సామూహిక శ్మశాన వాటికగా మారిన గాజా ఆస్పత్రులు… ఆందోళన వెలిబుచ్చిన ఐక్యరాజ్యసమితి!

0
13

గాజా:  ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమై 200 రోజులకు పైగా అవుతుంది. గాజా నగరంలో ఇజ్రాయెల్ సైన్యం జరిపిన మారణకాండ అమెరికాను కూడా రెచ్చగొట్టింది.  కాగా, గాజాలో కొత్త ఐడీఎఫ్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఖాన్ యూనిస్ ఆసుపత్రిలో జరిపిన తవ్వకాల్లో 200కి పైగా మృతదేహాలు లభ్యమయ్యాయని హమాస్ అధికారులు ఆరోపిస్తున్నారు.

ఇజ్రాయెల్ ఆసుపత్రిని సామూహిక శ్మశాన వాటికగా మార్చిందని హమాస్ ఆరోపించింది. మృతదేహాల క్రూరత్వంపై ఐక్యరాజ్యసమితి కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. మృత దేహాల్లో కొందరి చేతులు కట్టేసి ఉన్నాయని, మరి కొందరి మృతదేహాలపై బట్టలు కూడా లేవని పేర్కొంది.

వందలాది మంది అమాయకులను ఇజ్రాయెల్ దళాలు చంపి ఆసుపత్రిలో పాతిపెట్టినట్లు హమాస్ అధికారులు పేర్కొన్నారు. ఇక్కడ సామూహిక సమాధి ఉందని హమాస్ పేర్కొంది. అయితే, ఇజ్రాయెల్ సైన్యం హమాస్ ఆరోపణలను నిరాధారమైనదిగా పేర్కొంది. ఈ వాదనను తప్పుగా పేర్కొంది. ఈ ప్రాంతంలో ఇజ్రాయెల్ దళాలు, హమాస్ మిలిటెంట్ల మధ్య జరిగిన పోరులో పాలస్తీనియన్లు తాము గతంలో మృతదేహాలను పూడ్చిపెట్టినట్లు ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ నివేదించింది.

ఈ సందర్భంగా UN  మానవ హక్కుల కార్యాలయం ప్రతినిధి రవినా శ్యదసాని మాట్లాడుతూ, “చాలా మృతదేహాలు కనుగొన్నట్టు తెలుస్తోంది.  ఇది ఆందోళనకర పరిణామమని  మేము భావిస్తున్నామని అమె పేర్కొంది.”

“కొన్ని మృతదేహాల చేతులకు  సంకెళ్లు వేశారు, ఇది మానవ హక్కుల చట్టం, అంతర్జాతీయ మానవతా చట్టాల  తీవ్రమైన ఉల్లంఘనలను సూచిస్తుంది, ఈ ఉల్లంఘనలకు సంబంధించి తదుపరి పరిశోధనలు జరగాల్సి ఉందన్నారు.”

నాసర్ ఆసుపత్రిలో 283 మృతదేహాలు , షిఫాలో 30 మృతదేహాలు లభ్యమయ్యాయని పాలస్తీనా అధికారుల నివేదికల ఖచ్చితత్వాన్ని ధృవీకరించడానికి ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం పనిచేస్తోందని ఆమె సూచించారు.

ఈ నివేదికల ప్రకారం, మృతదేహాలు వ్యర్థాల మాదిరి  కుప్పగా ఖననం చేశారు. వారిలో మహిళలు, వృద్ధులు ఉన్నారు.

నాజర్ ఆసుపత్రికి సమీపంలో పాలస్తీనియన్లు పాతిపెట్టిన మృతదేహాలను సైన్యం కనుగొని పరిశీలించింది, చనిపోయిన వారిలో ఎవరైనా బందీలుగా ఉన్నారా అని పరిశీలిస్తున్నారు.