24.7 C
Hyderabad
Wednesday, October 2, 2024

మే 31న తొలి హజ్ విమానం… ఈ ఏడాది ఎయిర్ ఇండియా విమానాలు లేవు!

 న్యూఢిల్లీ: ఈ ఏడాది హజ్‌ కోటా తగ్గింపు దృష్ట్యా యాత్రికుల సంఖ్య తగ్గినప్పటికీ హజ్ 2022 ఖర్చు బాగా పెరుగుతుందని భావిస్తున్నారు. భారతీయ యాత్రికుల హజ్ ఖర్చు సుమారుగా ప్రతి యాత్రికుడికి 3.5 లక్షలు ఉంటుందని భారతీయ హజ్ కమిటీకి చెందిన ఒక ఉన్నత అధికారి ఒకరు తెలిపారు.

 మన యాత్రికులకు సౌదీలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారత సెంట్రల్ హజ్ కమిటీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసేందుకు యుద్ధప్రాతిపదికన కసరత్తు చేస్తోంది. మే 31న సౌదీ అరేబియాకు తొలి విమానం వచ్చే అవకాశం ఉందని సెంట్రల్ హజ్ కమిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ ఏపీ అబ్దుల్లా కుట్టి తెలిపారు.

 హజ్ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఒక అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు, కేరళ మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు అబ్దుల్లా కుట్టి నాలుగు రోజులపాటు సౌదీ అరేబియా పర్యటనకు వెళ్లొచ్చారు.

 జెద్దా నుంచి తిరిగి వచ్చాక నిన్న ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఈ ఏడాది 79,362 మంది యాత్రికులలో 56,301 మంది యాత్రికులు ప్రభుత్వ ఆధ్వర్యంలోని సెంట్రల్ హజ్ కమిటీ ద్వారా హజ్ యాత్ర చేస్తారని, మిగిలిన యాత్రికులు ప్రైవేట్ ఆపరేటర్ల ద్వారా వస్తారని చెప్పారు.

 మగవారు తోడు లేకుండా 1,850 మంది మహిళా యాత్రికులు హజ్ కోసం దరఖాస్తు చేయడం దేశంలోని ముస్లిం మహిళల సాధికారత కోసం ప్రధాని నరేంద్ర మోడీ ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుందని అబ్దుల్లా కుట్టి అన్నారు.భారతదేశంలోని నగరాన్ని బట్టి విమాన ధర మారుతుందని ఆయన అన్నారు. అస్సాంలోని గౌహతి నుండి యాత్రికుల విమాన ఛార్జీ రూ. 1.25 లక్షలు, ఇది భారతదేశంలో అత్యధికం. ముంబై నుండి తక్కువ ధర రూ.65,000.

 ఈ సంవత్సరం హజ్‌ యాత్రికుల కోసం ఎయిర్ ఇండియా విమానాలు ఉండవని, సౌదీ అరేబియా ఎయిర్‌లైన్స్, ఫ్లైనాస్ స్పైస్‌జెట్ ఎయిర్‌లైన్స్‌ యాత్రికులను రవాణా చేస్తాయని సెంట్రల్ హజ్ కమిటీ చైర్మన్ తెలియజేశారు. అంతకుముందు ఉన్న 21 ఎంబార్కేషన్ పాయింట్లను ఇప్పుడు 10కి తగ్గించామని, హైదరాబాద్ మాత్రం ఎంబార్కేషన్ పాయింట్‌గానే ఉందని చెప్పారు.

 మదీనాలో యాత్రికుల వసతి ఖరారైందని, యాత్రికులందరూ మర్కజీ ప్రాంతంలోనే బస చేస్తారని అబ్దుల్లా కుట్టి తెలిపారు. మక్కాలో, యాత్రికులందరూ అజీజియా ప్రాంతంలో విడిది చేస్తారు., అయితే ఇంకా అద్దె ఒప్పందంపై సంతకం చేయలేదని ఆయన అన్నారు. హజ్ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు అబ్దుల్లా కుట్టి నాలుగు రోజుల పాటు సౌదీ అరేబియాలో ఉండి బుధవారం ఢిల్లీకి తిరిగి వచ్చారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles