30.2 C
Hyderabad
Wednesday, October 2, 2024

తెలంగాణ ప్రజల ఫిట్‌నెస్ ఐకాన్‌… పోలీస్ కానిస్టేబుల్ డి.ఎ. కుమార్!

హైదరాబాద్ : మిస్టర్ ఇండియా బాడీబిల్డింగ్ పోటీ 2022లో పాల్గొన్న హైదరాబాద్‌కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ డి.ఎ. కుమార్ నగరంలోని యువతకు స్ఫూర్తిగా నిలిచాడు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా ఫిట్‌నెస్ పై యువత దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌కు చెందిన కుమార్ 2010 బ్యాచ్ కానిస్టేబుల్. అతను ప్రస్తుతం లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్‌లో  పని చేస్తున్నాడు. అంతేకాదు జాతీయస్థాయిలో బాడీబిల్డర్‌గానూ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు.  తెలంగాణ నుండి జాతీయ బాడీబిల్డింగ్ పోటీలో పాల్గొన్న మొట్టమొదటి  పోలీసు కానిస్టేబుల్‌ గా రికార్డు సృష్టించాడు.
బాడీబిల్డర్‌గా మారడం అంటే సాధారణ విషయం కాదు, ప్రతిరోజూ సరైన ఆహారం తీసుకోవాలని కుమార్ మీడియాతో అన్నారు. తన రోజువారీ దినచర్య గురించి చెబుతూ… నేను ఉదయం 6 గంటలకు లేచి, జిమ్‌కి వెళ్లి, 7.30 గంటలకు తిరిగి వస్తాను, ఆపై ఉదయం 8 గంటలకు డ్యూటీకి వెళతాను. రోజూ 12 గంటలు డ్యూటీ చేస్తాను. రాత్రి 10 నుంచి 11 గంటల వరకు మళ్లీ వర్కవుట్ చేస్తాను. సరైన ఆహారం లేకుండా, బాడీబిల్డింగ్ సాధ్యం కాదు. దీన్ని గుర్తించిన నా భార్య వర్ష ఆహారం విషయంలో ప్రతిరోజూ నాకు మద్దతు ఇస్తుంది. ఆమె చికెన్, చేపలు, గుడ్లు వంటి ఆహార పదార్థాలను ఎప్పటికప్పుడు సిద్ధం చేస్తుంది. నేను ఆఫీసులో ఉన్నప్పుడు కూడా ఆమె భోజనం పంపుతుంది. ప్రతిరోజూ నేను 5 నుండి 6 సార్లు భోజనం తీసుకుంటానని బాడీబిల్డర్‌ కుమార్ తెలిపారు. తన సతీమణి, పోలీసు స్టేషన్‌లోని అధికారుల   సహకారం వల్లే తాను పోటీల్లో పాల్గొనగలిగానని, వారందరి సహకారంతో విజయం సాధించారని, చెప్పారు.
నా పైఅధికారుల ప్రోత్సాహం వల్ల నేను ఉద్యోగంలోనూ రాణించగలుగుతున్నాను. వారి మద్దతు కారణంగా, నేను మిస్టర్ ఇండియా 2022లో పాల్గొన్న మొదటి హైదరాబాద్ పోలీసు కానిస్టేబుల్ అయ్యాను. నేను మిస్టర్ తెలంగాణలో రెండవ స్థానం,  WTF పోటీలో 3వ స్థానం సాధించాను. నా దగ్గర మొత్తం 10కి పైగా పతకాలు ఉన్నాయి’ అని కుమార్ చెప్పాడు.
మత్తు పదార్థాలకు అలవాటు పడే యువత ఫిట్‌నెస్‌పై దృష్టి సారించాలి:
“మద్యం, ఇతర మత్తు పదార్థాలకు అలవాటు పడిన యువత, అలాంటి పదార్థాల వినియోగాన్ని మానేసి, ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలని వారికి నేను ఒక సందేశాన్ని మాత్రమే ఇస్తున్నాను. ఇదే నా సూచన అని కుమార్ మీడియాతో అన్నారు.
కుమార్‌కు ఫిట్‌నెస్‌పై ఉన్న ఆసక్తిని చూసి పోలీస్‌స్టేషన్‌ మద్దతుగా నిలిచిందని లంగర్ హౌస్ పోలీసు స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ ‌ కె శ్రీనివాస్‌ తెలిపారు.
 కుమార్ బాడీబిల్డింగ్‌లో బాగా రాణిస్తున్నాడు. పోలీసుగా తన విధులు ముగించుకున్న తర్వాత జిమ్‌కి వెళ్తాడు. ఉదయం జిమ్ తర్వాత, అతను మళ్ళీ డ్యూటీకి వస్తాడు. కుమార్ ఆసక్తిని చూసి లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ అతనికి నైతికంగా మద్దతు ఇచ్చింది. ఆలిండియా బాడీబిల్డింగ్ పోటీల్లో కూడా పాల్గొని ఎన్నో బహుమతులు పొందాడని లంగర్‌ హౌస్‌ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ కె. శ్రీనివాస్‌ తెలిపారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles