Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: తెలంగాణ/ఆంధ్ర

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

స్థానిక ఎన్నికలను నిలిపివేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్‌!

హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడంపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. దీంతో ఇటీవల విడుదల చేసిన స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌ను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిలిపివేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది. కాగా, 42% బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించాక… కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు వారాల సమయం ఇచ్చారు. ఆ తరువాత 2 వారాల్లో రిప్లయ్ కౌంటరు […]
Read more

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధంగా ఉండండి…వనపర్తి జిల్లా కలెక్టర్!

వనపర్తి : ఎంపీటీసీ-జెడ్పీటీసీ ఎన్నికల మొదటి దశకు నామినేషన్ల స్వీకరణపై సంబంధిత రిటర్నింగ్ అధికారులతో వనపర్తి జిల్లా కలెక్టర్‌ సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆదర్శ్ సురభ్ మాట్లాడుతూ.. గురువారం ఉదయం 10 గంటలలోపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల మొదటి దశ ఎన్నికల నోటిఫికేషన్‌ను ప్రచురించాలని ఆర్‌ఓలను ఆదేశించారు. నామినేషన్లు దాఖలు చేసేటప్పుడు అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను జాగ్రత్తగా పరిశీలించాలని ఆయన సూచించారు. నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చే అభ్యర్థితో […]
Read more

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక…కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్‌!

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్‌ పార్టీ తన అభ్యర్థిగా నవీన్ యాదవ్‌ను ప్రకటించింది. దీనితో టికెట్‌ ఎవరికోనన్న వారాల తరబడి ఊహాగానాలకు తెరపడింది. యాదవ్ కాకుండా, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి అధికార పార్టీ నుండి బలమైన పోటీదారులలో ఒకరు. అధికార పార్టీ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి (BRS) నుండి సీటును గెలుచుకోవాలని చూస్తున్నారు. మరోవైపు, జూబ్లీహిల్స్‌కు చెందిన దివంగత BRS మాజీ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి […]
Read more

ఏపీ, తెలంగాణలో పప్పు కుంభకోణం…వ్యాపార సంస్థలపై ఐటీ దాడులు!

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రూ.300 కోట్ల పప్పు వ్యాపారం కేసుకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ నిన్న రెండు తెలుగు రాష్ట్రాల్లోని 25 ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం సహా ఇతర నగరాల్లో పెద్ద ఎత్తున సోదాలు చేపట్టింది. ప్రజా పంపిణీ వ్యవస్థ (పిడిఎస్) కింద సకాలంలో చెల్లింపు అందినప్పటికీ వ్యాపారులు పప్పును సరఫరా చేయడంలో విఫలమయ్యారని అధికారులు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో పలు వ్యాపార సంస్థలు భారీగా నగదు […]
Read more

యూరియా కోసం భారీ వర్షంలోనూ రైతుల పడిగాపులు!

నాగార్జునసాగర్‌: ఆరుగాలం కష్టించే రైతుకు యూరియా కోసం ఎదురీదక తప్పడం లేదు. నాగార్జున సాగర్‌ నియోజకవర్గంలో నిన్న యూరియా పంపిణీ చేస్తారనే వార్త తెలియగానే ఆదివారం రాత్రి వందలాది మంది రైతులు తిరుమలగిరి సబ్ మార్కెట్ యార్డ్ వద్ద గుమిగూడారు. గత పది రోజులుగా పంపిణీ జరగకపోవడంతో, రైతులు రాత్రిపూట యార్డ్‌లో ఆశగా బస చేశారు. మరోవంక అర్ధరాత్రి ఆ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. దీంతో కొంతమంది రైతులు సమీపంలోని పోలీస్ స్టేషన్ లోపల ఆశ్రయం […]
Read more

స్థానిక ఎన్నికల్లో 42 శాతం బీసీ కోటా న్యాయవాదులతో భట్టి, పొన్నం చర్చ!

హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ కోటాను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ నేడు సుప్రీంకోర్టులో విచారణకు రానుండగా, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రుల బృందం న్యూఢిల్లీకి చేరుకుంది. ఢిల్లీకి వెళ్లే ముందు, డిప్యూటీ సీఎం, బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమై స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన […]
Read more

హైదరాబాద్‌లో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమి…హైడ్రా కూల్చివేతలతో ఉద్రిక్తత!

హైదరాబాద్: హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ సమీపంలోని కొండాపూర్‌లో ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించిన తాత్కాలిక షెడ్ల కూల్చివేతను హైడ్రా బృందాలు చేపట్టాయి. దీంతో ఆ ప్రాంతంలో ఈ ఉదయం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసుల సహాయంతో హైడ్రా బృందాలు హైదరాబాద్‌లో ఉద్రిక్త వాతావరణంలో కూల్చివేత కార్యక్రమాన్ని కొనసాగించాయి. కొండాపూర్ RTA కార్యాలయానికి దగ్గరగా ఉన్న ప్రదేశానికి వెళ్లే రహదారిపై పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ భూమిని కొంతమంది కబ్జా చేశారు. ఈ విషయమై హైకోర్టు తీర్పు […]
Read more

హైదరాబాద్‌లో కొత్త ఉస్మానియా హాస్పిటల్ భవనం నిర్మాణం ప్రారంభం!

హైదరాబాద్: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉస్మానియా జనరల్ హాస్పిటల్ (OGH) కొత్త భవనం నిర్మాణ పనులు దసరా పండుగ సందర్భంగా నిన్న ప్రారంభమయ్యాయి. గోషామహల్ స్టేడియం స్థలంలో చేపట్టిన ఈ చారిత్రాత్మక ప్రాజెక్ట్‌ను 12 అంతస్తుల్లో 2వేల పడకలతో అత్యాధునిక వైద్య మౌలిక సదుపాయాలతో నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కాంట్రాక్ట్‌ను మేఘ ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (MEIL) కు అప్పగించారు. కంపెనీ డైరెక్టర్ కె. గోవర్ధన్ రెడ్డి ఆ స్థలంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత […]
Read more

మూసీ నది ప్రాజెక్టుకు ఆసియా అభివృద్ధి బ్యాంకు ప్రోత్సాహం!

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టు కోసం ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ప్రాజెక్టు మొదటి రెండు దశలకు డీపీఆర్‌ తయారీతో పాటు భూసేకరణకు త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. మూసీ నది సుందరీకరణ ప్రాజెక్టుకు రుణం మంజూరు చేస్తూ ఆసియా అభివృద్ధి బ్యాంకు (ADB) నుండి ఆమోద లేఖ అందిన తర్వాత, అమలు ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. వివరాల ప్రకారం… ప్రాజెక్ట్ మొదటి దశను ఫేజ్ 1A, 1Bగా […]
Read more

కొండలా పేరుకుపోయిన ఫీజు బకాయిలు…కాలేజీలు మూసేస్తామంటూ హెచ్చరిక!

హైదరాబాద్: భారీగా పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై ప్రైవేట్ కాలేజీలు మళ్లీ ఆగ్రహం వ్యక్తం చేశాయి. నిర్దేశించిన గడువులోగా రూ.600 కోట్ల బకాయిలను చెల్లించని దసరా తర్వాత కాలేజీలు తెరిచేది లేదని స్పష్టం చేశాయి. అంతేకాదు ఈ నెల‌ 6 నుంచి తెలంగాణ ఉన్నత విద్యా సంస్థల సంఘాల సమాఖ్య నిరవధిక బంద్‌కు పిలుపు ఇచ్చింది. కాగా, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రైవేట్ కాలేజీలు గత నెల 15న బంద్‌కు […]
Read more
1 2 3 25

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.