32.1 C
Hyderabad
Wednesday, October 2, 2024

‘గాజా ఓ యుద్ధభూమి’…యుద్ధ విమానాల నుండి కరపత్రాలను జారవిడిచిన ఐడీఎఫ్!

టెల్ అవీవ్:  గాజాపై దాడులను ఇజ్రాయెల్ తీవ్రతరం చేస్తోంది. భూతల దాడుల తీవ్రతను శనివారం మరింత పెంచింది. పదాతి దళం, సాయుధ వాహనాలు గాజాకేసి దూసుకెళ్తున్నాయి. వాటికి దన్నుగా విమానాలు, యుద్ధ నౌకల నుంచి భారీ రాకెట్ దాడులు కొనసాగుతున్నాయి. ఫలితంగా గాజా నగరం ఇప్పుడు ‘యుద్ధభూమి’గా మారిందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) గాజా నివాసులను హెచ్చరించింది.

“మా సైన్యాలు గాజాను పూర్తిగా ముట్టడించాయి. యుద్ధం కొనసాగుతోంది” అని సైన్యం అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగరీ ప్రకటించారు. మరోవైపు, యుద్ధం కీలక దశలోకి ప్రవేశించిందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోస్ గాలంట్ ప్రకటించారు.

గాణాలోని అతి పెద్ద అస్పృతి అయిన షిఫా నిజానికి హమాస్ మిలిటెంట్ సంస్థ ప్రధాన కార్యాలయమని ఇజ్రాయిల్ ఆరోపించింది. ఆస్పత్రి కిందే దాని ప్రధాన స్థావరం దాగుందని పేర్కొంది. ఇందుకు సంబంధించి తమ దగ్గరున్న సమాచారం ఆధారంగా రూపొందించిన ఓ సిమ్యులేటెడ్ వీడియోను కూడా సైన్యం విడుదల చేసింది. అయితే ఈ ఆరోపణలను హమాస్ ఖండించింది.

అక్టోబర్ 7న మొదలైన ఇజ్రాయెల్-హమాన్ పోరాటంలో గాజులో మృతి చెందిన పాలస్తీనియన్ల సంఖ్య అకప టికే 7,700 దాటింది. వీరిలో చాలా దుంది బాలలు, మహిళలేనని పాలస్తీనా ప్రకటించింది.

గాజా స్తంభించింది…

ఇజ్రాయెల్ దాడులు ఛాటికి గాజాలో సమాచార వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. దాంతో వైద్య సేవలు పూర్తిగా పడకేసినట్టు ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి అష్రఫ్ అలిడ్రా తెలిపారు. అంబులెన్స్‌లకు సమాచారమివ్వడం అసాధ్యంగా మారిపోయింది. అవసరమైన చోట్లకు ఎమర్జెన్సీ బృందాలను వంతడం నిలిచిపోయింది.

నెట్ కనెక్టివిటీ ఇస్తానన్న ఎలాన్ మస్క్

గాజాలో పాలస్తీనియన్లకు కనీస సౌకర్యాలు అందించేందుకు ప్రయత్నిస్తున్న అంతర్జాతీయ సంస్థలకు స్టార్అంక్ నెట్వర్క్ ద్వారా ఇంటర్నెట్ తదితర కనెక్టివిటీ సౌకర్యం కలిపిస్తామని టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ శనివారం ప్రకటించారు. గాజాలో అన్ని సమాచార సదుపాయాలనూ ధ్వంసం చేయడం దారుణమంటూ అమెరికా నేత అలెగ్జాండ్రియా ఒకాసియో కొరెట్జ్ చేసిన వ్యాఖ్యలకు స్పందనగా మస్క్ ఈ మేరకు ప్రకటన చేశారు. స్టార్ లింక్ మస్క్ తాలూకు అంతరిక్ష ప్రయోగాల సంస్థ స్పేస్ ఎక్స్క చెందిన ఉపగహ నెట్వర్క్ వ్యవస్థ.

యుద్ధ విమానాల నుండి కరపత్రాలను జారవిడిచిన IDF

ఇజ్రాయెల్ సైన్యం కొనసాగుతున్న యుద్ధం ప్రారంభంలో హమాస్ చేతిలో బందీలుగా ఉన్న వందలాది మంది పౌరులను గుర్తించే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. IDF విమానం మంగళవారం గాజా స్ట్రిప్‌లో పాలస్తీనియన్లకు నగదు బహుమతులు, సమాచారానికి బదులుగా వారి పిల్లలకు ‘ఉత్తమ భవిష్యత్తు’ గురించి హామీ ఇస్తూ పెద్ద సంఖ్యలో కరపత్రాలను జారవిడిచింది.

“శాంతితో జీవించడం, మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలనేది మీ సంకల్పం అయితే,  మీ ప్రాంతంలో బందీలుగా ఉన్న వారి గురించి మాతో విలువైన సమాచారాన్ని పంచుకోండి” అని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) తెలిపింది.

ఇజ్రాయెల్ సైన్యం అటువంటి నివాసితులకు, వారి ఇళ్లకు భద్రత కల్పించడంలో ‘గరిష్ట కృషి చేస్తుందని’ తెలిపింది. సమాచారం ిఇచ్చే వారి వివరాలు ‘రహస్యంగా ఉంచుతామని’, సంబంధిత సమాచారంతో ముందుకు వచ్చే వారికి నగదు బహుమతి కూడా ఇస్తామని వాగ్దానం చేసింది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles