Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: తెలంగాణ/ఆంధ్ర

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

ఏప్రిల్‌ 5లోగా రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకోండి..మైనారిటీ యువతను ప్రోత్సహిస్తున్న కమ్యూనిటీ నాయకులు!

హైదరాబాద్‌ : నిరుద్యోగ ముస్లిం యువత వ్యాపారాలు ప్రారంభించడానికి వీలుగా రూ. 4 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించే రాజీవ్ యువ వికాసం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మైనారిటీ యువతను కమ్యూనిటీ నాయకులు ప్రోత్సహిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈ పథకం కింద మైనారిటీల కోసం రూ. 840 కోట్లు కేటాయించింది, జనాభా అంచనాల ఆధారంగా ముస్లిం దరఖాస్తుదారులకు రూ. 751 కోట్లు కేటాయించింది. తెలంగాణ అంతటా దాదాపు 42,000 మంది మైనారిటీ యువత ప్రయోజనం పొందుతారని […]
Read more

డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా తెలంగాణ అసెంబ్లీ తీర్మానం!

హైదరాబాద్: లోక్‌సభ నియోజకవర్గాల డీలిమిటేషన్ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరుపై తెలంగాణ శాసనసభ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించింది. ఈ ప్రక్రియలో పారదర్శకతను కొనసాగించాలని, ఏవైనా మార్పులను ఖరారు చేసే ముందు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలను సంప్రదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ అసెంబ్లీ తీర్మానం ఆమోదించింది. డీలిమిటేషన్‌పై కేంద్ర ప్రభు త్వం రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోకపోవడాన్ని అసెంబ్లీ తీవ్రంగా ఖండిస్తోందని సిఎం రేవంత్‌రెడ్డి అన్నారు. […]
Read more

తీవ్ర వాదోపవాదాల మధ్య ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం…నిరవధిక వాయిదా!

హైదరాబాద్: బడ్జెట్‌ సమావేశాల చివరిరోజున తెలంగాణ శాసనసభ నిన్న అప్రాప్రియేషన్ బిల్లు (ద్రవ్య వినిమయ బిల్లు)ను ఆమోదించింది. స్పీకర్ జి. ప్రసాద్ కుమార్ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను అప్రాప్రియేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని ఆదేశించారు, ఈ సందర్భంగా తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. ఆ తరువాత, 11 రోజుల పాటు సమావేశమైన సభ నిరవధికంగా వాయిదా పడింది. బడ్జెట్ సమావేశాల చర్చలో ఎక్కువ భాగం రాష్ట్ర రుణం చుట్టూనే తిరిగింది. కేటీఆర్, కాంగ్రెస్ మధ్య తీవ్ర వాగ్వాదం, […]
Read more

తెలంగాణలో మిస్‌వరల్డ్‌ ఈవెంట్‌…రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించిన కేటీఆర్‌!

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఓవైపు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే… ఆ సమస్యను పరిష్కరించకుండా అందాల పోటీలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ… రైతులు సాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నప్పుడు రాబోయే మిస్ వరల్డ్ పోటీలకు రూ. 55 కోట్లు ఖర్చు చేయాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని కేటిఆర్ విమర్శించారు. రాష్ట్రంలో సాగునీరు లేక అప్పుల పాలై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ప్రభుత్వం వారిని పట్టించుకోవడం లేదని, అదే […]
Read more

పీడీ చట్టం కింద తన అరెస్టుకు ‘కొంతమంది బీజేపీ నాయకులే’ కారణం…ఆరోపించిన రాజా సింగ్!

హైదరాబాద్: గత ప్రభుత్వ హయాంలో ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) చట్టం కింద తనను జైలులో పెట్టడంలో కొంతమంది బీజేపీ నాయకుల పాత్ర ఉందని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆరోపించారు. ఈ విషయంలో బీజేపీ నాయకుల ప్రమేయం గురించి ఒక సీనియర్ పోలీసు అధికారి తనకు తెలియజేశారని, అది తనను తీవ్రంగా కలచివేస్తుందని రాజా సింగ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జైలు శిక్ష సమయంలో తన పార్టీ నాయకుల నుండి మద్దతు లేకపోవడం పట్ల రాజా […]
Read more

ఎస్‌ఎల్‌బీసీ సొరంగ ప్రమాదం…మరో మృతదేహం లభ్యం!

హైదరాబాద్: నాగర్ కర్నూల్‌లోని SLBC సొరంగంలో చిక్కుకున్న మరో కార్మికుడి మృతదేహాన్ని రెస్క్యూ బృందం కనుగొంది. దీంతో ఫిబ్రవరి 22న సొరంగం కూలిపోయిన తర్వాత ఇప్పటివరకు రెండు మృతదేహాలను శిథిలాల నుండి వెలికితీసినట్టైంది. సొరంగంలోని చివరి 50 మీటర్ల ప్రాంతంలో తవ్వకం జరుపుతున్న కొంతమంది రెస్క్యూ కార్మికులు లోకో ట్రాక్ సమీపం నుండి దుర్వాసన రావడాన్ని గమనించి అధికారులను అప్రమత్తం చేశారు. ముందుగా గుర్తించిన అనుమానిత ప్రాంతాలు డీ1, డీ2 కాకుండా మరోచోట తవ్వకాలు జరుపుతుండగా ఈ […]
Read more

ఎంఎంటీఎస్‌లో లైంగిక వేధింపులు…కదులుతున్న రైలు నుంచి దూకిన యువతి!

హైదరాబాద్‌: లైంగిక వేధింపుల నుంచి తప్పించుకోవడానికి కదులుతున్న రైలు నుంచి దూకిన 23 ఏళ్ల మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. మార్చి 22 సాయంత్రం సికింద్రాబాద్ నుండి మేడ్చల్ కు వెళ్తున్న MMTS రైలులోని మహిళల కోచ్‌లో ఒంటరిగా ప్రయాణిస్తుండగా ఈ సంఘటన జరిగింది. పోలీసులకు ఆమె ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం, ఇద్దరు మహిళా ప్రయాణికులు అల్వాల్ రైల్వే స్టేషన్ లో దిగిపోయాక, రైలులో ఆమె ఒంటరిగా మిగిలారు. కొద్దిసేపటికే, 25 ఏళ్ల వయసున్న గుర్తు తెలియని […]
Read more

డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు ముప్పు…కేటీఆర్!

హైదరాబాద్‌: డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల కలిగే పరిణామాలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన డీలిమిటేషన్ కసరత్తును తీవ్రంగా ఖండించారు. దక్షిణాది రాష్ట్రాల నాయకులు, ముఖ్యమంత్రులు చెన్నైలో నిర్వహించిన డీలిమిటేషన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ…ఈ చర్య దక్షిణాది రాష్ట్రాల భవిష్యత్తుకు ముప్పు అని అభివర్ణించారు. దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని, డీలిమిటేషన్ వల్ల తెలంగాణలో లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్య తగ్గిపోతుందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. […]
Read more

గేట్‌-2025లో రాణించిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు!

హైదరాబాద్‌: దేశంలోని ఐఐటీలు సహా పలు ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్‌-2025) ఫలితాల్లో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు రాణించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు గేట్2025 పరీక్షలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు. ఈ మేరకు ఆ విద్యార్థులను సత్కరించారు. బయోమెడికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన సానియా మహ్రీన్ (AIR-13), భరం ప్రసన్న దేవిక (AIR-44), హిబా […]
Read more

రోజులు గడుస్తున్నా… ఎస్‌ఎల్‌బీసీ రెస్క్యూ ఆపరేషన్‌లో కనిపించని పురోగతి!

హైదరాబాద్: అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినప్పటికీ గత 27 రోజులుగా కొనసాగుతున్న ఎస్‌ఎల్‌బీసీ రెస్క్యూ ఆపరేషన్లలో ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. సొరంగంలో శిథిలాల కింద చిక్కుకున్న ఏడుగురు కార్మికుల మృతదేహాలను వెలికితీయడంలో డజనుకు పైగా రెస్క్యూ బృందాలు గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఇప్పటివరకు, ఒక మృతదేహం మాత్రమే బయటపడింది, సహాయక చర్యలలో ఎటువంటి పురోగతి లేదు. గత 10 రోజులుగా కన్వేయర్ బెల్టులు, లోకో రైళ్లు, రోబోటిక్ సహాయం తీసుకున్నా… సొరంగం లోపల కాంక్రీట్ శిథిలాలను […]
Read more
1 19 20 21 22 23 25

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.