్వం!

న్యూఢిల్లీ: జనాభా లెక్కల మొదటి దశలో భాగంగా, ఏప్రిల్ 1 నుండి ప్రారంభమయ్యే ఇంటి వివరాల సేకరణ, గృహ గణన సమయంలో పౌరులను అడగబోయే 33 ప్రశ్నలను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. ఈమేరకు నిన్న ప్రచురించిన గెజిట్ నోటిఫికేషన్‌లో… ఇంటి నేల, పైకప్పుకు ఉపయోగించిన పదార్థం, అక్కడ నివసిస్తున్న వివాహిత జంటల సంఖ్య, ఇంటి యజమాని లింగం, వినియోగించే ధాన్యం రకం, ప్రాథమిక, ఆధునిక అవసరాలకు ప్రాప్యత, యాజమాన్యంలోని వాహనాల రకాలు వంటి ప్రశ్నలను జాబితా […]
Read more

అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని రద్దు చేసేందుకు రాజ్యాంగ సవరణను కోరుతున్న ఎంకే స్టాలిన్!

చెన్నై: రాష్ట్ర శాసనసభ మొదటి సమావేశాల ప్రారంభంలో గవర్నర్ ప్రసంగం చేసే పద్ధతిని రద్దు చేస్తూ… రాజ్యాంగ సవరణను ప్రతిపాదించడానికి దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలతో డిఎంకె సంప్రదింపులు జరుపుతుందని తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ అన్నారు. తమిళనాడు, కేరళ, కర్ణాటకలలో గవర్నర్లు, ఎన్నికైన ప్రభుత్వాల మధ్య ఇటీవల జరిగిన వరుస ఘర్షణలపై స్పందిస్తూ… గవర్నర్లు “పార్టీ ఏజెంట్లు”గా వ్యవహరిస్తున్నారని, ఉద్దేశపూర్వకంగా సమాఖ్య సూత్రాలను దెబ్బతీస్తున్నారని సిఎం స్టాలిన్ ఆరోపించారు. “ముందు తమిళనాడు, తర్వాత కేరళ, ఇప్పుడు […]
Read more

కాషాయ జెండా ఊపిన కర్ణాటక అధికారిపై చర్యలకు కాంగ్రెస్ డిమాండ్!

ఉడుపి: పర్యాయ ఊరేగింపు సందర్భంగా ఉడుపి డిప్యూటీ కమిషనర్ టి కె స్వరూప కాషాయ జెండా పట్టుకున్నారనే ఆరోపణలపై వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ… తాను ఆ కార్యక్రమంలో తన అధికారిక హోదాలో పాల్గొన్నానని, తన వైపు నుండి ఎలాంటి రాజకీయ ప్రేరేపిత భాగస్వామ్యం లేదని అన్నారు. జనవరి 18న పర్యాయ ఊరేగింపును ప్రారంభించేటప్పుడు కాషాయ జెండా పట్టుకున్నందుకు స్వరూపపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా కాంగ్రెస్ కమిటీ లీగల్ అండ్ హ్యూమన్ రైట్స్ […]
Read more

కేంద్ర బడ్జెట్… జమాతే ఇస్లామీ హింద్ సిఫార్సులు!

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ అంటే అంకెల గారడీ కాదు, అది ప్రభుత్వ ఆదాయ, వ్యయాలను తెలిపే ఆర్థిక ప్రణాళిక. ఇది దేశ ఆర్థిక వృద్ధి, సంక్షేమం, వనరుల కేటాయింపు, ఆదాయ పన్నుల వంటి కీలక విధానాలను ఈ బడ్జెట్‌ నిర్దేశిస్తుంది. కాగా, ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌ను ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రవేశ పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో జమాతే-ఇ-ఇస్లామీ హింద్ కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. దేశంలో ఉపాధిని పెంచాలని, సంపద పంపిణీని మెరుగుపరచి, డిమాండ్-దిశగా […]
Read more
1 23 24 25 26 27 87

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.