30.2 C
Hyderabad
Wednesday, October 2, 2024

పెన్సిల్వేనియా ఎన్నికల ర్యాలీలో ట్రంప్‌పై కాల్పులు!

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తున్న రిపబ్లికన్‌ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. పెన్సిల్వేనియాలో జరిగిన ప్రచార ర్యాలీలో సాయుధుడు జరిపిన కాల్పుల్లో ఆయన కుడి చెవికి గాయమైంది. కాగా ఈ కాల్పుల ఘటనను ప్రపంచ నేతలందరూ ఖండించారు.

శనివారం బట్లర్ కౌంటీలో కాల్పులు జరిపిన తర్వాత 78 ఏళ్ల మాజీ అధ్యక్షుడు వేదికపై నుండి బయటికి వచ్చారు. ఈ ఘటనలో అనుమానిత షూటర్, ర్యాలీకి హాజరైన వ్యక్తి మరణించారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

ట్రంప్‌ను సురక్షితంగా దూరంగా తీసుకెళ్లాక తన పిడికిలిని పైకి లేపారు. ఆ తరువాత “నా కుడి చెవి పైభాగాన బుల్లెట్‌తో నన్ను కాల్చారని అన్నారు.”

ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) ఒక వార్తా సమావేశంలో కాల్పులను “హత్య ప్రయత్నం”గా పరిగణిస్తున్నట్లు ధృవీకరించింది. 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ హత్యాయత్నంలో “ప్రమేయం” ఉన్నట్లు గుర్తించినట్లు FBI ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.

శనివారం సాయంత్రం 6:15 గంటల సమయంలో తన మద్దతుదారుల మధ్యలో ఆయన ప్రసంగం ప్రారంభిస్తుండగా.. సమీపంలోని ఓ రేకుల నిర్మాణంపై నక్కిన దుండగుడు ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపాడు. ఒక బుల్లెట్‌ ట్రంప్‌ కుడి చెవిని తాకుతూ దుసుకెళ్లింది. దీంతో ప్రాణాలను కాపాడుకునేందుకు ఆయన పోడియం వెనుక మోకాళ్లపై కుర్చున్నారు. వెంటనే అప్రమత్తమైన సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు ట్రంప్‌ చుట్టూ రక్షణగా చేరి ఆయనను వేదిక కిందకు తీసుకెళ్లారు.

ఈ ఘటనలో ట్రంప్‌ కుడి చెవికి గాయమై రక్తస్రావమైంది. ఆయన ముఖంపై రక్తపు ధారలు కారుతుండగానే.. సభకు హాజరైన జనాన్ని ఉద్దేశించి ట్రంప్‌ అభివాదం చేశారు. పిడికిలి బిగించి, ‘ఫైట్‌, ఫైట్‌, ఫైట్‌’ అని నినదించారు. వెంటనే ట్రంప్‌ను పిట్స్‌బర్గ్‌ ఏరియా హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. దుండగుడు జరిపిన కాల్పుల్లో సభకు హాజరైన ఓ వ్యక్తి మరణించగా, మరో ఇద్దరు గాయపడి చికిత్స పొందుతున్నారు.

ట్రంప్‌పై అనుమానాస్పద హత్యాయత్నాన్ని “ప్రతి ఒక్కరూ ఖండించాలి” అని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ అన్నారు. ఆయన కోసం, ఆయన కుటుంబం కోసం ప్రార్థిస్తున్నట్టు తెలిపారు. ట్రంప్‌ను రక్షించిన సీక్రెట్‌ సర్వీస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అమెరికాలో ఇలాంటి హింసకు తావులేదని, దేశమంతా ఐక్యంగా ఈ ఘటనను ఖండించాలని పిలుపునిచ్చారు. ట్రంప్‌తోనూ బైడెన్‌ ఫోన్‌లో మాట్లాడారని వైట్‌ హౌజ్‌ అధికారి చెప్పారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles