25.7 C
Hyderabad
Wednesday, October 2, 2024

‘టిమ్స్’లో వైద్య సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ 113 ఖాళీలకు ఈనెల 27-29 వరకు ఇంటర్వ్యూలు!

హైదరాబాద్: కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న
నేపథ్యంలో వైద్య సంస్థల్లో ఖాళీలను నింపేందుకు కేసీఆర్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గచ్చిబౌలిలోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)లో ఒప్పంద ప్రాతిపదికన వైద్యుల నియామకానికి పచ్చజెండా ఊపింది. శనివారం ఖాళీలపై టిమ్స్ డైరెక్టర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో భాగంగా ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల, మెడికల్ ఆఫీసర్లు కలిపి మొత్తం 113 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నెల 27 నుంచి 29 వరకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అదే ఆసుపత్రిలో వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ వైద్యశాలలో మొత్తం 1500 పడకలున్నాయి. నిమ్స్ తరహాలో సూపర్ స్పెషాలిటీ సేవలను అందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం రెండేళ్ల క్రితం ఏర్పాటు చేసింది. రెండో దశలో కొవిడ్ కేసులు భారీ ఎత్తున పెరగడంతో సంబంధిత సేవల కోసం ఈ ఆసుపత్రిని ఉపయోగించారు. తర్వాత సాధారణ ఓపీ సేవలకు కేటాయించారు. వైద్యులు, ఇతర సిబ్బంది కొరత కారణంగా రోగులు తీవ్ర
ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండో దశలో ఆ లోపం స్పష్టంగా కన్పించింది. అందుబాటులో
ఉన్న వైద్యులు, సిబ్బందితోనే నెట్టుకొచ్చారు. దరఖాస్తులు పరిశీలించి నేరుగా ఇంటర్వ్యూలు
నిర్వహించనుంది.

ఖాళీల వివరాలు:
జనరల్ మెడిసిన్
ప్రొఫెసర్లు 4
అసోసియేట్లు 8
అసిస్టెంట్లు 10

టీబీసీడీ విభాగంలో పోస్టులు:
ప్రొఫెసర్లు 3
అసోసియేట్లు 8
అసిస్టెంట్లు 10

రేడియో డయాగ్నోసిస్ విభాగంలో
ప్రొఫెసర్లు అసోసియేట్లు అసిస్టెంట్లు
1 1 1

అనస్థీషియా విభాగంలో పోస్టులు:

ప్రొఫెసర్లు 1
అసోసియేట్లు 4
అసిస్టెంట్లు 2
మెడికల్ ఆఫీసర్లు 60

దరఖాస్తులు కోసం
www.dme.telangana.gov.in
లేదా
www.tims.hyd,
Telangana.gov.in
వెబ్సైట్లు చూడొచ్చు.

జీతభత్యాలు:
ప్రొఫెసర్: 1.90 లక్షలు
అసిస్టెంట్ ప్రొఫెసర్: 1.25 లక్ష
అసోసియేట్ ప్రొఫెసర్: 1.50 లక్షలు
మెడికల్ ఆఫీసర్: రూ.40,270

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles