26.2 C
Hyderabad
Wednesday, October 2, 2024

కాకతీయ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్.. ఏడుగురు మెడికోలు సస్పెండ్!

వరంగల్ : జూనియర్ విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలపై నగర పోలీసులు కేసు నమోదు చేసిన కాకతీయ మెడికల్ కాలేజీకి చెందిన ఏడుగురు ఎంబీబీఎస్ విద్యార్థులను మంగళవారం మూడు నెలల పాటు సస్పెండ్ చేశారు.

ఈ నేపథ్యంలో వైద్య కళాశాలలో యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశమైంది. దాదాపు ఆరు గంటలపాటు యాంటీ ర్యాగింగ్ సభ్యులు సుదీర్ఘంగా విచారించారు.  బాధిత విద్యార్థిని, సంఘటనలో పాల్గొన్న ఏడుగురు విద్యార్థులను పిలిపించి, సంఘటన గురించి క్షుణ్ణంగా ఆరా తీసింది. “విద్యార్థుల వాంగ్మూలాలు నమోదు చేసుకున్నారు.  ఈ క్రమంలో సెప్టెంబర్ 14వ తేదీన హాస్టల్‌లో ర్యాగింగ్ జరిగిందని కమిటీ నిర్ధారించింది.

ప్రభుత్వ ఆధీనంలోని KMCలో చదువుతున్న ఏడుగురు MBBS విద్యార్థులపై ర్యాగింగ్ , జూనియర్ విద్యార్థిని కొట్టినందుకు నగర పోలీసులు కేసులు నమోదు చేశారు. సీనియర్లు ఎంబీబీఎస్ మూడో సంవత్సరం చదువుతుండగా, జూనియర్ రెండో సంవత్సరంలో ఉన్నారు. ఈ ఘటన సెప్టెంబర్ 14న జరగగా, విద్యార్థిని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

పది రోజుల క్రితం సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలోనూ ర్యాగింగ్ ఘటన జరిగింది. ఈ కేసులో ర్యాగింగ్ కు పాల్పడిన పది మంది ఎంబీబీఎస్ విద్యార్థులపై ఏడాదిపాటు సస్పెండ్ చేశారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles