26.2 C
Hyderabad
Wednesday, October 2, 2024

మక్కాలో ఆరంభమైన హజ్ యాత్ర … ఈ సారి 10ల‌క్ష‌ల మందికి అవకాశం!

 మక్కా:  కరోనావైరస్ మహమ్మారి తర్వాత ఇస్లాం పవిత్ర నగరం మక్కాలో హజ్ యాత్ర  ఆరంభమైంది.  అతిపెద్ద హజ్ క్రతువులో పాల్గొనేందుకు  తెల్లని ద‌స్తులు ధరించిన ఆరాధకులు మక్కా వీధుల్లో నిండిపోయారు. 2019 నుండి మొదటి అంతర్జాతీయ సందర్శకులతో సహా విశ్వాసులను స్వాగతించే బ్యానర్‌లు, మక్కా రోడ్లను అలంకరించాయి. గ్రాండ్ మసీదు ప్రాంగణం మధ్యలో గురువారం వేలాది మంది యాత్రికులు కాబాను ప్రదక్షిణ చేశారు.
 హజ్ యాత్రలో  భాగంగా హజ్ యాత్రికులు గురువారం మినా పట్టణానికి చేరుకున్నారు. ఆ రోజు అక్కడే బస చేస్తారు. మక్కా సిటీకి 8కి.మీ. దూరంలో మినా సిటీ ఉంది. మినాలో బస చేయడమన్నది హజ్ యాత్రలో చేసే మొట్టమొదటి విధి. రోజంతా ఇక్కడే దైవారాధనల్లో నిమగ్నమవుతారు. నేడు (శుక్రవారం) అరఫాత్ మైదానానికి చేరకుంటారు. మక్కాకు 20కి.మీ.దూరంలో అరఫాత్ మైదానం ఉంది. అరఫాత్ లో జొహర్, అసర్ నమాజు చదువుతారు. మొత్తంగా హజ్ యాత్రికులు ఐదు రోజులు పాటు ఈ హజ్ క్రతువును నిర్వహించడం ఓ సాంప్రదాయం.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles