32.2 C
Hyderabad
Saturday, May 18, 2024

ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు తెంచుకున్న కొలంబియా!

జెరూసలేం: గాజాలో జాతి హననానికి పాల్పడుతున్న ఇజ్రాయెల్ దేశంతో దౌత్యపరమైన సంబందాలు తెంచుకుంటామని కొలంబియా తెలిపింది.  ఈ నిర్ణయాన్ని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ఖండించారు.

కొలంబియా అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు హమాస్‌కు బహుమతి అందజేసినట్టుగా ఉన్నాయని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి అభివర్ణించారు. కొలంబియా దేశం హంతకులకు, రేపిస్టులకు మద్దతు ఇచ్చిందని ఆయన Xలో  పోస్టు చేశారు. ‘

“ఇజ్రాయెల్, కొలంబియా మధ్య సంబంధాలు ఎల్లప్పుడూ ఉద్రిక్తంగానే ఉన్నాయని”  కాట్జ్ రాశారు, పెట్రో “దానిని కొనసాగించారని” ఆయన జోడించారు.

కాగా, బొగాటోలో జరిగిన మేడే ర్యాలీలో కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో ప్రసంగించారు. త్వరలోనే ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలను విచ్చిన్నం చేస్తాం అని ప్రకటించారు. దాదాపు 34,500 మంది పాలస్తీనియన్లను చంపిన విధ్వంసకర సైనిక దాడిని వెంటనే ఆపాలని పిలుపునిచ్చారు. గాజాలో జరుగుతున్న దారుణ పరిస్థితులను చూస్తే ఏ దేశమూ ఉరుకోబోదని తెలిపారు. ఒకవేళ పాలస్తీనా అంతమైతే ప్రపంచంలో మానవత్వం చచ్చిపోయినట్లేనని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రో ఇప్పటికే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహును తీవ్రంగా విమర్శించారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles