30.2 C
Hyderabad
Wednesday, October 2, 2024

పాలస్తీనా ‘ఫతా’, ‘హమాస్’ల మధ్య చారిత్రక ఒప్పందం!

అల్జీర్స్: నవంబర్‌లో అరబ్ లీగ్ సదస్సు జరగనున్న నేపథ్యంలో పాలస్తీనా అధ్యక్షుడు మొహమద్ అబ్బాస్ నేతృత్వంలోని ఫతా వర్గం,    హమాస్‌ మిలిటెంట్ గ్రూపుల మధ్య సయోధ్య కుదిరింది.  అల్జీరియాలో జరిగిన ఈ చారిత్రక సమావేశంలో ఇరువర్గాలు 15 సంవత్సరాల తమ వైరాన్ని పరిష్కరించే లక్ష్యంతో ఒక ఒప్పందంపై సంతకం చేశాయి.

గురువారం సంతకం చేసిన ఈ ఒప్పందం మేరకు ఆక్రమిత వెస్ట్ బ్యాంక్  ప్రాంతంపై ఆధిపత్యం ఉన్న ఫతా ఉద్యమకారులు,  హమాస్ మధ్య విబేధాలను ముగించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.  సంతకాల కార్యక్రమం తర్వాత సీనియర్ ఫతా అధికారి అజం అల్-అహ్మద్ మాట్లాడుతూ… విబేధాలు నెలకొన్న కాలాన్ని”క్యాన్సర్”గా అభివర్ణించారు. ఈ  ఒప్పందం “అమలు చేయబడుతుంది” అని విస్పస్ఠంగా పేర్కొన్నారు.

హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనియే “పాలస్తీనా పాలస్తీనా ప్రయోజనాలను ఇష్టపడేవారికి ఇది సంతోషకరమైన రోజు, కానీ జియోనిస్ట్ సంస్థ (ఇజ్రాయెల్)కి ఇది విచారకరమైన రోజు” అని అన్నారు.

అల్జీరియా అధ్యక్షుడు అబ్దెల్‌మాడ్‌జిద్ టెబౌన్ ఈ ఒప్పందాన్ని “చారిత్రకమైనది” అని పేర్కొన్నారు. అల్జీరియా రాజధానిలోని ప్యాలెస్ ఆఫ్ నేషన్స్‌లో జరిగిన సంతకాల కార్యక్రమంలో ఆయన చేసిన ప్రసంగంలో యాసర్ అరాఫత్ 1988లో పాలస్తీనా రాష్ట్ర స్వాతంత్ర్య ప్రకటనకు ఇదే భవనాన్ని ఉపయోగించారని పేర్కొన్నారు.

విదేశీ రాయబారుల సమక్షంలో.. పాలస్తీనా, అల్జీరియా జాతీయ గీతాలను సైనిక బృందం  ఆలపించింది. వైభవంగా జరిగిన వేడుకలో ఈ చారిత్ర ఒప్పందం కుదిరింది.

“పాలస్తీనా వైరి గ్రూపుల మధ్య సయోధ్య ప్రక్రియకు అల్జీరియా అందించిన సహకారాన్ని మేము అభినందిస్తున్నాము, దీనికి టర్కీ ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుంది” అని టర్కీ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఇకనుంచి పాలస్తీనా ఏకైక ప్రతినిధి పీఎల్‌ఓ!

గురువారం నాటి “అల్జీర్స్ డిక్లరేషన్” ప్రకారం, పాలస్తీనాలోని  ఇతర ప్రధాన గ్రూపులు కూడా సంతకం చేశాయి, అధ్యక్ష పదవికి పాలస్తీనియన్ లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు ఎన్నికలు జరుగుతాయి. ఇది మిలియన్ల మంది ప్రవాసులతో సహా పాలస్తీనియన్ల  పార్లమెంటు అయిన పాలస్తీనియన్ నేషనల్ కౌన్సిల్‌కు ఎన్నికలను కూడా ఏర్పాటు చేస్తుంది. కౌన్సిల్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి అల్జీరియా అంగీకరించింది.

అయితే ఐక్య ప్రభుత్వ ఏర్పాటుకు ప్రతినిధి బృందం అంగీకరించలేదు. 2006లో హమాస్ శాసనసభ ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత పాలస్తీనా వర్గాల మధ్య మొదలైన విభేదాలు ఆ తర్వాత తదుపరి ఎన్నికలు ఆగిపోయాయి.

ఈ ఒప్పందం పాలస్తీనా ప్రజల ఏకైక ప్రతినిధిగా అబ్బాస్ అధిపతిగా ఉన్న పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్‌ను కూడా గుర్తించింది. దాని జాతీయ కౌన్సిల్‌కు ఒక సంవత్సరం లోపు ఎన్నికలకు పిలుపునిచ్చింది.

నెలరోజుల అల్జీరియా మధ్యవర్తిత్వం తర్వాత వచ్చే నెలలో అల్జీర్స్‌లో అరబ్ లీగ్ సదస్సు జరగనున్న నేపథ్యంలో ఫతా, హమాస్‌తో సహా 14 గ్రూపుల నాయకులు రెండు రోజుల చర్చలు జరిపారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles