Recent News

Copyright © 2024 Blaze themes. All Right Reserved.

Category: తెలంగాణ/ఆంధ్ర

Lorem Ipsum has been the industry’s standard dummy text ever since the 1500s.

పీడీ చట్టం కింద తన అరెస్టుకు ‘కొంతమంది బీజేపీ నాయకులే’ కారణం…ఆరోపించిన రాజా సింగ్!

హైదరాబాద్: గత ప్రభుత్వ హయాంలో ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) చట్టం కింద తనను జైలులో పెట్టడంలో కొంతమంది బీజేపీ నాయకుల పాత్ర ఉందని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆరోపించారు. ఈ విషయంలో బీజేపీ నాయకుల ప్రమేయం గురించి ఒక సీనియర్ పోలీసు అధికారి తనకు తెలియజేశారని, అది తనను తీవ్రంగా కలచివేస్తుందని రాజా సింగ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జైలు శిక్ష సమయంలో తన పార్టీ నాయకుల నుండి మద్దతు లేకపోవడం పట్ల రాజా […]
Read more

ఎస్‌ఎల్‌బీసీ సొరంగ ప్రమాదం…మరో మృతదేహం లభ్యం!

హైదరాబాద్: నాగర్ కర్నూల్‌లోని SLBC సొరంగంలో చిక్కుకున్న మరో కార్మికుడి మృతదేహాన్ని రెస్క్యూ బృందం కనుగొంది. దీంతో ఫిబ్రవరి 22న సొరంగం కూలిపోయిన తర్వాత ఇప్పటివరకు రెండు మృతదేహాలను శిథిలాల నుండి వెలికితీసినట్టైంది. సొరంగంలోని చివరి 50 మీటర్ల ప్రాంతంలో తవ్వకం జరుపుతున్న కొంతమంది రెస్క్యూ కార్మికులు లోకో ట్రాక్ సమీపం నుండి దుర్వాసన రావడాన్ని గమనించి అధికారులను అప్రమత్తం చేశారు. ముందుగా గుర్తించిన అనుమానిత ప్రాంతాలు డీ1, డీ2 కాకుండా మరోచోట తవ్వకాలు జరుపుతుండగా ఈ […]
Read more

ఎంఎంటీఎస్‌లో లైంగిక వేధింపులు…కదులుతున్న రైలు నుంచి దూకిన యువతి!

హైదరాబాద్‌: లైంగిక వేధింపుల నుంచి తప్పించుకోవడానికి కదులుతున్న రైలు నుంచి దూకిన 23 ఏళ్ల మహిళకు తీవ్ర గాయాలు అయ్యాయి. మార్చి 22 సాయంత్రం సికింద్రాబాద్ నుండి మేడ్చల్ కు వెళ్తున్న MMTS రైలులోని మహిళల కోచ్‌లో ఒంటరిగా ప్రయాణిస్తుండగా ఈ సంఘటన జరిగింది. పోలీసులకు ఆమె ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం, ఇద్దరు మహిళా ప్రయాణికులు అల్వాల్ రైల్వే స్టేషన్ లో దిగిపోయాక, రైలులో ఆమె ఒంటరిగా మిగిలారు. కొద్దిసేపటికే, 25 ఏళ్ల వయసున్న గుర్తు తెలియని […]
Read more

డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు ముప్పు…కేటీఆర్!

హైదరాబాద్‌: డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల కలిగే పరిణామాలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన డీలిమిటేషన్ కసరత్తును తీవ్రంగా ఖండించారు. దక్షిణాది రాష్ట్రాల నాయకులు, ముఖ్యమంత్రులు చెన్నైలో నిర్వహించిన డీలిమిటేషన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ…ఈ చర్య దక్షిణాది రాష్ట్రాల భవిష్యత్తుకు ముప్పు అని అభివర్ణించారు. దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని, డీలిమిటేషన్ వల్ల తెలంగాణలో లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్య తగ్గిపోతుందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. […]
Read more

గేట్‌-2025లో రాణించిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు!

హైదరాబాద్‌: దేశంలోని ఐఐటీలు సహా పలు ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్‌-2025) ఫలితాల్లో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు రాణించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు గేట్2025 పరీక్షలో అత్యుత్తమ ప్రతిభను కనబరిచారు. ఈ మేరకు ఆ విద్యార్థులను సత్కరించారు. బయోమెడికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన సానియా మహ్రీన్ (AIR-13), భరం ప్రసన్న దేవిక (AIR-44), హిబా […]
Read more

రోజులు గడుస్తున్నా… ఎస్‌ఎల్‌బీసీ రెస్క్యూ ఆపరేషన్‌లో కనిపించని పురోగతి!

హైదరాబాద్: అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినప్పటికీ గత 27 రోజులుగా కొనసాగుతున్న ఎస్‌ఎల్‌బీసీ రెస్క్యూ ఆపరేషన్లలో ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. సొరంగంలో శిథిలాల కింద చిక్కుకున్న ఏడుగురు కార్మికుల మృతదేహాలను వెలికితీయడంలో డజనుకు పైగా రెస్క్యూ బృందాలు గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఇప్పటివరకు, ఒక మృతదేహం మాత్రమే బయటపడింది, సహాయక చర్యలలో ఎటువంటి పురోగతి లేదు. గత 10 రోజులుగా కన్వేయర్ బెల్టులు, లోకో రైళ్లు, రోబోటిక్ సహాయం తీసుకున్నా… సొరంగం లోపల కాంక్రీట్ శిథిలాలను […]
Read more

బడ్జెట్‌లో మున్సిపల్‌-పట్టణాభివృద్ధి శాఖకు17,677 కోట్లు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం!

హైదరాబాద్: ఈ ఆర్థిక సంవత్సరం 2025-26 రాష్ట్ర బడ్జెట్‌లో మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖకు తెలంగాణ ప్రభుత్వం రూ.17,677 కోట్ల కేటాయించింది. తెలంగాణ బడ్జెట్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ బడ్జెట్‌లో పట్టణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి, ట్రాఫిక్ రద్దీని సమర్ధవంతంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం H-CITI ప్రణాళికను హైలైట్ చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌లో రూ.7,032 కోట్ల అంచనా పెట్టుబడితో 31 ఫ్లైఓవర్లు, 17 […]
Read more

చారిత్రాత్మక ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించిన తెలంగాణ అసెంబ్లీ!

హైదరాబాద్: నిన్న జరిగిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో షెడ్యూల్డ్ కులాల (రిజర్వేషన్ల హేతుబద్ధీకరణ) బిల్లు-2025ను తెలంగాణ శాసనసభ ఆమోదించింది. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణకు ఆధారందశాబ్దాలుగా వెనుకబడిన ఎస్సీ వర్గాలకు సామాజిక వెనుకబాటుతనం, ప్రాధాన్యత ఆధారంగా షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) వర్గీకరణ జరుగుతోందని వైద్యశాఖా మంత్రి దామోదర్ రాజ నరసింహ అన్నారు. బిల్లుపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వర్గీకరణ అంతిమ పరిష్కారం కాదని, వెనుకబడిన ఎస్సీ వర్గాల అభ్యున్నతికి ఒక సాధనమని అన్నారు. “ఎస్సీ వర్గాల సామాజిక-ఆర్థిక […]
Read more

మార్చి 21నుంచి పదోతరగతి పరీక్షలు… ఐదు లక్షలమంది విద్యార్థులు హాజరు!

హైదరాబాద్‌: తెలంగాణ SSC పబ్లిక్ పరీక్షలు మార్చి 21న ప్రారంభమై ఏప్రిల్ 4న ముగుస్తాయి, రాష్ట్రవ్యాప్తంగా 2650 పరీక్షా కేంద్రాల్లో 5.09 లక్షలకు పైగా విద్యార్థులు ఎగ్జామ్స్‌ రాయనున్నారు. ఈ పరీక్షలు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:30 వరకు జరుగుతాయి. ఫస్ట్ లాంగ్వేజ్ కాంపోజిట్ కోర్సు (ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:50 వరకు) సైన్స్ (భౌతిక, జీవ శాస్త్రంగా విభజించారు. ఇది ఉదయం 9:30 నుండి ఉదయం 11:00 వరకు జరుగుతుంది) మిగతా సబ్జెక్టులు […]
Read more

రాజీవ్ యువ వికాసం లబ్ధిదారులకు జూన్ 2న రుణ మంజూరు లేఖలు ఇస్తాం…డిప్యూటీ సీఎం!

హైదరాబాద్: రాజీవ్ యువ వికాసం పథకం లబ్దిదారులకు జూన్ 2న రుణ మంజూరు పత్రాలు పంపిణీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క వెల్లడించారు. ఈ మేరకు బ్యాంకు రుణాలు పొందేందుకు ఎంపికైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన ఐదు లక్షల మంది యువతకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 2న రుణ మంజూరు లేఖలు అందించనున్నారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి నిన్న అసెంబ్లీ ప్రాంగణంలో లబ్ధిదారుల […]
Read more
1 49 50 51 52 53 55

Grid News

Latest Post

వర్తమానం ఒక ప్రముఖ తెలుగు వెబ్ పత్రిక. డిజిటల్ రంగంలో నిజాయితీ, పారదర్శకత, విశ్వసనీయతతో కూడిన వార్తలను ప్రజలకు అందించడమే లక్ష్యంగా ఏర్పాటైంది.

Latest News

Most Popular

Copyright © 2024 Vartamanam. All Right Reserved.