Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: జాతీయ

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

“బీజేపీ స్వతంత్రంగా పనిచేస్తుంది, ఆర్‌ఎస్‌ఎస్ చేతిలో రిమోట్ లేదు”…మోహన్ భగవత్!

భోపాల్: భారతీయ జనతా పార్టీ (బీజేపీ), విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పి), విద్యా భారతి వంటి సంస్థలు స్వతంత్రంగా పనిచేస్తాయని, వాటిని సంఘ్ నియంత్రించదని ఆర్‌ఎస్‌ఎస్ అధిపతి మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. “బీజేపీ లేదా వీహెచ్‌పి ద్వారా ఆర్‌ఎస్‌ఎస్‌ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించవద్దు; అవి స్వతంత్రంగా పనిచేస్తాయి. సంఘ్ ద్వారా రిమోట్ కంట్రోల్ చేయరు” అని భగవత్ అన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌కు అనుబంధ సంస్థల ద్వారా దానిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవారు ప్రాథమిక పొరపాటు చేస్తున్నారని అన్నారు. […]
Read more

బెంగళూరులో కూల్చివేతలు…పర్యవేక్షణ కమిషన్ల మౌనం!

బెంగళూరు: కర్ణాటక రాజాధాని బెంగళూరులోని ‘కోగిలు లేఅవుట్‌’లో ఇటీవల జరిగిన పెద్ద ఎత్తున కూల్చివేత కార్యక్రమం బృహత్ బెంగళూరు మహానగర పాలికె (BBMP) నిర్వహణ, రాష్ట్ర ఆదేశిత పర్యవేక్షణ సంస్థల మౌనంపై విమర్శల తుఫానును రేకెత్తించింది. ఈ ఆకస్మిక ఆపరేషన్‌లో 400కు పైగా ఇళ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. వేలాది మంది – ప్రధానంగా అణగారిన మైనారిటీ వర్గాల ప్రజలు తీవ్రమైన చలి కాలంలో ఆశ్రయం కోల్పోయారు. ఈ సంఘటన సాధారణ పరిపాలనా “ఆక్రమణ తొలగింపు” నుండి తీవ్రమైన […]
Read more

మణిపూర్‌లో 27 బాంబులను సురక్షితంగా నిర్వీర్యం చేసిన భద్రతా బలగాలు!

ఇంఫాల్: రెండేళ్లుగా జాతి హింసతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో బాంబులు కలకలం సృష్టించాయి. ఈమేరకు ఇంఫాల్ తూర్పు జిల్లాలో భద్రతా బలగాలు 27 బాంబులను స్వాధీనం చేసుకుని, వాటిని నిర్వీర్యం చేశాయని పోలీసులు తెలిపారు. మణిపూర్‌లో రెండేళ్ల క్రితం జాతుల మధ్య చెలరేగిన హింస తర్వాత, రాష్ట్రంలో శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకు భద్రతా దళాలు “ఆపరేషన్ ఆల్-అవుట్” పేరుతో నిరంతరం గాలింపు చర్యలు చేపడుతున్నాయి. రాష్ట్రంలోని సమస్యాత్మక ప్రాంతాలను భద్రతా దళాలు జల్లెడ పడుతున్నాయి. ఈ ఆపరేషన్లలో భాగంగానే, ఉగ్రవాదులు, […]
Read more

ఈవీఎంలను విశ్వసిస్తున్న కర్ణాటక ప్రజలు…నిగ్గుతేల్చిన సర్వే!

న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ “ఓట్‌చోరీ” ఆరోపణల నేపథ్యంలో… కర్ణాటక ప్రజలు ఈవీఎంలకే జై కొట్టారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు ఖచ్చితమైన ఫలితాలను అందిస్తాయని కర్ణాటక ప్రభుత్వ సంస్థ నిర్వహించిన ఓ సర్వేలో నిగ్గు తేలింది. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరుగుతాయని, రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్‌పై బీజేపీకి పట్టు సాధించడానికి దోహదపడింది. రాహుల్ గాంధీ “ఓట్ల దొంగతనం” ఆరోపణల్లో కర్ణాటకకు చెందిన కలబుర్గి ప్రముఖంగా కనిపించిన నేపథ్యంలో ఈ అధ్యయనం రావడం బీజేపీకి మరింత ఆనందాన్నిచ్చింది. “ఈ సర్వే […]
Read more

ఘజియాబాద్‌లో బహిరంగంగా కత్తుల పంపిణీ…యూపీలో శాంతిభద్రతలపై ప్రశ్నలు!

