Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

నేపాల్ విద్యార్థుల తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పిన కిట్ వ్యవస్థాపకుడు అచ్యుత సామంత!

భువనేశ్వర్: నగరంలోని కిట్ డీమ్డ్ యూనివర్సిటీలో నేపాల్‌కు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి, ఆత్మహత్య, తదనంతరం పొరుగు దేశ విద్యార్థులపై దాడులు జరిగిన కొన్ని రోజుల తర్వాత, కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (KIIT) వ్యవస్థాపకుడు అచ్యుత సామంత గ నేపాల్ విద్యార్థుల తల్లిదండ్రులకు క్షమాపణలు చెప్పాడు. క్యాంపస్‌ను ఖాళీ చేసిన వారందరూ తిరిగి రావాలని కోరాడు. ఈ సంఘటనపై సామంత చేసిన మొదటి బహిరంగ ప్రకటన వీడియోను KIIT X ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ చేశారు, ఈ […]
Read more

మోడీ ప్రభుత్వం జాతీయ భద్రతను ప్రమాదంలో పడేస్తోంది…ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే!

న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో చైనా 90 కొత్త గ్రామాలను నిర్మిస్తోందని వచ్చిన నివేదికలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మోడీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ పరిణామం భారతదేశ జాతీయ భద్రత, ప్రాదేశిక సమగ్రతను… సార్వభౌమత్వాన్ని ప్రమాదంలో పడేస్తోందని ఆరోపించారు. ఈ మేరకు ఆయన గురువారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘ఎన్డీఏ ప్రభుత్వం పీఆర్ స్టంట్స్, తప్పడు ప్రకటనలకే ప్రాధాన్యతనిస్తోంది. నేషనల్ సెక్యురిటీని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు అని తెలిపారు. చైనాకు రెడ్ […]
Read more

స్థానిక ఎన్నికల దృష్ట్యా మహారాష్ట్రలో లవ్‌ జిహాద్‌ నియంత్రణకు చట్టం!

ముంబయి: హిందుత్వ భావజాలానికి అనుగుణంగా, మహారాష్ట్రలోని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని మహాయుతి-ఎన్డిఎ ప్రభుత్వం లవ్ జిహాద్‌పై చట్టాన్ని అమలు చేయడానికి కసరత్తును ప్రారంభించింది. బిజెపి-శివసేన-ఎన్‌సిపి కూటమికి నాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కు, 288 మంది సభ్యుల మహారాష్ట్ర శాసనసభలో తన ప్రభుత్వానికి ఉన్న సంపూర్ణ మెజారిటీ కారణంగా, అటువంటి చట్టాన్ని ఆమోదించడం ఒక సవాలుగా ఉండకపోవచ్చు. గత వారం, రాష్ట్ర ప్రభుత్వం లవ్ జిహాద్ పై చట్టాన్ని రూపొందించడంలో చట్టపరమైన, సాంకేతిక అంశాలను పరిశీలించడానికి […]
Read more

ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా… సీఎం పదవిని చేపట్టిన 4వ మహిళ!

న్యూఢిల్లీ: ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రేఖా గుప్తా ఎన్నికయ్యారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం తర్వాత ఈ ప్రకటన వెలువడింది, ఎంపిక ప్రక్రియకు రవిశంకర్ ప్రసాద్, ఓం ప్రకాష్ ధంకర్‌లను పరిశీలకులుగా నియమించారు. కొత్తగా ఎన్నికైన 48 మంది బీజేపీ శాసనసభ్యులు తమ నాయకుడిని ఎన్నుకోవడానికి సమావేశమయ్యారు, ఆమె ఢిల్లీ సీఎంగా ఈ రోజు బాధ్యతలు స్వీకరిస్తారు. కొత్త బీజేపీ ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవం నేడు రాంలీలా మైదానంలో జరగనుంది. ఈ కార్యక్రమానికి […]
Read more

పిల్లలపై నిఘా నిమిత్తం డిటెక్టివ్‌లను నియమించుకుంటున్న పేరెంట్స్!

బెంగళూరు: ప్రస్తుత డిజిటల్‌ యుగంలో టీనేజ్ పిల్లలు చెడు వైపు త్వరగా ఆకర్షితులవుతున్నారు. చిన్న విషయాలకే తల్లిదండ్రులపై తిరుగుబాటు చేస్తున్నారు. పేరెంట్స్‌ తమ బిడ్డకు మంచి పెంపకం ఇవ్వడానికి ప్రయత్నించినప్పటికీ, అందరు పిల్లలు బాధ్యతాయుతమైన టీనేజర్లుగా ఎదగరు. తోటివారి ఒత్తిడి, గృహ సమస్యలు, విచ్ఛిన్నమైన కుటుంబాలు, హార్మోన్ల మార్పుల కారణంగా టీనేజర్లు కొన్నిసార్లు తప్పుదారి పడుతున్నారు.. అలాంటి టీనేజర్లు… తల్లిదండ్రులు, తోబుట్టువులు, ఉపాధ్యాయులతో కూడా కమ్యూనికేషన్ ఉండదు. వారు తరచుగా చదువులను నిర్లక్ష్యం చేస్తారు. హింసాత్మకంగా మారుతున్నారు. […]
Read more

బీహార్‌లోని ఓ మసీదు సమీపంలో రెచ్చగొట్టే నినాదాలు చేసిన ఏబీవీపీ…చెలరేగిన హింస!

జముయ్ : బీహార్‌లోని జముయ్ జిల్లాలోని ఓ మసీదు సమీపంలో ABVP సభ్యులు రెచ్చగొట్టే నినాదాలు చేయడంతో రెండు వర్గాల మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగాయి, దీనితో అధికారులు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఝఝా ప్రాంతంలో మతపరమైన ఊరేగింపు సందర్భంగా ఈ సంఘటన జరిగింది. రాళ్ల దాడి కారణంగా కొంతమందికి గాయాలు అయ్యాయి. జముయ్ జిల్లా మేజిస్ట్రేట్ అభిలాష శర్మ ప్రకారం, ఈ హింసలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, […]
Read more

తాగునీటి వాడకంపై ఆంక్షలు విధించిన బెంగళూరు జలమండలి!

బెంగళూరు: ఉష్ణోగ్రతలు పెరగడం, భూగర్భ జలాలు తగ్గడం వంటి కారణాల వల్ల అనవసర కార్యకలాపాలకు తాగునీటిని వినియోగించడంపై బెంగళూరు నీటి సరఫరా, మురుగునీటి పారుదల బోర్డు (BWSSB) ఆంక్షలు విధించింది. ఈ ఆదేశాన్ని ఉల్లంఘించిన వారికి రూ. 5,000 జరిమానా విధిస్తామని తెలిపింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా జారీ చేసిన ఉత్తర్వు ప్రకారం, బెంగళూరు నీటి సరఫరా మరియు మురుగునీటి పారుదల చట్టం 1964లోని సెక్షన్లు 33 మరియు 34 ప్రకారం, వాహనాలను శుభ్రం చేయడానికి, తోటపని […]
Read more

కొత్త సీఈసీగా జ్ఞానేష్ కుమార్… రాహుల్ గాంధీ అభ్యంతరం!

న్యూఢిల్లీ: భారత కొత్త ఎన్నికల కమిషనర్‌గా జ్ఞానేష్ కుమార్ ఎంపికయ్యారు. కాగా , ఈ నియామకంపై ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రస్తుత సీఈసీ రాజీవ్ కుమార్ పదవీకాలం నేటితో ముగుస్తుండటంతో తదుపరి సీఈసీ ఎన్నికపై నిన్న ప్రధాని నివాసంలో ప్యానెల్ కమిటీ సమావేశం అయింది. ఈ ప్యానెల్ లో ప్రధాని మోడీతో పాటు, లోకసభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘవాల్ సభ్యులుగా ఉన్నారు. ఎంపిక చేసిన సభ్యుల […]
Read more

హాజీ మలాంగ్ దర్గా వద్ద జై శ్రీ రామ్ నినాదాలు… నెట్‌లో వైరల్‌ అయిన వీడియో! 

ముంబయి: రైట్‌వింగ్‌ హిందూ సంస్థ సభ్యులు మహారాష్ట్రలోని హాజీ మలాంగ్ దర్గాలో కలకలం రేపారు. వార్షిక ఉర్సు పండుగ సందర్భంగా వీరంతా దర్గాలోకి దూసుకెళ్లి కాషాయ జెండాలు ఊపుతూ ‘జై శ్రీరామ్’, ‘ఏక్ హి నారా, ఏక్ హి నామ్, జై శ్రీ రామ్’ వంటి నినాదాలు చేస్తూ కనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. కాగా, హిందూ సంస్థ సభ్యలు దర్గాలో హంగామా చేస్తున్నప్పటికీ అక్కడే ఉన్న పోలీసు అధికారి మాత్రం జోక్యం […]
Read more

ఢిల్లీలో స్పల్ప భూకంపం… ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించిన ప్రధాని!

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించింది. 4.0 తీవ్రతతో భూకంపం వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. భూకంపం వల్ల సంభవించిన బలమైన ప్రకంపనలు ఢిల్లీ, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లోని అనేక ఎత్తైన భవనాలలోని ప్రజలు బయటకు పరుగెత్తారు. అయితే ఎటువంటి నష్టం లేదా గాయాలు సంభవించినట్లు తక్షణ నివేదికలు లేవు. కాగా, భూకంపం సంభవించిన ప్రదేశం ఐదు కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉందని […]
Read more
1 41 42 43 44

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.