30.2 C
Hyderabad
Wednesday, October 2, 2024

మహారాష్ట్రలో ‘బీఆర్ఎస్’ సభ్యత్వ నమోదకు అనూహ్య స్పందన!

హైదరాబాద్: మహారాష్ట్రలో బీఆర్ఎస్ జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఊరూవాడా సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరందుకుంది. 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకేసారి సభ్యత్వ నమోదు ప్రారంభించారు. గ్రామ పార్టీ నిర్మాణంతోపాటు, 9 అనుబంధ కమిటీల నిర్మాణం కూడా పోటాపోటీగా సాగుతుంది. తెలంగాణ మోడల్ కి జై అంటున్న వారంతా గులాబి కండువా కప్పుకోడానికి ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా రైతులు, మహిళలు బీఆర్ఎస్ వైపు ఆకర్షితులవుతున్నట్టు స్థానిక నాయకులు చెబుతున్నారు. మే 11న ప్రారంభ‌మైన నెల‌రోజుల పాటు నిర్వ‌హించిన స‌భ్య‌త్వ కార్య‌క్ర‌మాన్ని అనూహ్య‌మైన స్పంద‌న‌తో మరికొన్ని రోజులు పొడిగిస్తున్నారు.

ఇప్పటి వరకు 18,000 గ్రామాలకు పార్టీ కమిటీలను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 41,000 గ్రామాలు, దాదాపు 400 పట్టణ కేంద్రాలు ఉన్నాయి. జూలై చివరి నాటికి మిగిలిన గ్రామాలు, పట్టణ కేంద్రాల్లో పార్టీ సంస్థాగత కమిటీలు పనిచేస్తాయని మహారాష్ట్రలో పార్టీ ప్రచారానికి నాయకత్వం వహిస్తున్న సీనియర్ నాయకులు తెలిపారు.

BRS ఇప్పుడు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో బలీయమైన రాజకీయ శక్తిగా చెప్పుకోవచ్చు. BRS యొక్క ఉనికిని చూసి భయపడి, ఇప్పటికే ఉన్న రాజకీయ పార్టీలు తమ ప్రాభవాన్ని కాపాడుకోవడానికి రంగంలోకి దిగాయి.

25 లక్షల నుంచి 30 లక్షల సభ్యత్వం లక్ష్యంగా పెట్టుకున్న బీఆర్‌ఎస్ లక్ష్యం దిశగా సాగుతోంది.  ఇప్పటికే పలు గ్రామాల నడిబొడ్డున పార్టీ జెండాలు రెపరెపలాడుతున్నాయి. యువకులు, మహిళలు, విద్యార్థులు, గిరిజనులు, ఎస్సీల కోసం గ్రామాల వారీగా పార్టీ ప్యానెళ్లతో గుర్తించబడిన వ్యక్తులు పార్టీ ప్రచార సామగ్రి, సాహిత్యంతో ఇంటింటికీ తిరుగుతున్నారు.

తెలంగాణలో బీఆర్ఎస్ తన పనితీరు కారణంగా ప్రజల మనసును గెలుచుకుంది.  అదే ఉత్సాహంతో  మహారాష్ట్రలోకి ప్రవేశించింది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నినాదం ‘అబ్‌కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌’ సంక్షోభంలో కూరుకుపోయిన వ్యవసాయ రంగంలో నిరుత్సాహానికి గురైన వర్గాలతో అనుసంధానం చేయడంలో ఎంతగానో దోహదపడింది. రైతు బంధు, రైతు బీమా వంటి తెలంగాణ పథకాలు… ఆగ్నేయ మహారాష్ట్రలో కష్టాల్లో ఉన్న రైతు సమాజాన్ని బాగా ఆకట్టుకున్నాయని BRS కిసాన్ సెల్ నాయకుడు మాణిక్ కదమ్ అన్నారు.

జనాలు పెద్దఎత్తున బీఆర్‌ఎస్‌ వైపు మొగ్గు చూపడంతో రాజకీయ నేతలు కూడా అదే మార్గాన్ని ఎంచుకోవాల్సి వచ్చింది. లోక్‌సభ ఎన్నికల్లోనూ, అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేసి గతంలో 30,000 నుంచి రెండు లక్షల వరకు ఓట్లు సాధించిన 60 మంది ముఖ్య నేతలు మరో నెల రోజుల్లో బీఆర్‌ఎస్‌లో చేరనున్నారు.

జూలైలో ఔరంగాబాద్‌లో పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవంతో వీరి చేరిక గడువు ముగిసే అవకాశం ఉంది. ఇన్సాఫ్ పార్టీకి చెందిన నేతలు కూడా బీఆర్‌ఎస్ నాయకత్వంతో టచ్‌లో ఉన్నారు. రాష్ట్రంలో కార్యకలాపాలకు నాయకత్వం వహిస్తున్న BRS సీనియర్ నాయకుడు శంకర్ అన్నా ధోంగే ప్రకారం… ఇన్సాఫ్ పార్టీని బీఆర్‌ఎస్‌లో విలీనం చేయనున్నారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles