25.7 C
Hyderabad
Wednesday, October 2, 2024

ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో కూలిన పైకప్పు…ఒకరు మృతి, ఐదుగురికి గాయాలు!

న్యూడిల్లీ: దేశ రాజధానిలో ఢిల్లీలో గత రాత్రి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. వర్షం ధాటికి తెల్లవారుజామున ఎయిర్‌పోర్టులోని ట్రెర్మినల్‌-1 పైకప్పులో కొంత భాగం టాక్సీలలు సహా కార్లపై ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో ఒకరు మరణించగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మొత్తంగా ఢిల్లీలో  153.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

ఇందిరాగాంధీ విమానాశ్రయంలో  ట్రెర్మినల్‌-1 పైకప్పు ఒక్కసారిగా కూలిపోయినట్టు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. పైకప్పు కూలినట్లు ఉదయం 5.30 గంటలకు తమకు సమాచారం అందిందన్నారు. పైకప్పు ట్యాక్సీలు సహా పలు వాహనాలపై పడటంతో అవి ధ్వంసమయ్యాయని చెప్పారు. భారీ వర్షాల వల్ల ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు.

రూఫ్ షీట్‌తో పాటు, సపోర్ట్ బీమ్‌లు కూడా కూలిపోవడంతో టెర్మినల్-1లోని పిక్-అప్ అండ్ డ్రాప్ ఏరియాలో పార్క్ చేసిన కార్లు దెబ్బతిన్నాయి.

కాగా, ఢిల్లీ విమానాశ్రయంలో పైకప్పు కూలిన ఘటనపై కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు స్పందించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నామని చెప్పారు. టెర్మినల్‌-1 వద్ద ప్రయాణికులందరికీ తగిన ఏర్పాట్లు చేయాలని విమానయాన సంస్థలకు సూచించారు.

టెర్మినల్-1లోని పైకప్పు కూలడం వల్ల విమాన రాకపోకలపైనా ప్రభావం పడింది. అక్కడి నుంచి బయలుదేరాల్సిన విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ముందు జాగ్రత్తగా చెకిన్ కౌంటర్లు మూసివేశామని చెప్పారు.

ఇండిగో ప్రతినిధి ఒక ప్రకటనలో, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా టెర్మినల్-1 వద్ద రూఫ్ కూలిపోవడం వల్ల విమాన కార్యకలాపాలు ప్రభావితమయ్యాయని ,ప్రయాణీకులు టెర్మినల్‌లోకి ప్రవేశించలేనందున  విమానాలు రద్దు చేసామని చెప్పారు “ఇప్పటికే టెర్మినల్ లోపల ఉన్న ప్రయాణీకులకు నేడు కానీ, వీలైతే  ప్రత్యామ్నాయాలు అందిస్తామని ఎయిర్‌లైన్ తెలిపింది.

విమానాశ్రయం వద్ద పై కప్పు కూలిపోవడంతో టెర్మినల్-1 వద్ద మా కార్యకలాపాలపై ప్రభావం పడినందున పాక్షికంగా కొన్ని విమానాలను రద్దు చేసినట్లు స్పైస్‌జెట్ తెలిపింది.

ఢిల్లీలో వర్షం ధాటికి రహదారులు జలమయం కావడంతో ఎక్కడి  వాహనాలు నిలిచిపోయాయి.  రాజధానిలోని పలు ప్రాంతాల్లో  వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దీంతో  ITO – ధౌలా కువాన్ వద్ద ట్రాఫిక్ కూడా ప్రభావితమైంది.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles