30.7 C
Hyderabad
Wednesday, October 2, 2024

బీఆర్ఎస్ మేనిఫెస్టోను విడుదల చేసిన సీఎం కేసీఆర్!

హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిస్తే రానున్న ఐదేండ్లలో ప్రజల సంక్షేమం, అభివృద్ధికి ఏం చేయబోతున్నామని వివరిస్తూ ఎన్నికల శంఖారావం పూరించారు. హుస్నాబాద్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రసంగించడం ద్వారా పార్టీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

మేనిఫెస్టో ముఖ్యాంశాలు:

కేసీఆర్ బీమా పేరుతో కొత్త స్కీమ్ అమలు చేస్తామని కేసీఆర్ తెలిపారు. ప్రజలందరికీ రూ.5 లక్షల చొప్పున కేసీఆర్ బీమా అందిస్తామన్నారు. తెల్ల రేషన్ కార్డుదారులందరికీ సన్నబియ్యం, ఆసరా పింఛన్ కు దశల వారీగా నెలకు రూ.5 వేలకు పెంచుతామన్నారు. దళిత బంధు, రైతు బంధు కొనసాగిస్తామన్నారు. మైనార్టీల సంక్షేమానికి బడ్జెట్ పెంచుతామన్నారు. మైనార్టీ జూనియర్ కాలేజీలను డిగ్రీ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేస్తామన్నారు.

వికలాంగుల పింఛన్ ను రూ.6 వేలకు పెంచనున్నారు. బీసీలకు అమలు చేస్తున్న పథకాలను కొనసాగిస్తామన్నారు. గిరిజనేతరులకు కూడా పోడు భూములు అందిస్తాం. కులవృత్తుల వారికి ఆర్థిక సాయం అందిస్తాం. తెలంగాణలో వ్యవసాయ స్థిరీకరణ చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. రైతు బంధు పథకాన్ని రూ. 10 వేల నుంచి రూ.16 వేలకు పెంచుతామన్నారు.

‘అర్హులైన మహిళలకు సౌభాగ్య లక్ష్మి పథకం కింద రూ.3 వేలు అందిస్తాం. అర్హులైన కుటుంబాలకు రూ.400 లకే సబ్సిడీపై సిలిండర్ అందిస్తాం. అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టులకు కూడా రూ.400లకే సిలిండర్ అందిస్తాం. ఆరోగ్య శ్రీ కింద అందించే సేవలను రూ.15 లక్షలకు పెంచుతాం. జర్నలిస్టులకు కూడా ఆరోగ్య శ్రీ లాంటి పథకం అమలు చేస్తామని సీఎం కేసీఆర్ తమ మేనిఫెస్టోలో ప్రకటించారు.

‘పేదలందరికీ ఇళ్లు కట్టి ఇస్తాం. హైదరాబాద్ లో మరో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కటిస్తాం. పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తాం. రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రగతి సాధిస్తున్నాయి. అగ్రవర్ణ పేదల పిల్లలకు నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 రెసిడెన్షియల్ స్కూల్స్ పెడతామని అన్నారు.

ప్రమాదవశాత్తూ వికలాంగుడైనా, ఆరోగ్యం పాడైన, విధివంచితులు, వృద్ధాప్యం వచ్చినవారు, భర్తలు చనిపోయినవారు, ఒంటరి మహిళలు తదితరులను ఆదుకునేందుకు ఆసరా పెన్షన్‌ పథకాన్ని రూ.1,000తో ప్రారంభించాం. ఇప్పుడు రూ.2,016 ఇస్తున్నాం. పెరిగిన ఖర్చులకు అనుగుణంగా ఇప్పుడు రూ.5,000కు పెంచాలని నిర్ణయించాం. ప్రభుత్వం వచ్చాక మొదటి సంవత్సరంలో మార్చి తరువాత రూ.3,000 చేస్తాం. ఏటా రూ.500 చొప్పున పెంచుకుంటూ ఐదేండ్లలో రూ.5,000కు పెంచుతామని హామీ ఇచ్చారు.

ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో జర్నలిస్టులకు వైద్యబీమా కల్పిస్తామన్నారు. స్వశక్తి గ్రూపులకు సొంత భవనాలు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు అనాథల కోసం ఓ పాలసీని రూపొందించనున్నారు. ఇక కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌-(CPS)పై స్కీమ్‌పై అధ్యయనానికి ఓ కమిటీ ఏర్పాటు చేయనున్నారు.

ఎన్నికల మేనిఫెస్టోకు ముందు  తెలంగాణ భవన్‌లో పార్టీ అభ్యర్థులను ఉద్దేశించి 51 మందికి బి-ఫారాలు అందజేసిన ముఖ్యమంత్రి, త్వరలో తెలంగాణ అభివృద్ధి కథను జాతీయ ఎజెండాగా ముందుకు తీసుకువెళతామని ప్రతిజ్ఞ చేశారు.

Related Articles

Stay Connected

915FansLike
4FollowersFollow
41FollowersFollow

Latest Articles