లక్నో: ఘజియాబాద్‌లో ఒక హిందూ మితవాద సంస్థ బహిరంగంగా కత్తులు పంపిణీ చేయడం ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. రాష్ట్రంలో పటిష్టమైన శాంతిభద్రతలను నిర్వహిస్తున్నామన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనలను సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ ప్రశ్నిస్తున్నాయి. సోమవారం, హిందూ రక్షా దళ్ అనే హిందూ మితవాద సంస్థకు చెందిన సభ్యులు ఘజియాబాద్‌లోని షాలిమార్ గార్డెన్ ప్రాంతంలో ఒక స్టాల్ ఏర్పాటు చేసి, కత్తులు, గొడ్డళ్లు,ఇతర పదునైన ఆయుధాలను బహిరంగంగా ప్రదర్శించారు. నివేదికల ప్రకారం… నిర్వాహకులు ఈ ఆయుధాలను స్థానిక […]
Read more

కేసీఆర్‌కు ‘ఉరిశిక్ష’ వేసినా తప్పులేదు…సీఎం రేవంత్‌ రెడ్డి!

హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కన్నా… గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు “బారీ అన్యాయం” చేసిందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. నదీ జలాల వినియోగంలో జరిగిన నష్టానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఆయన మేనల్లుడు టి హరీష్ రావును ఉరితీసినా తప్పులేదని సీఎంఅన్నారు. కాగా, సీఎం రేవంత్ రెడ్డి తమ ఇద్దరు నాయకుల మరణాన్ని కోరుకుంటున్నారని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆయనపై ఎదురుదాడికి దిగింది. నదీ జలాల సమస్యలపై సాగునీటి శాఖ మంత్రి ఎన్ […]
Read more

భారతీయ ముస్లింలకు’2025′ ఎలా గడిచింది?

ముహమ్మద్ ముజాహిద్ , 96406 22076 కొన్ని గంటలే క్రితమే ముగిసిన”2025 సంవత్సరం భారతీయ ముస్లింలకు కేవలం కాలచక్రంలో మరో ఏడాదిగా మిగిలిపోలేదు; అది వారి అస్తిత్వానికి, పౌర హక్కులకు ఎదురైన ఒక అగ్నిపరీక్ష. వ్యవస్థీకృత ద్వేషం, మీడియా పక్షపాతం, బుల్డోజర్ రాజకీయాల నీడలో సామాన్య ముస్లిం పౌరుడు తన సొంత గడ్డపైనే పరాయివాడిగా మారాల్సి రావడం దేశ ప్రజాస్వామ్యానికే ఒక మాయని మచ్చ. రాజ్యాంగబద్ధమైన రక్షణలు కాగితాలకే పరిమితమై, విద్వేషం వీధుల్లో రాజ్యమేలుతుంటే, ఈ అభద్రతా […]
Read more

ఫిబ్రవరి ఒకటి నుండి పొగాకుపై అదనపు ఎక్సైజ్ సుంకం!

న్యూఢిల్లీ: కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ పొగాకు ఉత్పత్తులపై అదనపు ఎక్సైజ్ సుంకం, పాన్ మసాలాపై కొత్త సెస్ విధించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈమేరకు ఫిబ్రవరి ఒకటవ తేదీనుంచి ఈ నిర్ణయం అమలు కానుంది. పొగాకు, పాన్ మసాలాపై విధించే ఈ కొత్త పన్నులు జీఎస్టీ రేటుకు అదనంగా ఉంటాయి. ప్రస్తుతం ఇటువంటి హానికరమైన వస్తువులపై విధిస్తున్న పరిహార సెస్ స్థానంలోకి వస్తాయి. ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం, ఫిబ్రవరి 1 నుండి పాన్ మసాలా, సిగరెట్లు, పొగాకు […]
Read more

ఉత్తరాఖండ్‌లో రెండు రైళ్లు ఢీ… 88 మందికి గాయాలు!

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌ రాష్ట్రం చమోలీ జిల్లాలోని విష్ణుగడ్-పిపల్‌కోటి జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగంలో ఒక లోకో రైలు మరో రైలును ఢీకొన్న ఘటనలో సుమారు 88 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. మంగళవారం బాగా పొద్దుపోయాక జరిగిన ఈ ప్రమాద సమయంలో రైలులో కార్మికులు, అధికారులు సహా మొత్తం 109 మంది ఉన్నారని చమోలీ జిల్లా మేజిస్ట్రేట్ గౌరవ్ కుమార్ తెలిపారు. వీరిలో 70 మంది గాయపడిన కార్మికులు గోపేశ్వర్ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందారు. రైలులోని వారిని […]
Read more

త్రిపుర విద్యార్థి హత్యపై ‘సిట్’ ఏర్పాటు!

అగర్తల: త్రిపుర విద్యార్థి అంజెల్ చక్మా ఉత్తరాఖండ్‌ రాజధానిలో హత్యకు గురికావడంపై దర్యాప్తు చేయడానికి డెహ్రాడూన్ పోలీసులు సిట్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో జాతి వివక్షకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లభించలేదని వారు తెలిపారు. ఒక మద్యం దుకాణానికి గుంపుగా వచ్చిన వారి మధ్య జరుగుతున్న ‘పరిహాసాలను’ ఆ యువకుడు అభ్యంతరం చెప్పడంతో వాగ్వాదం చెలరేగిందని, ఆ తర్వాత అతనిపై దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. ఈమేరకు డెహ్రాడూన్ ఎస్ఎస్‌పి అజయ్ సింగ్ […]
Read more
1 5 6 7 8 9 65

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.