26.2 C
Hyderabad
Wednesday, October 2, 2024

సౌదీలో ప్రతి 10 నిమిషాలకు ఓ విడాకుల కేసు!

రియాద్: సౌదీ అరేబియాలో  ఈ ఏడాది విడాకుల రేటులో గణనీయమైన పెరుగుదలను నమోదు చేసింది, రోజుకు 168 విడాకుల కేసులు నమోదవుతున్నాయి. ప్రతి గంటకు 7 విడాకుల కేసులు, ప్రతి 10 నిమిషాలకు ఒక కేసు కంటే ఎక్కువగా ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది.

సౌదీ జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ డేటా ప్రకారం, 2020 చివరి నెలల్లో 57,595 విడాకుల పత్రాలు జారీ చేయబడ్డాయి, ఇది 2019తో పోలిస్తే 12.7 శాతం పెరిగింది. అంతేకాదు సౌదీ సమాజంలో ఈ విడాకుల రేట్లు పెరగడానికి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లు ప్రధాన కారణంగా నిలిచాయి.

న్యాయవాది దఖిల్ అల్ దఖిల్ అరబిక్ దినపత్రిక అల్ యూమ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో… గత 10 సంవత్సరాలలో విడాకుల కేసుల సంఖ్య 2010లో కేవలం 9,233 కేసులు. అదే 2011లో 34,000కి పెరిగింది, ఇక 2020లో 57,000కు చేరింది. ఏటికేడు విడాకుల కేసులు పెరుగుతూనే ఉన్నాయని ఆ న్యాయవాది పేర్కొన్నాడు. ఈ సంవత్సరం నివేదికలు “దేశంలో ప్రతి గంటకు ఏడు విడాకుల కేసులు, 10 వివాహ ఒప్పందాలపై 3 కేసులు ఉన్నాయి” అని న్యాయవాది దఖిల్ అల్ దఖిల్ తెలిపారు.

అధిక విడాకుల రేటుకు కారణాలు
సౌదీ సమాజంలో భార్యాభర్తల మధ్య పెరుగుతున్న విడాకుల కేసులకు సమకాలీన జీవితంలోని సంక్లిష్టతలు,  అధిక జీవన వ్యయం, ముఖ్యంగా 2019లో ప్రారంభమైన COVID-19 మహమ్మారి సమయంలో విడాకుల రేటు మరీ ఎక్కువగా ఉందని అల్ దఖిల్ పేర్కొన్నాడు. ఇందుకు ధరల పెరుగుదలతో పాటు సోషల్ మీడియాతో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని ఆయన వాపోయారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles