30.2 C
Hyderabad
Wednesday, October 2, 2024

గాజాపై ఇజ్రాయెల్ వైమానిక దాడి… 10మంది మృతి, 75మందికి గాయాలు

టెల్ అవీవ్: టర్కీ, ఖతార్‌లు ఇప్పటికే దిగ్భంధంలో గాజా పాలస్తీనాపై ఇజ్రాయెల్ “దూకుడు”ను తీవ్రంగా ఖండించాయి, ఇజ్రాయిల్‌ యొక్క వైమానిక దాడుల్లో ఐదు సంవత్సరాల బాలికతో సహా కనీసం 10 మంది మరణించారు, 75 మంది గాయపడ్డారు తిరుగుబాటు దారులు ప్రతీకార రాకెట్ దాడులు జరిపారు. ఇజ్రాయెల్‌ జరిగిపిన దాడుల్లో “పిల్లలతో సహా పౌరులు ప్రాణాలు కోల్పోవడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు” అని టర్కీ పేర్కొంది. దిగ్బంధించిన గాజాపై భయంకరమైన దాడుల తరువాత ఈ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తత మధ్య టర్కీ విదేశాంగ మంత్రిత్వ శాఖ “నిగ్రహం పాటించాలని కోరింది.

“దాడుల తర్వాత ఈ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తత గురించి మేము తీవ్ర ఆందోళన చెందుతున్నాము. ఈ సంఘటనలు కొత్త సంఘర్షణగా మారకముందే వాటిని ముగించాల్సిన అవసం ఉందని” అని టర్కీ పేర్కొంది. ఖతార్ కూడా పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ దాడులను ఖండించింది.”అంతర్జాతీయ సమాజం పౌరులకు, ముఖ్యంగా మహిళలు, పిల్లలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ దాడులు మళ్లీ పునరావృతమవకుండా అత్యవసర చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజాన్ని కోరింది.

తూర్పు జెరూసలేం రాజధానిగా 1967 సరిహద్దుల్లో వారి స్వతంత్ర రాజ్య స్థాపనపై  పాలస్తీనా ప్రజల చట్టబద్ధమైన హక్కులు ఉన్నాయని దోహా తన “దృఢమైన” వైఖరిని పునరుద్ఘాటించింది. ఇరాన్ ఇజ్రాయెల్ వైమానిక దాడిని “క్రూరమైన దాడి” గా అభివర్ణించింది. దీని ఫలితంగా “రెసిస్టెన్స్ కమాండర్లు” రక్షణ లేని పాలస్తీనియన్ ప్రజలు చంపబడ్డారని ఆవేదన వ్యక్తం చేసింది.

మధ్యప్రాచ్య శాంతి ప్రక్రియ కోసం నియమితుడైన యూఎన్‌ రాయబారి మాట్లాడుతూ… “పాలస్తీనా తీవ్రవాదులు, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న తీవ్రతరం, ఈ రోజు గాజాలో పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్ నాయకుడిని లక్ష్యంగా చేసుకుని హత్య చేయడంపై తీవ్ర ఆందోళన చెందుతున్నాను.” ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో కనీసం 10 మంది పాలస్తీనియన్లు మరణించారు. ఈ దాడులలో ఐదేళ్ల చిన్నారి మరణించినట్లు వచ్చిన నివేదికల పట్ల నేను చాలా బాధపడ్డాను. పౌరులపై ఎటువంటి దాడులను సమర్థించలేము దౌత్యవేత్త “టోర్ వెన్నెస్‌ల్యాండ్ పేర్కొన్నారు.

ఈజిప్ట్ మధ్యవర్తిత్వం
గాజాలో తాజాగా నెలకొన్న ఉద్రికత్తలను తగ్గించేందుకు ఈజిప్ట్ కృషి చేస్తోందని ఆ దేశ వర్గాలు తెలిపాయి. ఇస్లామిక్ జిహాద్ లక్ష్యాలపై ఇజ్రాయెల్ దాడులు ప్రారంభించిన శుక్రవారం నుండి కైరో మధ్యవర్తిత్వ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఈజిప్టు భద్రతా విభాగం గాజాలోని ఏఎఫ్‌పీ వార్తా సంస్థకు తెలిపింది. బాంబు దాడి గురించి విలేకరులకు వివరించేటప్పుడు ఇజ్రాయెల్ అధికారులు ఇంతకుముందు ఈజిప్టు మధ్యవర్తిత్వాన్ని ప్రస్తావించారు.

తమ వైమానిక దాడులపై ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి యైర్ లాపిడ్ మాట్లాడుతూ… ఈ దాడులను “తక్షణ ముప్పుకు వ్యతిరేకంగా కౌంటర్-టెర్రర్ ఆపరేషన్”గా అభివర్ణించారు ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ సెకండ్‌-ఇన్-కమాండ్‌గా పేర్కొన్న తైసిర్ అల్ జబారిని చంపినట్లు ప్రకటించారు. అందుకు ప్రతిగా ఇస్లామిక్ తీవ్రవాదులు ఇజ్రాయెల్ వైపు 100 కంటే ఎక్కువ రాకెట్లతో దాడి చేశారని ఆరోపించారు.

ఇస్లామిక్ తీవ్రవాద గ్రూపుకు చెందిన ప్రతినిధి బృందం శనివారం తర్వాత చర్చల కోసం కైరోకు వెళ్లవచ్చని ఈజిప్టు విడిగా తెలిపింది. దోహాలో ఉన్న హమాస్‌ నాయకుడు ఇస్మాయిల్ హనియే హింసపై “ఈజిప్టు ఇంటెలిజెన్స్”తో చర్చలు జరిపినట్లు హమాస్ ప్రకటన తెలిపింది.

ఐదేళ్ల బాలిక మృతి
మొదటి రౌండ్ వైమానిక దాడుల తరువాత గాజా నగరంలో ఒక భవనం నుండి మంటలు వ్యాపించాయి, గాయపడిన పాలస్తీనియన్లను వైద్యాధికారులు ఖాళీ చేయించారు. పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటనను అనుసరించి… “ఇజ్రాయెల్‌ దాడుల కారణంగా పదిమంది పాలస్తీనయన్లలో ఐదేళ్ల బాలిక కూడా ఉంది. ఆమె నుదిటిపై గాయం ఉంది. వైమానిక దాడుల్లో మరణించిన జబారి, ఇతరుల అంత్యక్రియల కోసం వందలాది మంది పాలస్తీనియన్లు గాజా నగరంలో గుమిగూడారు.

మే 2021లో ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య 11 రోజుల యుద్ధం జరిగింది. ఏడాది దాటాక తాజా ఇజ్రాయెలీ వైమానికి దాడులు జరిగాయి. గాజా నగరాన్ని ఇజ్రాయెల్‌ దిగ్బంధం చేశాక ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసింది. పాలస్తీనా ఇప్పటిదాక గాజాలో కనీసం 250 మంది పాలస్తీనియన్లను చనిపోయారు.

365 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దాదాపు 2.3 మిలియన్ల మంది పాలస్తీనియన్లు నివసించే ఇరుకైన భూభాగం గాజా.. 2007 నుండి ఇజ్రాయెల్ దిగ్బంధంలోని ఉన్న సంగతి తెలిసిందే.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles