32.1 C
Hyderabad
Wednesday, October 2, 2024

బ్యాంకింగ్‌ రంగంలో 34,615 కోట్ల స్కామ్‌… డిహెచ్‌ఎఫ్‌ఎల్‌పై సిబిఐ కేసు నమోదు!

న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌ రంగంలోనే అతిపెద్ద స్కామ్‌ బయపడింది. 34,615 కోట్ల బ్యాంకు మోసానికి సంబంధించి దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, దాని మాజీ సీఎండీ కపిల్ వాధావన్, డైరెక్టర్ ధీరజ్ వాధావన్ ఇతరులపై సీబీఐ కేసు నమోదు చేసింది. సీబీఐ దర్యాప్తు చేపట్టిన అతిపెద్ద కుంభకోణం ఇదేనని అధికారులు బుధవారం పేర్కొన్నారు. గతంలో ఎబిజి షిప్‌యార్డ్‌లో రూ.22,842 కోట్ల బ్యాంకింగ్ మోసం జరిగింది.

డిహెచ్‌ఎఫ్‌ఎల్‌పై సిబిఐ(సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) జరిపిన విచారణలో రూ.34,615 కోట్ల భారీ మోసం వెలుగులోకి వచ్చింది. 2010 నుంచి 2018 మధ్య కాలంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం డిహెచ్‌ఎఫ్‌ఎల్‌కు దాదాపు రూ.34,615 కోట్ల రుణాలను ఇచ్చింది. ఈ భారీ బ్యాంకింగ్ మోసానికి సంబంధించి సిబిఐ తాజాగా కేసు నమోదు చేసింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా 50 మంది అధికారులతో కూడిన సిబిఐ బృందం ముంబైలోని 12 చోట్ల సోదాలు నిర్వహించింది. ఎఫ్‌ఐఆర్‌లో ఉన్న అమరిలిస్ రియల్టర్స్‌కు చెందిన సుధాకర్ షెట్టి, ఎనిమిది మంది బిల్డర్లకు సంబంధించిన ప్రాంతాలపై సిబిఐ దాడులు చేసింది.

ఇందులో అమరిల్లిస్ రియల్టర్స్‌కు చెందిన సుధాకర్ శెట్టి, ఎనిమిది మంది ఇతర బిల్డర్లు ఉన్నారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కూడిన 17 బ్యాంకుల కన్సార్టియాన్ని రూ.34,615 కోట్ల మేర మోసం చేసేందుకు కుట్ర పన్నారనే అభియోగాలు వారిపై ఉన్నాయి. ఆయా బ్యాంకుల కన్సార్టియం నుంచి 2010 నుంచి 2018 మధ్యకాలంలో దాదాపు రూ.42,871 కోట్ల రుణాలు తీసుకొని వాటిని దుర్వినియోగం చేసినట్లు సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది.

లెక్కలను డీహెచ్ఎఫ్ఎల్ ఖాతా పుస్తకాల్లో తప్పుగా చూపించి.. వాస్తవాలను దాచిపెట్టి కపిల్, ధీరజ్ వాధావన్ ఇతరులతో కుట్రపూరితంగా తిరిగి చెల్లించలేమంటూ చేతులు ఎత్తేశారని సీబీఐ పేర్కొంది. 2019 మే నెల నుంచి రుణాలను తిరిగి చెల్లించడాన్ని డీహెచ్ఎఫ్ఎల్ నిలిపివేసిందని, ఫలితంగా బ్యాంకులు ఆయా లోన్లను మొండి బకాయిలుగా ప్రకటించాయని పేర్కొంది.

2021లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిహెచ్‌ఎఫ్‌ఎల్‌పై రూ.40,623 కోట్ల బ్యాంకింగ్ మోసంపై దర్యాప్తు చేయాలని సిబిఐని కోరింది. 2022 ఫిబ్రవరి 11న ఫిర్యాదును స్వీకరించిన తర్వాత సిబిఐ తన దర్యాప్తును ప్రారంభించింది. యెస్ బ్యాంక్ సహ వ్యవస్థాపకుడు రాణా కపూర్ కూడా మోసం కేసులో జైలుకు వెళ్లాడు. రాణా ప్రస్తుతం ముంబైలోని తాజోలా జైలులో ఉన్నాడు.

డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ మోసాలు 2019 జనవరి నుంచి వెలుగులోకి రావడం మొదలైంది. ఈ సంస్థ నిధులు మళ్లిస్తోందంటూ ప్రసార మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌పై ‘ప్రత్యేక ఆడిట్‌’ నిర్వహించాలంటూ కేపీఎమ్‌జీ సంస్థను 2019 ఫిబ్రవరి 1న బ్యాంకులు నియమించాయి. 2015 ఏప్రిల్‌ 1 – 2018 డిసెంబరు మధ్యకాలానికి, ఆ సంస్థ ఖాతా పుస్తకాలపై సమీక్ష నిర్వహించాలని కేపీఎమ్‌జీని అప్పట్లో కోరాయి. కపిల్‌, ధీరజ్‌ వాధ్వాన్‌లు దేశం విడిచిపెట్టకుండా ఉండేందుకు 2019 అక్టోబరు 18న ‘లుక్‌అవుట్‌ సర్క్యులర్‌’లను బ్యాంకులు జారీ చేశాయి.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles