25.7 C
Hyderabad
Wednesday, October 2, 2024

జమ్మూ కశ్మీర్‌లో ఇండియన్ రైల్వేస్ అద్భుతం… దేశంలో తొలి కేబుల్-స్టేయ్‌డ్ రైల్వే వంతెన!

న్యూఢిల్లీ : భారత దేశపు తొలి కేబుల్-స్టేయ్‌డ్ రైల్వే వంతెన డిసెంబరు నాటికి సిద్ధం కాబోతోంది. జమ్మూ-కశ్మీరులో నిర్మితమవుతున్న ఈ అంజి ఖాద్  వంతెన ఓ ఇంజినీరింగ్ అద్భుతం. దీనిని కాట్రా-రియాసిలను కలుపుతూ, రియాసీ జిల్లాలోని అంజి నదిపై నిర్మిస్తున్నారు. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్‌లో భాగంగా ఈ నిర్మాణం జరుగుతోంది. ఈ రైల్ లింక్ హిమాలయాల గుండా అత్యంత ఎత్తయిన ప్రాంతంలో నిర్మితమవుతోంది.

ఈ బ్రిడ్జిని ఉధంపూర్-శ్రీనగర్- బారాముల్లా రైల్ లింకు ( USBRL) లో నార్తెర్న్ జమ్మూ కశ్మీర్ రైల్వేస్ నిర్మిస్తోంది. ఇది కట్రా నుంచి జమ్మూ కశ్మీర్‌లోని రీసీని కనెక్ట్ చేస్తుంది.

నిర్మాణంలో ఉన్న కేబుల్-స్టేయ్‌డ్ రైల్వే వంతెన ప్రస్తుత స్థితిని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అంజి ఖాద్ వంతెన కశ్మీరును అనుసంధానం చేస్తుందని చెప్పారు. ఇది తొలి కేబుల్-స్టేయ్‌డ్ రైల్ బ్రిడ్జి అని, భవిష్యత్తు కోసం సిద్ధమవుతోందని పేర్కొన్నారు.

ఈ బ్రిడ్జినీ చినాబ్ నదిపై నిర్మిస్తున్నారు.  ఈ వంతెన పొడవు 473.25 మీటర్లు, నది గర్భం నుంచి 331 మీటర్ల ఎత్తులో, పెను తుపానులను తట్టుకునే విధంగా  దీనిని నిర్మిస్తున్నారు. దీనికి 96 కేబుల్స్ ఊతంగా నిలుస్తాయి. నిలువు ఏటవాలుపై సింగిల్ పైలాన్‌ను మాత్రమే నిర్మించడం ఇక్కడ సాధ్యమవుతుంది. చీనాబ్ నదిపై నిర్మించిన వంతెన తరహాలో ఇక్కడ సాధ్యం కాదు. విశిష్టమైన, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, పరికరాలతో దీనిని నిర్మిస్తున్నారు.  అంజి ఖాద్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయితే ఇది ప్రపంచంలోనే 7వ అతిపెద్ద ఆర్చి షేప్ బ్రిడ్జిగా ఖ్యాతి గడించనుంది.

https://www.kooapp.com/koo/ashwinivaishnaw/39a8c933-c9ed-42d1-94b7-692c8adec3af

 

ffd

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles