32.1 C
Hyderabad
Wednesday, October 2, 2024

జొన్న రైతులకు సీఎం కేసీఆర్‌ గుడ్‌న్యూస్‌

హైదరాబాద్: రాష్ట్రంలో జొన్న రైతులకు సీఎం కేసీఆర్‌ గుడ్‌న్యూస్‌ తెలిపారు. యాసంగి జొన్న పంటకు మద్దతు ధర చెల్లించి రాష్ట్ర ప్రభుత్వమే సేకరించాలని నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మార్క్ ఫెడ్‌ను రాష్ట్ర నోడల్ ఏజెన్సీగా నియమించారు. 2022-23 యాసంగి సీజన్‌లో పండించిన జొన్న(హైబ్రిడ్) పంటను మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

రైతుల ఏవిధమైన నష్టపోకుండా ఉండేందుకు వారికి అండగా నిలిచేందుకు చర్యలు చేపడుతున్నారు. రైతులకు మద్దతు ధర విషయంలో కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధరను ప్రకటించారు. యాసంగి సీజన్‌లో పండిన మొత్తం 65,494 మెట్రిక్ టన్నుల జొన్న పంటను కొనుగోలు చేసేందుకు కావాల్సిన రూ.219.92 కోట్ల రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకు గ్యారెంటి ఇవ్వనున్నది.

తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, కామరెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణపేట్, గద్వాల్ జిల్లాల పరిధిలో జొన్న పంటను పండించిన దాదాపు లక్షమంది రైతులకు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ద్వారా లబ్ది చేకూరనుంది.

అకాల వర్షాల వల్ల నష్టపోయిన లక్ష మందికి పైగా జొన్న రైతులకు భారీ ఊరట కల్పిస్తూ యాసంగి ఉత్పత్తులను కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) చెల్లించి 100 శాతం కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు శుక్రవారం ప్రకటించారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు టీఎస్‌ మార్క్‌ఫెడ్‌ని నియమిస్తూ వ్యవసాయశాఖ కార్యదర్శి ఎం రఘునందన్‌రావు శుక్రవారం ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం, రబీ 2022-23 సీజన్‌లో పండించిన 65,499 మెట్రిక్ టన్నుల జొన్న (హైబ్రిడ్)ను రాష్ట్ర పూల్‌లో MSP కింద మార్క్‌ఫెడ్ కొనుగోలు చేస్తుంది.

జాతీయ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు లేదా నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌సిడిసి) నుండి రూ.219.92 కోట్ల రుణ సదుపాయాన్ని పొందేందుకు రాష్ట్ర మార్క్‌ఫెడ్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మార్క్‌ఫెడ్ ద్వారా పొందే రుణ సదుపాయానికి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇస్తుంది.

 

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles