32.1 C
Hyderabad
Wednesday, October 2, 2024

సలాం… ముహమ్మద్‌ మానిక్‌ – ప్రాణాలను పణంగా పెట్టి మరీ 9 మందిని కాపాడి ముస్లిం వ్యక్తి!

కోల్‌కత: పశ్చిమబెంగాల్‌ జల్పాయ్‌గురి వద్ద దుర్గామాత విగ్రహాల నిమజ్జనం జరుగుతుండగా వచ్చిన ఆకస్మిక వరదల్లో 8 మంది మృతి చెందిన విషాద సమయంలో… అక్కడే ఉన్న ముహమ్మద్‌ మానిక్‌ అనే ముస్లిం యువకుడు తన ప్రాణాలను తెగించి వరదల్లో కొట్టుకుపోతున్న 9 మంది భక్తుల ప్రాణాలను కాపాడి మానవత్వాన్ని చాటాడు.

ఈ దుర్ఘటన జరిగిన సమయంలో దుర్గామాత విగ్రహాల నిమజ్జనానికి మాల్ నది ఒడ్డున వందలాది మంది వీక్షించేందుకు గుమిగూడారు. వారిలో మహమ్మద్ మానిక్ అనే ముస్లిం యువకుడు కూడా ఉన్నాడు. రాత్రి 8:30 గంటల సమయంలో నిమజ్జన స్థలానికి మానిక్ చేరుకున్న కొద్ది క్షణాలకే నీటి మట్టం పెరిగింది. విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు నదిలోపల ఉన్నవారు రెప్పపాటులో నీటిలో కొట్టుకుపోవడం మాణిక్ చూశాడు.

తన ప్రాణాలను పట్టించుకోకుండా, మాణిక్ తన మొబైల్‌ను తన స్నేహితుడికి అప్పగించి, మునిగిపోతున్న వారిని రక్షించడానికి నదిలోకి దూకాడు. కాసేపటి తర్వాత, లైఫ్ జాకెట్ ధరించిన సివిల్ డిఫెన్స్ వాలంటీర్లు కూడా దూకారు, తర్వాత అగ్నిమాపక దళం, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఒక గంట తర్వాత వచ్చారు.

మానిక్‌ వరద నీటిలో 2 గంటలకు పైగా పోరాడి ప్రజలను ఎలా రక్షించాడో అతని మాటల్లోనే విందాం… ఆకస్మిక వరదల్లో కొట్టుకుపోతు సహాయం కోసం ఆర్ధిస్తున్న వ్యక్తులను నేను చూశాను, నా చేతికి అందినవారిని పట్టుకుని… వారిని బయటకు లాగి ఒడ్డుకు తీసుకెళ్లా. చాలా మంది ప్రజలు రాళ్లకు అతుక్కుపోయారు. బలమైన అలలు నన్ను బాగా ఇబ్బంది పెట్టాయని ఆయన చెప్పారు.

వరద నీటిలో ప్రజలను రక్షించే సమయంలో మానిక్ గాయపడ్డాడు. అతని కుడి కాలి బొటనవేలు రక్తం కారుతోంది. అగ్నిమాపక సిబ్బంది ఇచ్చిన చేతి రుమాలును ఆ గాయానికి కట్టుకట్టి తిరిగి ప్రజలకు సహాయం చేయడానికి నదిలో దూకాడు. సుమారు 2 గంటల పాటు వరద నీటిలో ప్రజలను రక్షించిన తర్వాత, మానిక్ అలసిపోయాడు. ఆ తరువాత అతని స్నేహితుడు మానిక్‌ని మాల్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు, అక్కడ అతను ప్రథమ చికిత్స అందించారు.

మాణిక్, వృత్తిరీత్యా వెల్డర్. అతని కుటుంబంతో పశ్చిమ తెసిమల గ్రామంలో నివసిస్తున్నారు.  ప్రతి సంవత్సరం దుర్గాపూజ ఉత్సవాల్లో పాల్గొంటారు.  సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్న వీడియోలో, అతని స్నేహితులలో ఒకరు మాణిక్‌లు మరికొంత మంది ఉంటే, తక్కువ ప్రాణనష్టం సంభవించి ఉండేదని చెప్పడం వినవచ్చు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles