30.7 C
Hyderabad
Wednesday, October 2, 2024

ఎలన్ మస్క్ చేతికి ట్విట్టర్‌… సీఈఓ పరాగ్ అగర్వాల్‌పై వేటు!

న్యూఢిల్లీ : ప్రపంచలోని ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ట్విటర్  యాజమాన్య బాధ్యతలను ఎలన్ మస్క్ గురువారం చేపట్టారు. ఎలోన్ మస్క్ ట్విట్టర్ కొత్త బాస్  అయిన తర్వాత ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) పరాగ్ అగర్వాల్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) నెడ్ సెగల్‌లను తొలగించారు.  కాగా, ట్విట్టర్‌ తన చేతికి వచ్చిన తర్వాత ఉద్యోగులను భారీగా తొలగిస్తారంటూ వస్తున్న వార్తలపై మస్క్‌ ఇప్పటికే స్పందించారు. 75 శాతం ఉద్యోగులను తాను తొలగించబోనని స్పష్టం చేశారు. ట్విటర్ షేర్‌హోల్డర్స్‌కు ఒక్కొక్క షేర్‌కు 54.20 డాలర్లు చెల్లిస్తారు. ఇకపై నుంచి ట్విటర్ ప్రైవేట్ కంపెనీగా పని చేస్తుంది.

ఏప్రిల్‌లో కొనుగోలు ప్రకటన 
ఎలోన్ మస్క్ ఈ ఏడాది ఏప్రిల్ 13న ట్విట్టర్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించారు. అప్పట్లో అతను ఒక్కో షేరుకు $54.2 చొప్పున $44 బిలియన్లకు డీల్‌ ఆఫర్ చేశాడు. అయితే, ట్విట్టర్  ఫేక్ అక్కౌంట్స్ కారణంగా ట్విట్టర్, ఎలోన్ మస్క్ మధ్య విభేదాలు వచ్చాయి దీంతో జూలై 9న ఈ ఒప్పందం నుండి వైదొలగాలని ఎలోన్ మస్క్ నిర్ణయించుకున్నారు.

దీని తర్వాత ట్విట్టర్ అమెరికా కోర్టులో ఎలోన్ మస్క్‌పై కేసు వేసింది. దీనిపై డెలావేర్ కోర్టు ట్విట్టర్ డీల్‌ను అక్టోబర్ 28లోగా పూర్తి చేయాలని ఆదేశించింది. దాదాపు ఆరు నెలలపాటు పబ్లిక్, లీగల్ వివాదాల  ఎలన్ మస్క్ మనసు మార్చుకున్నారు.

ట్విటర్‌ను ఎలన్ మస్క్ 44 బిలియన్ డాలర్లకు కొన్నారు. ట్విటర్‌లో స్పామ్ బాట్స్‌ను చీల్చి చెండాడుతానని ఆయన చెప్పారు. యూజర్లకు కంటెంట్‌ను ఎలా చేరవేయాలో నిర్ణయించే ఆల్గోరిథమ్స్‌ను బహిరంగంగా అందుబాటులో ఉంచుతానన్నారు. విద్వేషం, విభజనవాదాలకు వేదికగా ట్విటర్‌ పని చేయకుండా చూస్తానన్నారు. అదే సమయంలో సెన్సార్‌షిప్‌ను పరిమితం చేస్తానని తెలిపారు. తాను ట్విటర్‌ను కొనడం వెనుక లక్ష్యం మరింత సొమ్ము సంపాదించుకోవడం కాదని చెప్పారు. మానవాళి అంటే తనకు చాలా ఇష్టమని, దానికి సాయపడేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు.

 

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles