24.7 C
Hyderabad
Wednesday, October 2, 2024

‘నీట్’ వివాదం.. ఈ అంశాన్ని నేడు పార్లమెంటులో లేవనెత్తనున్న ఇండియా కూటమి!

న్యూఢిల్లీ:  ఈ రోజు పార్లమెంటు ఉభయ సభల్లో నీట్ అంశాన్ని లేవనెత్తాలని ప్రతిపక్ష ఇండియా కూటమి నిర్ణయించిందని, దీనికి సంబంధించి సభ్యులు వాయిదా తీర్మానాలు ఇస్తారని వర్గాలు తెలిపాయి. ఈ మేరకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో గురువారం జరిగిన ‘ఇండియా’ కూటమి పార్టీల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంపై చర్చ సందర్భంగా నీట్, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, సీబీఐ, ఈడీ దుర్వినియోగం, గవర్నర్ కార్యాలయం వంటి అంశాలను లేవనెత్తుతామని ప్రతిపక్షాలు తెలిపాయి.

దాంతో పాటూ స్పీకర్ ఎన్నిక, రాష్ట్రప్రతి ప్రసంగం మీద కూడా చర్చించారు. డీఎంకే ఎంపీ టీ రవి మాట్లాడుతూ, నీట్ అంశంపై నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. ముఖ్యంగా నీట్ అంశంపై నేడు పార్లమెంట్‌లో చర్చించాలని ప్రతిక్షం డిమాండ్ చేయనుంది. ఒకవేళ ఈ అంశంపై చర్చించేందుకు అధికార పక్షం అనుమతించకుంటే సభలో నిరసన తెలపాలని భావిస్లోంది.

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో జరిగిన ఇండియా కూటమి సమావేశంలో  లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీతో పాటు అలయన్స్  నేతలు శరద్ పవార్, సుప్రియా సూలే (ఇద్దరూ NCP-SP నుండి), డెరెక్ ఓ’బ్రియన్ (TMC), సంజయ్ రౌత్, ప్రియాంక చతుర్వేది (శివసేన-UBT), సంజయ్ సింగ్, సందీప్ పాఠక్ (ఇద్దరూ AAP), N K ప్రేమచంద్రన్ (RSP), మహువా మాఝీ (JMM) ఈ సమావేశంలో కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఫ్లోర్ లీడర్ల సమావేశానికి తాను హాజరయ్యానని గాంధీ ఫేస్‌బుక్ పోస్ట్‌లో తెలిపారు.

“ప్రజలకు సంబంధించిన సమస్యలను ఐక్యంగా లేవనెత్తడానికి, వారి హక్కుల కోసం పోరాడటానికి మనమందరం కట్టుబడి ఉన్నాము” అని కాంగ్రెస్ నాయకుడు హిందీలో పోస్ట్ చేశారు.

పార్లమెంట్ ఉభయ సభల్లో సంయుక్తంగా లేవనెత్తే పలు అంశాలపై విపక్ష నేతలు చర్చించారు.

ప్రతిపక్ష ఇండియా కూటమికి  లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్‌ పదవిని కేటాయించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ డిమాండ్‌పై గట్టిగా ఒత్తిడి తెస్తామని, త్వరలో ఆ పదవికి పేర్లను చర్చిస్తామని వర్గాలు తెలిపాయి.

డిప్యూటీ స్పీకర్ పదవి కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పి), తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) లేదా డిఎంకె వంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీలలో ఎవరో ఒకరికి ఇవ్వాలని అభిప్రాయపడ్డారు.

“కాగా,  మిగిలిన పార్లమెంటు సమావేశాల కోసం వ్యూహాన్ని రూపొందించడానికి  ఇండియా కూటమి ఫ్లోర్  లీడర్లు  కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే జీ నివాసంలో సమావేశమయ్యారు” అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి KC వేణుగోపాల్ X లో  తెలిపారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles