23.7 C
Hyderabad
Thursday, October 3, 2024

ఇజ్రాయెల్‌లో ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలు!

టెల్‌అవీవ్‌: ఇజ్రాయెల్‌లో ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని, గాజాలో బందీలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పదివేల మంది నిరసనకారులు నెస్సెట్ (ఇజ్రాయెల్ పార్లమెంట్) ముందు ప్రదర్శన నిర్వహించారని ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ నివేదించింది.

ప్రభుత్వ వ్యతిరేక నిరసనకారులు ఇజ్రాయెల్ పార్లమెంట్ ముందు గుమిగూడారు , తరువాత ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఇంటికి వెళ్లారు,  టెల్ అవీవ్‌లో నిరసనకారులు “మేము భయపడము, మీరు దేశాన్ని నాశనం చేశారు, మేము దానిని సరిచేస్తాము” అని నినాదాలు చేశారు. మేము బందీలను సజీవంగా తిరిగి తీసుకొస్తామని, శవపేటికలలో కాదని అన్నారు. దేశంలో ముందస్తు ఎన్నికలకు పిలుపునివ్వాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. హమాస్ చేతిలో బందీలుగా ఉన్న ప్రజలను విడుదల చేయాలని నిరసనకారులు కోరారు. అక్కడ పోలీసులతో హింసాత్మక ఘర్షణలు జరిగాయి, కనీసం ముగ్గురు వ్యక్తులు ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది.

తాజా ఎన్నికలకు పిలుపునిస్తూ, నిరసనల సమయంలో అక్టోబర్ 7 వైఫల్యాలకు నెతన్యాహు “దోషి” అని ఆరోపిస్తూ నినాదాలు కూడా చేశారు.

గాజాలో యుద్ధం కొనసాగుతున్నంత కాలం ఎన్నికలు జరగకూడదని నెతన్యాహు పదే పదే ప్రకటించారు. టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ప్రకారం, ఇజ్రాయెల్‌లో తదుపరి సాధారణ ఎన్నికలు అధికారికంగా 2026 అక్టోబర్ లో జరగనున్నాయి.

అక్టోబరు 7న హమాస్ దాడి తర్వాత గాజాలో సంఘర్షణ తీవ్రమైంది, ఇక్కడ పాలస్తీనా ప్రతిఘటన సమూహం నుండి దాదాపు 2,500 మంది యోధులు గాజా స్ట్రిప్ నుండి ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించారు. తద్వారా భారీ ప్రాణనష్టం సంభవించింది. మరికొంతమందని బందీలుగా చేసుకున్నారు.

దీన్ని సాకుగా చూపి ఇజ్రాయెల్ తన సైన్యంతో గాజాలో మారణహోమానికి పాల్పడుతోంది.

గాజాలో యుద్ధంపై తీవ్ర విభేదాల మధ్య, నెతన్యాహు  యుద్ధ మంత్రివర్గంలోని ఇద్దరు సభ్యులు, బెన్నీ గాంట్జ్, గాడి ఐసెన్‌కోట్ గత వారం రాజీనామా చేశారు.

దీని తరువాత,  ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు జూన్ 16న తన యుద్ధ మంత్రివర్గాన్ని రద్దు చేశారు.

క్యాబినెట్ మంత్రులిద్దరూ మాజీ మిలటరీ చీఫ్‌లు. వారు దక్షిణ ఇజ్రాయెల్‌పై హమాస్ టెర్రర్ గ్రూప్ దాడి చేసిన తర్వాత అక్టోబర్‌లో ఏర్పడిన ఐదుగురు సభ్యుల బాడీలో మితవాద స్వరాలుగా కనిపించారు.

ఈ చిన్న వార్ క్యాబినెట్ ఏర్పాటు అనేది నేషనల్ యూనిటీ పార్టీ చైర్ బెన్నీ గాంట్జ్ సంకీర్ణంలో చేరడానికి ఒక కారణమైంది.

ముగ్గురు క్యాబినెట్ సభ్యులలో ఒకరైన గాంట్జ్ గత వారం సంకీర్ణాన్ని విడిచిపెట్టి, ముగ్గురు యుద్ధ క్యాబినెట్ పరిశీలకులలో ఒకరైన గాడి ఐసెన్‌కోట్‌ను అతనితో పాటు తీసుకెళ్లారు.

ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ప్రకారం, అత్యవసర ఐక్యత ప్రభుత్వం ఇక లేనందున, ఆ ఏర్పాటులో భాగంగా ఉద్భవించిన వార్ క్యాబినెట్ ఇకపై రద్దు అయిందని PMO అధికారి పేర్కొన్నారు.

ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమై  ఎనిమిది నెలలు పూర్తి కావస్తున్న సమయంలో గాంట్జ్ సంకీర్ణం నుంచి వైదొలిగారు.  పశ్చిమాసియాలో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది.

ఈ పరిణామంపై గత వారం టెలివిజన్ వార్తా సమావేశంలో గాంట్జ్ మాట్లాడుతూ… ”నిజమైన విజయం దిశగా ముందుకు సాగకుండా నెతన్యాహు మమ్మల్ని అడ్డుకుంటున్నారు. అందుకే మేము ఈ రోజు అత్యవసర ప్రభుత్వాన్ని విడిచిపెడుతున్నాము, ీఈ నిర్ణయం బరువెక్కిన హృదయంతో తీసుకుంటున్నాని గాంట్జ్ అన్నారు.

“చివరికి ప్రజల విశ్వాసాన్ని గెలుచుకునే, సవాళ్లను ఎదుర్కోగలిగే ప్రభుత్వాన్ని స్థాపించే ఎన్నికలు జరగాలి” అని గాంట్జ్ అన్నారు, కొనసాగుతున్న యుద్ధం కారణంగా పౌరులలో పెరుగుతున్న ఆగ్రహాం కారణంగా ఇజ్రాయెల్‌లో ముందస్తు ఎన్నికలకు పిలుపునిచ్చారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles